Jump to content

ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్

వికీపీడియా నుండి
(ఐ.ఆర్.సి.టి.సి నుండి దారిమార్పు చెందింది)
ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్
తరహాపబ్లిక్ కంపెనీ
స్థాపన27 సెప్టెంబరు 1999;
25 సంవత్సరాల క్రితం
 (1999-09-27)
ప్రధానకేంద్రమున్యూ ఢిల్లీ, భారతదేశం
కార్య క్షేత్రంభారతదేశం
పరిశ్రమరైల్వే
ఉత్పత్తులురైల్ నీర్
సేవలు
రెవిన్యూIncrease 4,270 crore (US$530 million) (FY24)[1]
నిర్వహణ లాభంIncrease 1,580 crore (US$200 million) (FY24)[1]
నికర ఆదాయముIncrease 1,111 crore (US$140 million) (FY24)[1]
యజమానిభారత ప్రభుత్వం (62.4%)

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అనేది ప్రభుత్వ యాజమాన్యం లోని భారతీయ రైల్వేలకు టికెటింగు, ఆహార సరఫరా, పర్యాటక సేవలను అందించే భారత ప్రభుత్వ రంగ సంస్థ. దీన్ని 1999 లో భారత ప్రభుత్వం స్థాపించింది. ఇది రైల్వే మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉంటుంది. 2019 లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో ఇది నమోదైంది. యాజమాన్యంలో ప్రభుత్వానికి 67% వాటా ఉంది. 2023 డిసెంబరు నాటికి, IRCTCలో 6.6 కోట్ల మంది నమోదిత వినియోగదారులు ఉన్నారు. సగటున రోజుకు 7.31 లక్షల టిక్కెట్లు బుక్కవుతున్నాయి.

చరిత్ర

[మార్చు]

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ను (IRCTC) 1999 సెప్టెంబరు 27 న స్థాపించారు. ఇది భారతీయ రైల్వేలలో బ్గాగంగా ఉండే, పూర్తిగా భారత ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ.[2] 2008 మేలో ఇది మినీరత్న పబ్లిక్ కార్పొరేషన్‌గా వర్గీకరించారు. దీంతో కొంతవరకు ఆర్థిక స్వయంప్రతిపత్తి కలిగింది.[2] 2018లో అప్పటి రైల్వే మంత్రి పీయూష్ గోయల్, IRCTCలో పెట్టుబడుల ఉపసంహరణ కోసం ప్రభుత్వం అవకాశాలను అన్వేషిస్తోందని చెప్పాడు.[3]

2019 లో కంపెనీ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో నమోదైంది. దీని తర్వాత భారత ప్రభుత్వ వాటా 87%కి తగ్గింది. మిగిలిన షేర్లు పబ్లిక్‌గా ట్రేడవుతున్నాయి.[4][5] 2020 డిసెంబరులో భారత ప్రభుత్వం IRCTCలో తన వాటాలో మరో 20% అమ్మేసి, వాటాను 67%కి తగ్గించుకుంది.[6][7][8] 2022 డిసెంబరులో ప్రభుత్వం తన వాటాలో మరో 5% తగ్గించుకుని వాటాను 62.4%కి తగ్గించుకుంది.[9]

సేవలు

[మార్చు]

టికెటింగు, సమాచారం

[మార్చు]

భారతీయ రైల్వేలు ఆన్‌లైన్లో టికెట్ల అమ్మకం IRCTC ద్వారా 2002 ఆగస్టు 3 న ప్రవేశపెట్టారు.[10] IRCTC వెబ్‌సైట్, స్మార్ట్‌ఫోన్ యాప్‌లు, SMS ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకునే వీలు కలిగిస్తుంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసిన టిక్కెట్‌లకు (e-tickets) IRCTC, PNR తో ఎలక్ట్రానిక్ టిక్కెట్‌ను జారీ చేస్తుంది. [11] చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపుతో పాటు ప్రయాణానికి ఈ ఎలక్ట్రానిక్ టిక్కెట్లను ఉపయోగించవచ్చు, రద్దు కూడా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు.[11][12] ఆన్‌లైన్‌లో ఇంటర్నెట్ టిక్కెట్‌లు (ఐ-టికెట్‌లు) బుకింగు చేసుకున్నప్పుడు, భౌతిక టిక్కెట్లను పోస్ట్ ద్వారా వినియోగదారుకు పంపిస్తారు.[11]

