Jump to content

అంకితం వెంకట భానోజీరావు

వికీపీడియా నుండి
అంకితం వెంకట భానోజీరావు

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1955
తరువాత తెన్నేటి విశ్వనాథం
నియోజకవర్గం విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1890-10-01) 1890 అక్టోబరు 1 (వయసు 134)
విశాఖపట్నం
మరణం 1978
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు అంకితం వెంకట జగ్గారావు

అంకితం వెంకట భానోజీరావు ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు. ఆయన తూర్పు విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి శాసస సభ్యునిగా 1955, 1962 లలో గెలుపొందారు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన అక్టోబరు 1 1890 న జమీందారీ వంశంలో అంకితం వెంకట జగ్గారావుకు జన్మించారు. అతను సామ్యవాదిగా పెరిగారు. అట్లాగే ఆయనను విశాఖపట్నం వాసులు సేవ ఆధారిత పరోపకారి అని పిలిచేవారు. ఆయన సి.బి.ఎం. హైస్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడు అనేక క్రీడలలో పాల్గొనేవారు. ముఖ్యంగా ఫుట్‌బాల్ ఆయనకు యిష్టమైన ఆట. ఆయన ఆ క్రీడలో అనేక పతకాలను పొందారు. ఆయన తన తండ్రితో అనేక ప్రాంతాలను సందర్శించి అనేక పుస్తకాలను అధ్యయనం చేసారు.[1]

1932లో విజయవాడలో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని విశాఖపట్నం తరలించేటప్పుడు ఆయన తన భూమిలో మూడవ వంతు దానం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆయన విశాఖపట్నం లోని ప్రముఖ వైద్యశాల అయిన కింగ్ జార్జి హాస్పటల్ కు కూడా భూమిని, ధనాన్ని యిచ్చి నిర్మాణానికి సహాయపడ్డారు. తాడిపూడి జలాలను విశాఖపట్నం తరలించాలనే ఆలోచన ఆయనదే. ఆయనతో సన్నిహిత సంబంధాలున్న వాల్‌చంద్ హరచంద్, వారి మధ్య గల స్నేహం మూలంగా విశాఖపట్నంలో హిందూస్థాన్ షిప్‌యార్డ్ నెలకొల్పబడింది.

ఆయన ప్రారంభించిన "ఎ.వి.భానోజీరావు & గరుడ పట్టాభిరామయ్య" షిప్పింగ్ ఏజెన్సీ యిప్పటికీ కూడా అంకితం కుటుంబాలచే నడుపబడుతున్నది.

రాజకీయ రంగం

[మార్చు]

ఆయన తండ్రి మరణించిన తదుపరి క్రియాశీల రాజకీయాలలోనికి ప్రవేశించారు. ఆయన జస్టిస్ పార్టీలో చేరి పనగల్ రాజావారితో కలసి పనిచేసారు. ఆయన 1955-1972 మధ్య తూర్పు విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికైనారు.[2] 1930-1938, 1951-1958, 1960-1962 లలో ఆయన విశాఖపట్నం మ్యునిసిపల్ చైర్మన్ గా వ్యవహరించారు. ఆయన ఎన్నో ప్రజోపయోగమైన పనులు చేసారు.[1]

ఆయన 1962-1965 మధ్య ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ డిపార్టుమెంటుకు చైర్మన్ గానూ, ప్రోటెం స్పీకరుగాను వ్యవహరించారు. ఆయన హంగేరీ దేశాన్ని దందర్శించారు. ఆయన జపాన్ దేశ ఆహ్వానంతో టోక్యోలో జరిగిన ఎక్స్పో 70 సభకు హాజరయ్యారు.

ఆయన శ్రీ సీతారామస్వామి దేవస్థానం నకు వారసత్వ ట్రస్టీగా వ్యవహరించారు. తరువాత ఈ బాధ్యతను విశాఖ ప్రజలకు అప్పగించారు. ఆయన ప్రజాసేవా తత్పరుడే కాకుండా తత్త్వవేత్తగా ఆధ్యాత్మిక సేవలనందించారు. ఆయన ఆ దేవస్థానానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసారు. ఆయన తిరుపతి తిరుమల దేవస్థాన ట్రస్టు బోర్డు సభ్యునిగా రెండేళ్ళపాటు సేవలనందించారు. ఆయన తిరుమల వేంకటేశ్వరునికి వజ్రాల కిరీటం బహుమానంగా యిచ్చారు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Shri Raja A.V. Jagga Row Bahadur". Retrieved 15 May 2016.
  2. ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్.సత్యనారాయణరావు, గుంటూరు. p. 8. Retrieved 9 June 2016.

ఇతర లింకులు

[మార్చు]