Jump to content

ఎ.కన్యాకుమారి

వికీపీడియా నుండి

అవసరాల కన్యాకుమారి దక్షిణ భారతదేశానికి చెందిన కర్ణాటక సంగీతకారులు, వాయులీన విద్వాంసురాలు.

ఎ.కన్యాకుమారి

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజయనగరం జిల్లా వాస్తవ్యులు. ఆమె నాలుగు దశాబ్దాలుగా చెన్నైలో నివాసముంటున్నారు. ఆమె తల్లిదండ్రులైన అవసరాల రామరత్నం, జయలక్ష్మిలు ఆమెను కర్ణాటక సంగీతంలో కృషిచేయడానికి ప్రోత్సహించారు. ఆమె ప్రముఖ సంగీత గురువులైన ఇవటూరి విజయేశ్వరరావు, ఎం. చంద్రశేఖరన్, ఎం. ఎల్. వసంతకుమారి ల వద్ద శిష్యరికం చేశారు. విజయనగరంలోని కొత్త అగ్రహారంలో ద్వారం నరసింగరావు పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు.

ఆమె తన సంగీత కృతులతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె అంకితభాతం, నిజాయితీలతో ప్రముఖ గురువులైన ఇవటూరి విజయేశ్వరరావు, ఎం.చంద్రశేఖరన్, ఎం. ఎల్. వసంతకుమారి ల వద్ద సంగీత జ్ఞానాన్ని అభ్యసించి, వాయులీన విద్వాంసురాలిగా ఎదిగారు.

ఆవిష్కరణలు , సవాళ్ళు

[మార్చు]

ఆమె విజయవంతంగా కొన్ని ప్రక్రియలను ఆవిష్కరించారు. ఆమె వయోలీన్, వీణ, నాదస్వరం కలయికతో "వాద్య లహరి"ని ఆవిష్కరించారు. ఆమె మూడు వయోలీన్ల వాదనతో వివిధ అష్టకాలను ఒక ప్రత్యేక కోణంలో చిత్రీకరిస్తూ "త్రిషాయి సంగమం"ను సృష్టించారు. ఆమె 25, 50, 75, 100 వయోలీన్ల స్వరాల కలయికతో ప్రదర్శనలిచ్చారు. దానికి "100 రాగామాలికా స్వరాలు" అని నామకరణం చేశారు. 29 గంటల మారథాన్ ప్రదర్శనను ఇచ్చారు.

ఆమె సంగీతానికి తన జీవితాన్ని అంకితం చేసి ఇటీవల ఏడు రాగాలను కంపోజ్ చేసి వాటికి తిరుమలలో ఏడు కొండల పేర్లతో నామకరణం చేశారు.

పురస్కారాలు , గౌరవాలు

[మార్చు]

ఆమె మద్రాసు సంగీత అకాడమీ నుండి సంగీత కళానిధి పురస్కారాన్ని 2016లో పొందారు. ఆ పురస్కారం పొందిన మొదటి వాయులీన విద్వాంసురాలు.[1] ఆమెకు వచ్చిన యితర పురస్కారాలలో

  • పద్మశ్రీ (2015) (భారతదేశ నాల్గవ అత్యున్నత పురస్కారం)
  • సంగీత కళానిధి - 2016
  • తమిళనాడు ప్రభుత్వం చే కలామణై పురస్కారం
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది పురస్కారం
  • ఆల్ ఇండియా రేడియా వారిచే అత్యుత్తమ ర్యాంకు
  • అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని మర్యాలండ్ రాష్ట్రం వారి గౌరవ పౌరసత్వం.
  • చెన్నై లోని సంగీత అకాడమీ చే టి.టి.కె. పురస్కారం
  • శృంగేరీ శారదా పీఠం, అహోబిళం లో ఆస్థాన విధుషి
  • తిరుపతి లోని శ్రీ త్యాగరాజ ఫెస్టివల్ కమిఈ నుండి "సప్తగిరి సంగీత విద్వాన్‌మణి" పురస్కారం.
  • ఎం.ఎస్. సుబ్బలక్ష్మి చే ధనువీణ ప్రవీణ బిరుదు.
  • 2002లో మైలాపూర్ ఫైన్ ఆర్ట్స్ నుండి సంగీత కళా నిపుణ పురస్కారం. [2]
  • 2003 లో సంగీత నాటక అకాడమీ పురస్కారం, 2003
  • 2012 లో కృష్ణ గాన సభ నుండి సంగీత చూడామణి పురస్కారం

ఆమె 2004లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులలో స్థానం సంపాదించారు. ఆమె వాయులీన విద్వాంసురాలిగా చేసిన వివిధ ప్రక్రియలలో సాధించిన విజయాలకు గానూ ఈ పురస్కారాన్ని అందించారు.

బోధన

[మార్చు]

She is a dedicated teacher and has taught numerous students in India and abroad, many of whom are very popular artists. She teaches without a price tag and generously encourages students to participate in full measure. She has also released Violin Lessons Tutorial videos for students who do not have access to learn directly from a guru. These videos are available for purchase at kanyalessons.com [3]

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]

[[వర్గం:పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు]]