టిక్కెట్‌లను 120 రోజుల ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ధృవీకరించబడిన రిజర్వేషన్ టిక్కెట్‌లపై ప్రయాణీకుల వివరాలు, టిక్కెట్‌పై వారికి కేటాయించిన బెర్త్ లేదా సీట్ నంబర్(ల)తో పాటు ధరల వివరాలు ఉంటాయి. ధృవీకరించబడిన రిజర్వేషన్ లేని పక్షంలో, వెయిట్-లిస్ట్ (WL) నంబరు కేటాయిస్తారు. రైలు ప్రారంభ, గమ్యస్థాన స్టేషన్‌లను బట్టి వివిధ రకాల వెయిటింగ్-లిస్ట్‌లు ఉన్నాయి. ఇప్పటికే రిజర్వు చేసిన టిక్కెట్‌లు రద్దైతే, వెయిటింగ్-లిస్ట్ టిక్కెట్లను నిర్ధారిస్తారు. రైలు బయలుదేరే ముందు వరకూ సీట్లు నిర్ధారణ కాకపోతే, వాటంతటవే రద్దైపోతాయి.[13]

రద్దయ్యే టిక్కెట్‌ల స్థానంలో రిజర్వేషన్ (RAC) అనేది స్లీపర్ క్లాస్‌లలో కన్ఫర్మ్ టిక్కెట్లకు, వెయిటింగ్ లిస్టుకూ మధ్య ఉండే మధ్యంతర రకం. ఈ టిక్కెట్లు కలిగిన వారు, రైలు ఎక్కవచ్చు, బెర్త్‌ను పంచుకోవచ్చు.[14] తక్కువ వ్యవధిలో ప్రయాణించాలనుకునే ప్రయాణీకులు తత్కాల్ కోటా (TQ) ద్వారా ఎక్కువ ఛార్జీలతో టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో కొన్న ధ్రువ టిక్కెట్‌లను రద్దు చేస్తే డబ్బు వాపసు రాదు.[15] ఈ తత్కాల్ పద్ధతికి ప్రత్యేకంగా ఒక వెయిటింగు లిస్టు (TQWL) ఉంటుంది.

2011లో, IRCTC తరచుగా ప్రయాణించే వారి కోసం శుభ్ యాత్ర అనే లాయల్టీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో ప్రయాణీకులు ముందస్తు వార్షిక చందాను చెల్లించి, అన్ని టిక్కెట్‌లపై తగ్గింపులను పొందవచ్చు.[16] 2012 లో IRCTC రోలింగ్ డిపాజిట్ స్కీమ్ (RDS)ను ప్రవేశపెట్టింది. ఇది ఒక రకమైన క్లోజ్డ్ వాలెట్. ఇందులో కస్టమర్‌లు డబ్బును డిపాజిట్ చేసుకుని, ఆ డబ్బును ఉపయోగించి టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.[17] 2013 లో ఆన్‌లైన్ రిజర్వేషన్ సేవల్లో భాగంగా విమాన, హోటల్ బుకింగ్ సేవల కూడా చేర్చారు.[18] 2016 లో IRCTC తక్కువ స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌లలో బుకింగు చేసుకోవడానికి వీలుగా తన వెబ్‌సైటుకు తేలికపాటి వెర్షన్‌ను ప్రారంభించింది.[19] 2019 ఆగస్టు 7 న IRCTC iMdra పేరుతో చెల్లింపు వాలెట్‌ను ప్రారంభించింది.[20][21] 2021 ఆగస్టు 11 న IRCTC స్మార్ట్ కార్డ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా రిజర్వ్ చేయని రైలు టిక్కెట్‌లను రైల్వే స్టేషన్‌లలో లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.[22] IRCTC రైళ్ళ, టికెటింగులకు సంబంధించిన సమాచారాన్ని ప్రయాణీకులకు SMS ద్వారా అందిస్తుంది.[23]

