వడాలి
వడాలి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | ముదినేపల్లి |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 3,791 |
- పురుషుల సంఖ్య | 1,892 |
- స్త్రీల సంఖ్య | 1,899 |
- గృహాల సంఖ్య | 1,109 |
పిన్ కోడ్ | 521325. |
ఎస్.టి.డి కోడ్ | 08674. |
'వడాలి కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 325., యస్.ట్.డీ కోడ్=08674.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
వడాలికి ఇంకో పేరు కూడా ఉంది "చిన్న పూరీ".
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్
సమీప మండలాలు[మార్చు]
గుడ్లవల్లెరు, గుడివాడ, మండవల్లి, కైకలూరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
గుడివాడ నుండి బస్సు సౌకర్యం ఉంది. ముదినేపల్లి నుండి బస్సు లేదా ఆటోలో ఇక్కడికి చేరుకోవచ్ఛు.
ముదినేపల్లి, సింగరాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 60 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లాపరిషత్ హైస్కూల్, గాయత్రి విద్యానికేతన్, వడాలి
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ సుభద్రా బలరామ సమేత శ్రీ జగన్నధస్వామివారి ఆలయం[మార్చు]
శ్రీ సుభద్రా బలరామ సమేత శ్రీ జగన్నాధస్వామివారి ఆలయం:- పురాతన చరిత్రగల అన్నాచెల్లెళ్ళకు ఉన్న ఏకైక ఆలయం ఇది. అన్న బలరామ, జగన్నాధులతో కలిసి, చెల్లెలు సుభద్ర దర్శనమిచ్చే ఏకైక దేవాలయంగా ఇది ప్రసిద్ధికెక్కినది. ఈ ఆలయాన్ని 1765 లో నిర్మాణంచేసి స్వామివారి విగ్రహాలను ప్రతిష్ఠించి, గ్రామానికి వ్యాధాళి గా నామకరణం చేసినట్లు చరిత్ర ఆధారంగా చెప్పుచున్నారు. అప్పటి నుండి ఈ క్షేత్రం చిన్న పూరీ గా ప్రసిద్ధి చెంది భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్నది. అప్పటి ఆలయం శిథిలావస్థకు చేరుకొనడంతో, 2011 లో ఆలయ పునర్నిర్మాణం ప్రారంభించి, 2009, మార్చి-5వ తేదీనాడు నూతన ఆలయంలో పునఃప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలు[మార్చు]
ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశి మొదలు వైశాఖ బహుళ విదియ వరకు ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించెదరు. త్రయోదశినాడు ఉదయం స్వామివారిని పెళ్ళికుమారునిగా చేసెదరు. చతుర్దశినాడు సాయంత్రం ఎదురుకోలు ఉత్సవం, స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించెదరు. వైఆఖ పౌర్ణమి నాడు రాత్రి ఏడు గంటలకు స్వామివారి రథోత్సవం, పాడ్యమినాడు చక్రస్నానం, పూర్ణాహుతి, విదియనాడు పవళింపుసేవ, విశేష పూజలు నిర్వహించెదరు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి రోజూ రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. [2]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, చిరుధాన్యాలు, కూరగాయలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం
గ్రామ ప్రముఖులు[మార్చు]
ఇది ప్రముఖ మృదంగ వాదన నిపుణులు వారణాసి ఘంటయ్య శాస్త్రి గారి జన్మస్థానం.
గ్రామ విశేషాలు[మార్చు]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 3,791 - పురుషుల సంఖ్య 1,892 - స్త్రీల సంఖ్య 1,899 - గృహాల సంఖ్య 1,109;
- జనాభా (2001) -మొత్తం 4011 - పురుషులు 2006 -స్త్రీలు 2005 -గృహాలు 1087 -హెక్టార్లు 463
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Mudinepalle/Vadali". Retrieved 4 July 2016. External link in
|title=
(help)
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు కృష్ణా; 2016, మే-19; 11వపేజీ.