ఐఎన్ఎస్ అరిఘాత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరిహత్ తరగతి జలాంతర్గామి - చిత్రకారుని ఊహ
History
భారతదేశం
పేరు: ఐఎన్‌ఎస్ అరిఘాత్
నిర్మాణ సంస్థ: నౌకానిర్మాణ కేంద్రం (SBC), విశాఖపట్నం[1]
నిర్మాణం మొదలైనది: 2011[2]
జలప్రవేశం: 2017 నవంబరు 19[3]
కమిషనైనది: 2024 ఆగస్టు 29
స్థితి: క్రియాశీలంగా ఉంది
సాధారణ లక్షణాలు
తరగతి, రకం: అరిహంత్-class బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి
రకం: బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి
డిస్‌ప్లేస్‌మెంటు: 6,000 టన్నులు
పొడవు: 111.6 మీ.
బీమ్: 11 మీ.
డ్రాఫ్ట్: 9.5 మీ.
స్థాపిత సామర్థ్యం: 1 x CLWR-B1 కాంపాక్ట్ లైట్ వాటర్ రియాక్టరు,[4][5] 83 MW[3]
ప్రొపల్షన్: 1 × ప్రొపెల్లర్ షాఫ్టు, న్యూక్లియర్ మరీన్ ప్రొపల్షన్
వేఘం:

తేలినపుడు: 12–15 knots (22–28 km/h)

మునిగినపుడు: 24 knots (44 km/h)
పరిధి: ఆహార సరఫరాల కోసం తప్పితే అపరిమితం
మనుగడ: నిర్వహణ, ఆహార సరఫరాల కోసం తప్పితే అపరిమితం
పరీక్షా లోతు: 300 మీ. (980 అ.) నుండి 400 మీ. (1,300 అ.) దాకా[6]
సెన్సార్లు,
ప్రాసెసింగ్ వ్యవస్థలు:
  • USHUS సోనార్
  • పంచేంద్రియ సోనార్ (ఏకీకృత జలాంతర్గామి సోనార్, నియంత్రణ వ్యవస్థ, జలాంతర సమాచార వ్యవస్థ) [7]
ఆయుధాలు:
  • 6 × 533 mమీ. (21 అం.) టార్పెడో ట్యూబులు- అంచనా. 30 ఛార్జిలు (టార్పెడోలు, క్షిపణులు లేదా మందుపాతరలు)
  • 4 వర్టికల్ లాంచింగ్ వ్యవస్థ ద్వారా-
  • [8]

ఐఎన్ఎస్ అరిఘాత్ అనేది అరిహంత్-తరగతి జలాంతర్గాముల్లో ఉన్నతీకరించిన రకం.[9][10][11] అణు జలాంతర్గాములను నిర్మించడానికి చేపట్టిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెస్సెల్ (ఏటివి) ప్రాజెక్టులో భాగంగా భారతదేశం విశాఖపట్నం నౌకా నిర్మాణ కేంద్రంలో తయారు చేసిన రెండవ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఇది.[12] దీనికి కోడ్ పేరు S3.[3][13][14]

అరిఘాత్‌ను 2017 లో గోప్యంగా జలప్రవేశం చేయించారు. దాని సామర్థ్యాల గురించీ, స్థితి గురించీ బహిరంగంగా పెద్దగా ప్రకటించలేదు. ఈ జలాంతర్గామిని మొదట ఐఎన్ఎస్ అరిదమన్ అని పిలిచేవారు. కానీ జలప్రవేశం తర్వాత ఐఎన్ఎస్ ఆరిఘాత్ అని పేరు మార్చారు. 2021 ప్రారంభంలో విడుదల చేసిన నివేదికల ప్రకారం, 2021 చివరిలో ఐఎన్ఎస్ విక్రాంత్ పాటు దాన్ని కమిషన్ చేయవలసి ఉంది.[15]

వివరణ

[మార్చు]

ఈ పడవలో ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ (పిడబ్ల్యుఆర్) ద్వారా శక్తినిచ్చే ఏడు-రెక్కల ప్రొపెల్లర్ ఉంది. ఇది ఉపరితలంపై ఉన్నప్పుడు గరిష్టంగా 12-15 నాట్లు (′ID2] km/ మునిగినప్పుడు 24 నాట్లు (44 km/h) వేగాన్ని సాధించగలదు.[16][17][18] పిడబ్ల్యుఆర్ అనేది ఐఎన్ఎస్ అరిహంత్ కు శక్తినిచ్చే రియాక్టరుకు ఉన్నతీకరించిన రూపం. మునుపటి తరం కంటే పిడబ్ల్యుఆర్‌ చాలా తక్కువ శబ్దం చేస్తుంది. తద్వారా శత్రు నౌకలకు దీన్ని గుర్తించడం కష్టతరం అవుతుంది.[19]

ఐఎన్‌ఎస్ అరిహంత్ మాదిరిగానే ఇందులో కూడా, దాని హంప్ లో నాలుగు క్షిపణి ప్రయోగ గొట్టాలున్నాయి. ఇందులో 12 కె-15 సాగరిక క్షిపణులను (750 కి.మీ పరిధి), లేదా నాలుగు కె-4 క్షిపణులను (3,500 కి.మీ పరిధి) వరకు మోసుకెళ్లగలదు.[3][20]

స్థితి

[మార్చు]