IRCTC నిర్వహిస్తున్న ఫుడ్ ప్లాజా

క్యాటరింగు, ఆతిథ్యం

[మార్చు]

భారతీయ రైల్వేలు నిర్వహించే అన్ని రైళ్లలో ఆహారాన్ని అందచేయడానికి IRCTCకి ప్రత్యేక హక్కులు ఉన్నాయి. సుదూర, మధ్యస్థ దూర రైళ్లకు ప్యాంట్రీ కార్లు ఉంటాయి. వీటిలో ఆహారాన్ని తయారు చేస్తారు. రైలు రకం, వసతి తరగతిని బట్టి ముందుగా వండిన భోజనాన్ని కూడా అందించవచ్చు.[24] IRCTC వివిధ రైల్వే స్టేషన్లలో ఫుడ్ ప్లాజాలు, ఫలహారశాలలు, రిఫ్రెష్‌మెంట్ గదులను కూడా నిర్వహిస్తోంది.[25] 2014 లో IRCTC ఇ-క్యాటరింగ్ సేవలను ప్రారంభించింది. ఇది ప్రయాణీకులు ప్రైవేట్ రెస్టారెంట్ల నుండి ఆన్‌లైన్ ద్వారా గానీ, ఫోన్ ద్వారా గానీ ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి వీలు కలిగిస్తుంది. ఆహారం వారి సీట్ల వద్దకే అందిస్తారు.[26][27] IRCTC ప్రధాన రైల్వే స్టేషన్లలో ఎయిర్ కండిషన్డ్ వెయిటింగ్ లాంజ్‌లు, రిటైరింగ్ రూమ్‌లు, బడ్జెట్ హోటళ్ళను కూడా నిర్వహిస్తుంది.[28][29][30] 2003 లో IRCTC "రైల్ నీర్" అనే నీళ్ళ బాటిల్ బ్రాండును ప్రారంభించింది, దీనిని రైళ్లలో, రైల్వే స్టేషన్లలో విక్రయిస్తారు.[31][32][33]

రైలు కార్యకలాపాలు

[మార్చు]

IRCTC మహారాజాస్ ఎక్స్‌ప్రెస్, డెక్కన్ ఒడిస్సీ వంటి లగ్జరీ రైళ్లను విభిన్న తరగతులతో ఇతర ప్రత్యేక పర్యాటక రైళ్లను నిర్వహిస్తోంది.[34] వీటిలో ప్రామాణిక కోచ్‌లు, సవరణలతో కూడిన సాధారణ కోచ్‌లు, కూపేలు, ప్రత్యేక క్యాబిన్‌లు, సూట్‌లతో ప్రత్యేకంగా రూపొందించిన కోచ్‌లు ఉంటాయి.[35]

IRCTC భారతీయ రైల్వేల సమన్వయంతో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా నడుపుతోంది.[36] 2020 లో IRCTC మొదటి ప్రైవేట్ రైలు, న్యూఢిల్లీ నుండి లక్నో వరకు నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను నడపడం ప్రారంభించింది.[37] [38] IRCTC అహ్మదాబాద్-ముంబై సెంట్రల్ తేజస్ ఎక్స్‌ప్రెస్, కాశీ మకహల్ ఎక్స్‌ప్రెస్‌లను కూడా నడుపుతోంది.[39]

ప్రయాణం, బీమా

[మార్చు]

IRCTC దేశీయ, విదేశీ పర్యాటకుల కోసం పర్యటన ప్యాకేజీలను కూడా నిర్వహిస్తుంది.[40] IRCTC ప్లాట్‌ఫారమ్ ద్వారా థర్డ్ పార్టీలతో సమన్వయంతో హోటల్, ఫ్లైట్, టాక్సీ, ఆహార డెలివరీతో సహా వివిధ సేవలను కూడా నడుపుతోంది.[41]

