అంకితం వెంకట జగ్గారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంకితం వెంకట జగ్గారావు
జననంఅంకితం వెంకట జగ్గారావు
1866
విశాఖపట్నం
మరణం1921
ప్రసిద్ధివృక్ష శాస్త్రవేత్త
మతంహిందూ
తండ్రిఅంకితం వెంకట నరసింగరావు
తల్లిఅచ్చీయమ్మ

అంకితం వెంకట జగ్గారావు (1866-1921) విశాఖపట్నం జిల్లా ప్రముఖులు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన విశాఖపట్నంలో 1866న అంకితం వెంకట నరసింగరావు, అచ్చీయమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రిగారు విశాఖపట్నం జిల్లాకు డిప్యూటీ కలెక్టరుగా పనిచేసారు. ఆయన తల్లి యొక్క తండ్రి అయిన గోడే వెంకట జగ్గారావు ప్రసిద్ధ జోతిష్య, ఖగోళ శాస్త్ర ప్రముఖులు. ఆయన లండన్ మిషన్ హైస్కూలులో ప్రాథమిక విద్యనభ్యసించారు. తన తండ్రికి ఖగోళ శాస్త్రం పై ఉన్న అభిరుచితో ఆయనను ఖగోళ శాస్త్రవేత్తగా తిర్చిదిద్దాలనుకున్నాడు. కాని ఆయనకు నాటకాలు, ఉద్యానవన శాస్త్రం పై అభిరుచి ఎక్కువ. ఆయన విజ్ఞా శాస్త్ర పాండిత్యము గలవానిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన యూరప్తో పాటు అనేక దేశాలను పర్యటించారు. అనేక విషయాలను తెలుసుకున్నారు.[1]

ఆయన తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన ఎస్టేట్ వ్యవహారలను 1898 నుండి చూస్తున్నారు. ఆయన తన తండ్రి నిర్వహించిన ఖగోళ శాస్త్ర వేథశాల, తన తల్లి ప్రారంభించిన ఫోటోగ్రాఫీ నక్షత్రశాలను నిర్వహించారు. ఆయన స్వయంగా భారతదేశంలో గల మూడు ప్రసిద్ధ అయస్కాంత వేథశాలలో ఒకదానిని స్థాపించారు. ఆ కాలంలో భూకంపాల గూర్చి తెలుసుకొనేందుకు భూకంప అబ్సర్వేటరీని స్థాపించారు.

ఆయనకు ఉద్యానవన శాస్త్రంపై గల అభిరుచితో ఇంటర్నేషనల్ అసోసియేషన్ బొటానిక్స్ లో సభ్యుడుగా ఉన్నారు. అనేక అరుదైన వృక్ష జాతులను సేకరించారు.

ఆయనకు కళలపై ఉన్న అభిరుచితో అనేక దేశాలను సందర్శించారు. ఆయన వద్ద పారిస్ వద్ద సేకరించిన అసలైన చిత్రాలు ఉండేవి.

ఆయన 1900లో ఇంగ్లాండ్ పర్యటించారు. అచట విక్టోరియా మహారాణి, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ను కలిసారు. అక్కడ కొంతకాలం ఉన్న తదుపరి ఆయన రాయల్ ఆస్ట్రానామికల్ సొసైటీ సభ్యునిగా ఎన్నికైనారు. రాయల్ మెటరాలాజికల్ సొసైటీ, రాయల్ కొలోనియల్ ఇనిస్టిట్యూట్, సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ లలో సభ్యత్వాన్ని పొందారు. ఆయన అనేక నక్షత్రశాలను సందర్శించారు. ఆయన పారిస్, స్విడ్జర్లాండ్, ఇటలీ దేశాలకు పర్యటించారు. అచట అనేక అపురూపమైన చిత్రాలను సేకరించారు. ఆయన వద్ద 10000 వాల్యూమ్స్ గల అందమైన గ్రంథాలయం ఉండెడిది. అందులో విజ్ఞానశాస్త్రం, ఆంగ్ల సాహిత్యం, భారతీయ విజ్ఞాన సర్వస్వాలు ఉండేవి.[1]

ఆయన స్వంత ఖర్చుతో ఒక వైద్యశాలను కట్టించారు. విశాఖపట్నం ప్రజలకు ఆ కాలంలో వైద్య సహాయాన్ని అందిందుటకు ఈ వైద్యశాల ఉపయోగపడేది.

పురస్కారాలు[మార్చు]

ఆయనకు ఇంగ్లాండ్ నుండి విక్టోరియా మహారాణి యొక్క కాంస్య విగ్రహం పురస్కారంగా వచ్చింది.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "Shri Raja A.V. Jagga Row Bahadur". vizagcityonline. Retrieved 15 May 2016.

ఇతర లింకులు[మార్చు]