ఐసోటోనులు
ఐసోటోనులు అనగా సమాన సంఖ్యలో న్యూట్రాన్ లను కలిగిఉండి, విభిన్న సంఖ్యలలో ప్రోటాన్లను కలిగిఉండే వేర్వేరు పరమాణు కేంద్రకాలు. ఉదాహరణకు బోరాన్-12, కార్బన్-13 కేంద్రకాలు 7 న్యూట్రాన్లను మాత్రమే కలిగి యుంటాయి. అందువల్ల వాటిని ఐసోటోనులు అంటారు. అదే విధంగా 36S, 37Cl, 38Ar, 39K,, 40Ca కేంద్రకాలన్నీ ఒకే సంఖ్య గల (20 న్యూట్రాన్లు) కలిగి యున్నందున ఇవన్నీ ఐసోటోనులవుతాయి. గ్రీకు పదం "ఒకే విధమైన సాగుదల" అనే అర్థం ఒకే విధంగా ఉన్నప్పటికీ ఈ పదాన్ని జెర్మన్ భౌతిక శాస్త్రవేత్త కె.గుగ్గెన్‌హైమెర్[1] ఐసోటోపు (isotope) యొక్క ఆంగ్లపదంలో "p" అనే అక్షరం ఒకే విధమైన ప్రోటాన్లు ఉన్న కేంద్రకాలను సూచిస్తే, ఒకే విధమైన న్యూట్రాన్లు కలిగియున్న కేంద్రకాలను ఐసోటోపుల ఆంగ్లపదంలో "p" స్థానంలో "n"ను చేర్చాడు.[2]
స్థిరంగా ఉన్న అతి ఎక్కువ సంఖ్యలో గల ఐసోటోనులు (50) కలవి (ఐదు: (five: 86Kr, 88Sr, 89Y, 90Zr, 92Mo), 82 కలిగినవి ఆరు: (six: 138Ba, 139La, 140Ce, 141Pr, 142Nd, 144Sm). స్థిరమైన ఐసోటోనులు లేని న్యూట్రాన్ సంఖ్యలు 19, 21, 35, 39, 45, 61, 89, 115, 123,, 127 లేదా మరికొన్ని ఉండవచ్చు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఐసోటోపులు అనునవి సమాన సంఖ్యలో ప్రోటాన్లు కలిగిన ఒకే మూలకానికి చెందిన కేంద్రకాలు: ఉదా: కార్బన్-12, కార్బన్-13.
- ఐసోబారులు అనగా ఒకే సంఖ్యలో ద్రవ్యరాశి సంఖ్యలు కలిగిన వేర్వేరు మూలకాల కేంద్రకాలు. ఉదా: కార్బన్-12, బోరాన్-12.
- కేంద్రక ఐసోమెర్లు అనగా వివిధ ఉద్రిక్త స్థాయిలు కలిగిన ఒకే రకమైన కేంద్రకాలు.
మూలాలు
[మార్చు]- ↑ http://jnm.snmjournals.org/content/19/6/581.full.pdf
- ↑ Pauling, Linus (1998). General Chemistry. Dover. p. 94. ISBN 0-486-65622-5.