IRCTC మూడవ పార్టీ బీమా సంస్థ ద్వారా ప్రయాణీకులకు ప్రయాణ బీమాను అందిస్తుంది. 2018 లో ఒక భద్రతా పరిశోధకుడు, IRCTC అందించే ఉచిత ప్రయాణ బీమా పథకం కారణంగా వారి యాప్‌లోని వినియోగదారులను థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌కు దారి మళ్లించడానికి కారణమైందనీ, సుమారు 2 లక్షల మంది ప్రయాణికుల సమాచారాన్ని రెండేళ్లపాటు బహిర్గతమై ఉందనీ వెల్లడించాడు.[42][43] ప్రతిస్పందనగా, IRCTC, ముందు బీమా పథకాన్ని నిలిపివేసి, ఈ డేటాను బహిర్గతం చేసిన దోషాన్ని పరిష్కరించింది.[44]

ఇతరాలు

[మార్చు]

2020 మేలో IRCTC కోవిడ్-19ని ట్రాక్ చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య సేతు యాప్‌ను రూపొందించింది.[45] 2020 మేలో రైలు ప్రయాణానికి ఈ యాప్ తప్పనిసరి చేసారు.[46] 2020 జూన్‌లో, కర్ణాటక హైకోర్టు ఆదేశాల తర్వాత ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఐచ్ఛికమనీ, రైలు ప్రయాణానికి అది తప్పనిసరి కాదనీ ప్రభుత్వం స్పష్టం చేసింది.[47]

పోషణ

[మార్చు]

2023 డిసెంబరు నాటికి, IRCTCలో 6.6 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. రోజుకు సగటున 7.31 లక్షల టిక్కెట్లు బుక్కవుతున్నాయి. అదే వినియోగదారు డేటాను పంచుకునేలా IRCTC, మూడవ పక్షాలతో సమన్వయంతో వివిధ సేవలను ప్రారంభిస్తుంది.[48]

