వాడవల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాడవల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముదినేపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,966
 - పురుషుల సంఖ్య 952
 - స్త్రీల సంఖ్య 1,014
 - గృహాల సంఖ్య 554
పిన్ కోడ్ 521329
ఎస్.టి.డి కోడ్ 08674

వాడవల్లి, కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 329., ఎస్.టి.డి.కోడ్ = 08674.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు[మార్చు]

గుడ్లవల్లేరు, బంటుమిల్లి, మండవల్లి, పెడన

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

సింగరాయపాలెం, అల్లూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 68 కి.మీ

గ్రామములోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల[మార్చు]

శ్రీ గాలి రాజేంద్రప్రసాదు, మండలంలోని మారుమూల గ్రామమైన వాడపల్లిలోని ఈ పాఠశాలలో, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వృత్తిజీవితంలో నిత్యం అవసరమయ్యే ఎన్నో విలువైన అంశాలను సంక్షిప్తీకరించి, సాధారణ పదాలలోనికి మార్చి, వారి చరవాణు (సెల్ ఫోన్) లకు సందేశాన్ని పంపుచున్నారు.ఈ విలువైన సమాచారం అందించడానికి www.krishnateachers.tk అను ఒక వెబ్ సైటును గూడా రూపొందించారు. ఈ వెబ్ సైటును ఇంతవరకు, రెండు లక్షలమంది వీక్షించారు.నెట్ కనెక్షను లేకపోయినా, చరవాణి ద్వారా అందిన ఈ సమాచారం చాలామందికి ఉపయుక్తంగా ఉంటున్నది. [2]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ విఘ్నేశ్వర, శ్రీ వల్లీ దేవసేన సమేత శివ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివార్ల ఆలయం:- వాడవల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయ, విగ్రహ ప్రతిష్ఠ, 2014, జూన్-2 సోమవారం నాడు ఉదయం 8-11 గంటలకు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాడవల్లి, ఉరిమి తదితర గ్రామాలనుండి భక్తులు పెద్ద యెత్తున తరలివచ్చారు. అనంతరం నిర్వహించిన అన్నసమారాధనలో, ఐదువేలమందికి పైగా భక్తులు పాల్గొని స్వామివారి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,966 - పురుషుల సంఖ్య 952 - స్త్రీల సంఖ్య 1,014 - గృహాల సంఖ్య 554
జనాభా (2001) -మొక్త్తం 2026 -పురుషులు 999 -స్త్రీలు 1027 -గృహాలు 532 -హెక్టార్లు 822

మూలాలు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2014, జూన్-3; 16వ పేజీ. [2] ఈనాడు కృష్ణా; 2015, మార్చి-20; 9వ పేజీ.

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mudinepalle/Vadavalli". Retrieved 4 July 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=వాడవల్లి&oldid=2564281" నుండి వెలికితీశారు