పెనుమల్లి (ముదినేపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెనుమల్లి
—  రెవిన్యూ గ్రామం  —
పెనుమల్లి is located in Andhra Pradesh
పెనుమల్లి
పెనుమల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°23′27″N 81°06′08″E / 16.390824°N 81.102223°E / 16.390824; 81.102223
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముదినేపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,246
 - పురుషుల సంఖ్య 636
 - స్త్రీల సంఖ్య 610
 - గృహాల సంఖ్య 343
పిన్ కోడ్ 521325
ఎస్.టి.డి కోడ్ 521325

పెనుమల్లి, కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామం

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,246 - పురుషుల సంఖ్య 636 - స్త్రీల సంఖ్య 610 - గృహాల సంఖ్య 343
జనాభా (2001) -మొత్తం 1202 -పురుషులు 613 -స్త్రీలు 589 -గృహాలు 315 -హెక్టార్లు 299

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు[మార్చు]

గుడ్లవల్లేరు, గుడివాడ, పెదపారుపూడి, మండవల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల ప్రిషత్ పాఠశాల, పెనుమల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ముదినేపల్లి, గుడ్లవల్లేరు నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్: విజయవాడ 57 కి.మీ

గ్రామ ప్రత్యేకత[మార్చు]

పెనుమల్లి గ్రామం పేరుకి చిన్న గ్రామమైనా, ఇపుడు ఈ గ్రామం పేరు రాష్ట్రాలు దాటి దేశమంతటా వినిపించుచున్నది. పదుల నుండి, వందలు, వేలమందికి భోజనాలు ఒంటిచేతితో వండి వడ్డించడం వీరి ప్రత్యేకత. ఇక వంటలలో రుచులంటారా - - - "ఆహా ఏమి రుచి" అనక మానరు. ఆంధ్ర సాంప్రదాయక వంటకాలకు పెట్టింది పేరు. నలభీములను తలపించేలా వంటచేయడం వీరికే చెల్లింది. గ్రామంలో దాదాపు 125 కుటుంబాలు ఉండగా, ఇంటికొకరు చొప్పున, 125 మంది వంటమేస్త్రీలుగా ఉన్నారు. ఆంధ్రాతోపాటు, కర్నాటక, చెన్నై, గంగోత్రి, కోయంబత్తూరు, తదితర ప్రాంతాలలో వందల కార్యక్రమాలకు వీరు వంటలు చేసారు. ఈ గ్రామానికి చెందిన వారు, వంటచేయని ప్రదేశం అంటూ లేదు. ఇక్కడ వంటలు నేర్చుకొని, పలువురు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో వంట మేస్త్రీలుగా పనిచేయుచున్నారు. హైదరాబాదు, రాయచూరు, బళ్ళారి, దావణగిరి, గంగావతి, చెన్నై, బరంపురం, రాజమండ్రి, నకిరేకల్లు, కలకత్తా తదితర ప్రాంతాలకు సైతం ఇక్కడి వంట మేస్త్రీలను తీసికొని వెళ్ళుచున్నారు. వీరు ఎందరో ప్రముఖుల ఇళ్ళలో శుభకార్యాలకు, వేలాదిమందికి వంటలుచేసి, మన్ననలను పొందినారు. [ఈనాడు కృష్ణా; 2014,సెప్టెంబరు-20; 9వపేజీ]

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mudinepalle/Penumalli". Retrieved 4 July 2016. External link in |title= (help)[permanent dead link]