2016 లో మహారాష్ట్ర పోలీసులు, IRCTCలో నమోదు చేసుకున్న కోటి మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందని నివేదించారు.[49] ఆ నివేదికను పరిశీలించడానికి IRCTC, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) అధికారులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. వారి పరిశీలనలో IRCTC వద్ద ఉన్న డేటా సురక్షితంగా ఉందనీ, థర్డ్ పార్టీలతో పంచుకున్న డేటా కొంత లీక్ అయి ఉండవచ్చనీ ప్రకటించింది.[50][51][52][53] 2020 అక్టోబరులో డార్క్ వెబ్‌లో 9 లక్షల మందికి పైగా ప్రయాణీకుల డేటా కనిపించింది. IRCTC ఆ లీక్‌ను ఖండించింది.[54]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "IRCTC Annual Report FY24" (PDF).
  2. 2.0 2.1 "Indian Railway Catering & Tourism Corporation Limited". Business Standard. Retrieved 1 August 2023.
  3. "Indian Railways: Would you like railways to sell your personal data to a private company?". The Economic Times. 21 July 2018. Archived from the original on 27 August 2022. Retrieved 14 December 2020.
  4. "IRCTC IPO off to a strong start, subscribed 81% amid strong demand from retail on Day 1". Moneycontrol. 30 September 2019. Archived from the original on 1 October 2019. Retrieved 1 October 2019.
  5. Narayanan, KS Badri (3 October 2019). "With an oversubscription of 112 times, IRCTC's stock offer is a showstopper". Business Line. Archived from the original on 17 October 2019. Retrieved 18 December 2020.
  6. "IRCTC Offer For Sale Successful, Government Prunes Stake By 20%". NDTV. 13 December 2020. Archived from the original on 20 December 2020. Retrieved 18 December 2020.
  7. Kaur, Avneet (16 December 2020). "11% down in a week, IRCTC share to come down after OFS share allotment: Analysts". mint. Archived from the original on 16 December 2020. Retrieved 18 December 2020.
  8. "Centre launches IRCTC share offer to raise Rs 4,374 crore". The Indian Express. 11 December 2020. Archived from the original on 11 December 2020. Retrieved 18 December 2020.
  9. "Govt to sell 5% of its holding in IRCTC; OFS begins today". The Hindu. 15 December 2022. Retrieved 1 December 2023.
  10. "About IRCTC". IRCTC. Retrieved 1 December 2023.
  11. 11.0 11.1 11.2 "E ticket and I ticket". Indian Railways. Retrieved 1 January 2024.
  12. Provision for carrying proof (PDF) (Report). Indian Railways. Retrieved 1 December 2023.
  13. "What do WL, RSWL, PQWL, GNWL on train tickets mean? Know all about railway codes". DNA. Retrieved 27 April 2024.
  14. "Indian Railways Reservation Rules: 5 Things To Know About Waitlisted Tickets". NDTV. 30 May 2018. Retrieved 1 December 2023.
  15. "Tatkal Ticket Booking: Charges, timings, cancellation and more". The Times of India. 2 March 2018. Archived from the original on 12 June 2018. Retrieved 1 December 2023.
  16. "IRCTC launches scheme for frequent travellers". The Times of India. 8 July 2011. ISSN 0971-8257. Archived from the original on 24 June 2023. Retrieved 23 June 2023.
  17. "IRCTC to launch 'Rolling Deposit Scheme' for e-ticket". The Economic Times. 28 August 2012. Retrieved 23 September 2013.
  18. "IRCTC website gets 4x faster". Archived from the original on 11 September 2013. Retrieved 31 August 2013.
  19. "IRCTC Lite Version For Tatkal Launched". IRCTC. 28 May 2016. Archived from the original on 6 August 2017. Retrieved 15 May 2017.
  20. "IRCTC iMudra payment wallet: Here's everything you need to know". www.timesnownews.com (in ఇంగ్లీష్). 6 August 2019. Archived from the original on 6 August 2019. Retrieved 12 March 2020.
  21. "IRCTC launches iMudra wallet to provide you hassle-free payment experience". Zee Business. 7 August 2019. Archived from the original on 15 May 2021. Retrieved 12 March 2020.
  22. "IRCTC Latest News: Now You Can Easily Recharge Smart Cards To Get Unreserved Train Tickets". India News (in ఇంగ్లీష్). 11 August 2021. Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.
  23. "Now get SMS delay alerts at halt stations; service extended to 1,104 more trains". The Economic Times. 3 June 2018. Archived from the original on 10 April 2018. Retrieved 9 April 2018.
  24. Pantry car equipment (PDF) (Report). Indian Railways. Retrieved 1 December 2023.
  25. "IRCTC orders closure of all onboard catering services in mail, express trains from Mar 22". The Economic Times. Archived from the original on 12 August 2021. Retrieved 12 August 2021.
  26. "IRCTC to resume e-catering services in phases from February". Hindustan Times (in ఇంగ్లీష్). 22 January 2021. Archived from the original on 12 August 2021. Retrieved 12 August 2021.
  27. eCatering, IRCTC. "Authorized eCatering IRCTC Partners for Food delivery in train". IRCTC. Retrieved 2 November 2023.