ఐఎన్ఎస్ అరిఘాత్‌ 2017 నవంబరులో జలప్రవేశం చేసింది.[3] దీన్ని 2021 లో కమిషను చేస్తారని తొలుత భావించారు.[3][21] అయితే, హిందూస్తాన్ టైమ్స్ లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం ఈ కమిషన్ ను 2024 కి వాయిదా వేశారు.[22][23] విస్తృతమైన పరీక్షలు, నవీకరణల తరువాత ఐఎన్ఎస్ అరిఘాత్‌ను 2024 ఆగస్టు 29 న భారత నావికా దళంలో చేర్చారు (కమిషను చేసారు). విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఈ కమిషన్ వేడుక జరిగింది.[24][25][26]

ఐఎన్ఎస్ అరిహంత్ కంటే ఐఎన్ఎస్ ఆరిఘాత్‌లో ఎక్కువ స్వదేశీ కంటెంటు ఉంది. దానికంటే గణనీయంగా మరింత అధునాతనమైనది. 750 కిలోమీటర్ల శ్రేణి క్షిపణులు మాత్రమే ఉన్న అరిహంత్‌కు ప్రతిగా, అరిఘాత్‌లో కె-15 సాగరిక, కె-4 క్షిపణులు ఉన్నాయి.[27]

మూలాలు

[మార్చు]
  1. S. Anandan (14 January 2012). "Second nuclear submarine headed for year-end launch". The Hindu. Retrieved 2 June 2013.
  2. PETR TOPYCHKANOV (15 July 2015). "Indo-Russian naval. cooperation: Sailing high seas". Russia&India Report. Retrieved 15 July 2015.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "A peek into India's top secret and costliest defence project, nuclear submarines". India Today. 7 December 2017. Archived from the original on 20 April 2019. Retrieved 11 December 2017. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "launched" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. "Founder's Day Speech, Director, BARC" (PDF). Bhabha Atomic Research Centre. 30 October 2018. Retrieved 21 March 2021.
  5. "DAE Excellence in Science, Engineering & Technology Awards 2010" (PDF). BARC Newsletter (322): 33. September–October 2011. Archived from the original (PDF) on 15 May 2013. Retrieved 21 March 2021.
  6. "Arihant-class submarines". Defence News. Archived from the original on 2014-08-26. Retrieved 23 June 2021.
  7. "Retrieved on 2016-10-21". Archived from the original on 2 May 2013. Retrieved 29 December 2012.
  8. Pike, John (27 July 2009). "Advanced Technology Vessel (ATV)". globalsecurity.org. Archived from the original on 29 August 2011. Retrieved 24 January 2011.
  9. "Needed, a nuclear triad". Sunday-guardian.com. Archived from the original on 3 May 2014. Retrieved 2 June 2013.
  10. General, Lt. "Indian Navy's Capability Perspective – SP's Naval Forces". Spsnavalforces.net. Archived from the original on 3 July 2013. Retrieved 23 June 2013.
  11. "India To Construct Two More Arihant Nuclear Submarines For Navy". Defence Now. 28 February 2012. Archived from the original on 12 July 2015. Retrieved 2 June 2013.
  12. "Ensuring India's Qualitative Military Edge". SHARNOFF'S GLOBAL VIEWS. 10 April 2013. Retrieved 9 June 2013.
  13. Anandan, S. (2014-12-20). "INS Arihant may be of limited utility". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-06-30.
  14. "India's Nuclear Triad is now Fully Operational". Vivekananda International Foundation (in ఇంగ్లీష్). 2018-12-11. Retrieved 2019-07-02.
  15. Gupta, Shishir (2021-03-10). "Eye on China, India's plan for 6 nuclear-powered attack submarines back on track". Hindustan Times. New Delhi. Retrieved 2021-03-11.
  16. "SSBN Arihant Class Submarine, India". naval-technology.com. Retrieved 2 June 2013.
  17. "INS Arighaat: How a second nuclear submarine boosts India's strategic reach". India Today (in ఇంగ్లీష్). 2024-08-31. Retrieved 2024-09-10.
  18. "India to commission second Arihant-class submarine in 2021". Default (in ఇంగ్లీష్). 2020-12-22. Retrieved 2024-09-10.
  19. "How Refined 83 MW PWR on INS Arighat Boosts its Stealth and Endurance Compared to INS Arihant". Defence.in (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-09-08. Retrieved 2024-09-10.
  20. "INS Arihant returned yesterday from 20-day deterrent patrol". India Today (in ఇంగ్లీష్). 5 November 2018. Retrieved 2019-10-13.
  21. Pubby, Manu (2020-02-21). "India's Rs 1.2 lakh crore nuclear submarine project closer to realisation". The Economic Times. Retrieved 2020-02-21.
  22. Shishir Gupta (19 February 2023). "Aircraft carrier INS Vikramaditya is back on high seas". Hindustan Times. Archived from the original on 19 February 2023. Retrieved 16 April 2023.
  23. Redacción (2024-05-29). "The Indian Navy is preparing to commission the second of its new nuclear-powered ballistic missile submarines". Zona Militar (in స్పానిష్). Retrieved 2024-05-29.
  24. "India commissions INS Arighat: Know all about Navy's 2nd nuclear-powered submarine". The Times of India. 2024-08-29. ISSN 0971-8257. Retrieved 2024-08-29.
  25. "INS Arighaat: All About India's 2nd Nuclear Ballistic Submarine". NDTV.com (in ఇంగ్లీష్). Retrieved 2024-08-29.
  26. "Second Arihant-Class submarine 'INS Arighaat' commissioned into Indian Navy in the presence of Raksha Mantri in Visakhapatnam". Press Information Bureau. 2024-08-29. Retrieved 2024-08-30.
  27. "INS Arighaat fitted with 3,500 km strike range missiles, 70 pc indigenous content". ANI. 2024-09-06. Retrieved 2024-09-07.