సింగరాయపాలెం (ముదినేపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింగరాయపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
సింగరాయపాలెం is located in Andhra Pradesh
సింగరాయపాలెం
సింగరాయపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°24′44″N 81°09′08″E / 16.412153°N 81.152220°E / 16.412153; 81.152220
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముదినేపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,602
 - పురుషుల సంఖ్య 809
 - స్త్రీల సంఖ్య 793
 - గృహాల సంఖ్య 417
పిన్ కోడ్ 521329
ఎస్.టి.డి కోడ్ 08674

సింగరాయపాలెం, కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 329., ఎస్.టి.డి.కోడ్ = 08674.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు[మార్చు]

గుడ్లవల్లేరు, గుడివాడ, మండవల్లి, బంటుమిల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ముదినేపల్లి, సింగరాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 63 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ ఉన్నత పాఠశాల, శ్రీ సాయి పబ్లిక్ పాఠశాల,సింగరాయపాలెం

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం[మార్చు]

  1. సింగరాయపాలెం-చేవూరుపాలెం కూడలిలో వేంచేసియున్న ఈ ఆలయంలో మార్గశిరమాసంలో షష్ఠి మహోత్సవాలు ఘనంగా జరుపుతారు. తెప్పోత్సవం గూడా వైభవంగా నిర్వహించెదరు. బాణాసంచా, కోలాటం, కూచిపూడి, భరతనాట్యం వగైరాలు గూడా ఏర్పాటుచేసెదరు. [1]
  2. ఈ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే సుబ్రహ్మణ్యస్వమి షష్ఠి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ, 2014,నవంబర్-5, బుధవారం నాడు, రాట (ముహూర్తం) పూజను, ఆలయంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ, ప్రత్యేకపూజలను నిర్వహించి, మామిడి తోరణాలతో అలంకరించిన రాటను పాతినారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, చేవూరిపాలెం, శ్రీహరిపురం గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాట అనంతరం షష్ఠి కార్యక్రమాలు శరవేగంగా నిర్వహించెదరు. ఈ ఆలయంలో నవంబర్-27 నుండి ప్రారంభమయ్యే మహోత్సవాలు, అత్యంత వైభవంగా నిర్వహించాలని, భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. [3]

శ్రీ భావాజీ మఠం (శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానం)[మార్చు]

బంజారాల ఆరాధ్యదైవమైన శ్రీ సంత్ సేవాదాస్ మహారాజ్ సన్నిధి (బావాజీ మఠం) లో, శ్రీరామనవమి సందర్భంగా, ప్రతి సంవత్సరం, సీతారాముల కళ్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. ఈ వేడుకలకు, ఖమ్మం, నల్లగొండ, వరంగల్లు జిల్లాల నుండి లంబాడాలు ఇక్కడకు వచ్చి, ఐదురోజులపాటు ఉత్సవాలలో పాల్గొంటారు. మిగిలిన సమయంలో మ్రొక్కుబడులు తీర్చుకొనటానికి ఇక్కడకు వచ్చెదరు. మఠం సంప్రదాయాల ప్రకారం, బంజారాల ఆచారాల ననుసరించి, స్వామివారికి భోగ్ కళ్యాణ వేడుకలు నిర్వహించెదరు. స్వామివారినీ, అమ్మవారినీ, గరుడవాహనంపై ప్రధాన రహదారిలో ఎదురుకోలు సన్నాహం నిర్వహించెదరు. కళ్యాణం అనంతరం, బంజారాలు, వృద్ధులు సైతం ఉత్సాహంగా నృత్యాలు చేసెదరు. ఇక్కడ స్వామివారికి 300 ఎకరాల భూమి ఉంది. [2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,602 - పురుషుల సంఖ్య 809 - స్త్రీల సంఖ్య 793 - గృహాల సంఖ్య 417
జనాభా (2001) -మొత్తం 1489 -పురుషులు 767 -స్త్రీలు 722 -గృహాలు 397 -హెక్టార్లు 208

మూలాలు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2013,డిసెంబరు-13; 6వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2014,ఏప్రిల్-9; 7వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,నవంబర్-6; 7వపేజీ.


  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mudinepalle/Singarayapalem". Retrieved 4 July 2016. External link in |title= (help)