  28. "IRCTC Railway Retiring Room Booking Online". IRCTC. 7 March 2023. Archived from the original on 9 March 2023. Retrieved 9 March 2023.
  29. G, Jasjeev (26 February 2018). "New Delhi Railway station: Luxury at railway station you may not know of". The Times of India. Archived from the original on 30 August 2021. Retrieved 30 August 2021.
  30. "Rly give permission to zonal divisions to decide on reopening of retiring rooms". mint (in ఇంగ్లీష్). 3 March 2021. Archived from the original on 30 August 2021. Retrieved 30 August 2021.
  31. Arora, Rajat (23 May 2018). "Indian Railways | Rail Neer: Railways may put Rs 1k crore into 11 new Rail Neer bottling units". The Economic Times. Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.
  32. "Can Rail Neer Be The Ace In The Pack For IRCTC As It Navigates Coronavirus Turbulence?". Moneycontrol. Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.
  33. "Railways' bottled water plant goes on stream". The Times of India. 6 May 2003. ISSN 0971-8257. Retrieved 25 October 2023.
  34. "Great Rail Journeys". The Daily Telegraph. Retrieved 4 April 2018.
  35. "About us, Golden chariot". Indian Railways. Retrieved 1 December 2023.
  36. Ramachandran, L. L.; Radhakrishan Pillai, R.; Sebastian, M. P. (2018). Indian Railway Catering and Tourism Corporation Limited (IRCTC): Scaling Beyond Ticketing. London: Indian Institute of Management, Kozhikode. doi:10.4135/9781529709032. ISBN 978-1-5297-0903-2.
  37. "IRCTC's 'private' Tejas Express to resume services from October 17". The Indian Express. 7 October 2020. Archived from the original on 24 October 2020. Retrieved 18 December 2020.
  38. "Railways' first private train sees strong bookings. Delhi-Lucknow Tejas features". Mint. 23 September 2019. Archived from the original on 24 September 2019. Retrieved 25 September 2019.
  39. Saluja, Nishtha. "Tejas Express: Railways Minister Piyush Goyal to flag off India's second private train on Friday". The Economic Times. Archived from the original on 21 May 2021. Retrieved 21 May 2021.
  40. "5 most luxurious trains in India". India Today. Archived from the original on 11 February 2023. Retrieved 23 June 2023.
  41. "Leaked data is not ours, claims IRCTC". Governance Now. 6 May 2016. Archived from the original on 25 September 2020. Retrieved 14 December 2020.
  42. "Did IRCTC bug leave 2 lakh passengers' information exposed to hackers for 2 years?". Business Today. 12 November 2018. Archived from the original on 21 June 2021. Retrieved 14 December 2020.
  43. "How a free travel insurance offer on the Indian Railways website left data of 200,000 passengers exposed to hackers for two years". Business Insider. Archived from the original on 24 May 2022. Retrieved 14 December 2020.
  44. Christopher, Nilesh. "IRCTC wakes up after 2 years to fix its security bug". The Economic Times. Archived from the original on 13 May 2019. Retrieved 14 December 2020.
  45. "Amid data privacy issues Indian Railways makes Aarogya Setu mandatory for passengers". The Statesman. 12 May 2020. Archived from the original on 29 September 2020. Retrieved 14 December 2020.
  46. "Indian Railways makes Aarogya Setu app mandatory for train travel". The Times of India. 12 May 2020. Retrieved 1 December 2023.
  47. Plumber, Mustafa (12 June 2020). "Aargoya Setu Installation Not Mandatory For Travel By Air, Rail: Centre Tells Karnataka HC". Livelaw. Archived from the original on 1 December 2020. Retrieved 14 December 2020.
  48. "Leaked data is not ours, claims IRCTC". Governance Now. 6 May 2016. Archived from the original on 25 September 2020. Retrieved 14 December 2020.
  49. Mehta, Manthank (5 May 2016). "IRCTC website hacked, information of lakhs feared stolen". The Times of India. Archived from the original on 13 August 2022. Retrieved 14 December 2020.
  50. "IRCTC denies data theft reports, sets up probe panel". The Indian Express. 6 May 2016. Archived from the original on 8 November 2020. Retrieved 14 December 2020.
  51. "IRCTC Data Not Leaked, Everything Safe: Officials". NDTV. Archived from the original on 25 August 2019. Retrieved 14 December 2020.
  52. "IRCTC hacking: Railways claims no leakage of 'sensitive' data". The Hindu. 5 May 2016. Archived from the original on 11 April 2021. Retrieved 14 December 2020.
  53. "IRCTC denies website hack, says everything is safe and secure". The Economic Times. Archived from the original on 4 October 2022. Retrieved 14 December 2020.
  54. "User data of more than 900,000 leaked from IRCTC last year, resurfaces on dark web". 16 October 2020. Archived from the original on 13 January 2021. Retrieved 14 December 2020.

మూస:Public Sector Undertakings in India