ఎ.వి.ఎన్.జగ్గారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎ.వి.ఎన్.జగ్గారావు ధ్రవిశ్వవిద్యాలయం సెనేట్ సభ్యునిగా సేవలనందించారు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఎ.వి.ఎన్.జగ్గారావు 1927లో అంకితం వెంకట భానోజీరావు, ఎ.వి.రమాదేవి దంపతులకు జన్మించారు. ఆయన కామర్స్ లో ఆనర్స్ డిగ్రీని ఎకనమిక్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ లో పూర్తిచేసారు. ఆయన ప్రజాజీవితంలోఅనేక పదవులను చేపట్టారు.

ఆయన ఆధ్రవిశ్వవిద్యాలయం సెనేట్ సభ్యునిగా సేవలనందించారు. 1950లో విశాఖపట్నం మ్యునిసిపాలిటి కౌన్సిలర్ గా సేవలనందించారు. ఇండియన్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ 1952-54 ఆర్టిలరీ రెజిమెంటులో సభ్యునిగా ఆయన ఉన్నారు.

ఆయన విశాఖపట్నం పోర్టు ట్రస్టుకు ట్రస్టీ సభ్యులలో ఒకరు. ఎ.పి.స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ కంపెనీలకు నామినీగా యున్నారు. దక్షిణ జోన్ లోని ఎగుమతి-దిగుమతి అడ్వయిజరీ కమిటీ సభ్యునిగా యున్నారు.[1]

ఆయన మిసెస్ ఎ.వి.ఎన్.కళాశాల, విశాఖపట్నం నకు ఉపాధ్యక్షులు, కరస్పాండెంట్ గా యున్నారు. ఆయన శ్రీ సీతారామస్వామి దేవాలయానికి వారసత్వ ట్రస్టీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఆయన నేచురల్ హిస్టరీ సొసైటీకి ఉపాధ్యక్షులుగానూ, రోటరీ ఇంటర్నేషనల్ కు ఉపాధ్యక్షులుగానూ, వాల్తేరు క్లబ్ అధ్యక్షునిగానూ, విశాఖ హిస్టారికల్ సొసైటీకి అద్యక్షునిగాను ఉన్నారు.

ఆయన భారతదేశంలోని బ్రిటిష్ & అమెరికన్ మల్టీ నేషనల్స్, ప్రైవేటు ఇండస్ట్రీస్ లతో 40 సంవత్సరాల విశేషానుభవం ఉంది.

ఆయన ప్రపంచంలో అనేక దేశాలకు తన భార్య ఇంద్రాణి జగ్గారావుతోకలసి పర్యటించారు. ఆయన అనేక ఇండస్ట్రీస్ కాంప్లెక్స్ లను సందర్శించారు. ఆయనకు మతం, విద్య, పఠనం, ఫోటోగ్రఫీ లపై ఆసక్తి ఎక్కువ.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Shri Raja A.V. Jagga Row Bahadur". vizagcityonline.com/. Retrieved 15 May 2016.

ఇతర లింకులు

[మార్చు]