Jump to content

ఐనంపూడి (ముదినేపల్లి)

వికీపీడియా నుండి
ఐనంపూడి
—  రెవిన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముదినేపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521343
ఎస్.టి.డి కోడ్ 08677

ఐనంపూడి కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ భౌగోళికం

[మార్చు]

సముద్రమట్టానికి 8 మీ.ఎత్తులో ఉంది.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

ముదినేపల్లి, సింగరాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 60 కి.మీ.దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్ పాఠశాల.

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఐనంపూడి, శ్రీహరిపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ బలుసులమ్మ అమ్మ వారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో 2014, జూన్-10,11,12 తేదీలలో శ్రీ బలుసులమ్మ జాతర వైభవంగా నిర్వహించారు. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని, అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. ప్రత్యేకపూజలు చేసి, 101 బిందెలతో అభిషేకాలు చేసారు. భక్తులు అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, పొంగళ్ళు నైవేద్యంగా సమర్పించారు. కుంకుమపూజలు చేసి మొక్కుబడులు తీరుకున్నారు. శ్రీహరిపురం, సింగరాయపాలెం, కోమర్రు, వడాలి, కాకరవాడ, ముదినేపల్లి తదితర గ్రామాలనుండి భక్తులు తరలి రావడంతో, ఐనంపూడి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ తొణికిసలాడింది.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]