ఒక చరిత్ర కొన్ని నిజాలు (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక చరిత్ర కొన్ని నిజాలు
ఒక చరిత్ర కొన్ని నిజాలు పుస్తక ముఖ చిత్రం
కృతికర్త: దగ్గుబాటి వెంకటేశ్వరరావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): మనో విజ్ఞాన గ్రంథం
ప్రచురణ: నివేదితా పబ్లికేషన్స్, ఇంటి నెంబరు 8-2-674/2/బ్/4/29, ఫ్లాట్ నెంబర్ 65, రోడ్ నెంబర్ 13, బంజారా హిల్స్, హైదరాబాద్
విడుదల: ఫిబ్రబరి-2009
పేజీలు: 198

ఒక చరిత్ర కొన్ని నిజాలు, ప్రముఖ రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన పుస్తకము. ఇతను తన రాజకీయ అనుభవాలను ప్రజలకు వివరించే ప్రయత్నంలో ఈ పుస్తకం రాసాడు. ఇతను భారత రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన నందమూరి తారక రామారావుకు అల్లుడు. రామారావు కుమార్తె, ప్రముఖ రాజకీయనాయకురాలు అయిన దగ్గుబాటి పురంధేశ్వరిని వివాహం చేసుకున్నాడు.

కొన్ని విశేషాలు

[మార్చు]

ఈ పుస్తకంలోని కొన్ని విశేషాలు.

  • రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించాలని నిర్ణయించుకునే సందర్భంతో ఈ పుస్తకం ప్రారంభమౌతుంది. తర్వాత దానిని పత్రికా ప్రకటన ద్వారా ప్రజలందరితో పంచుకోవడం, దానిని ప్రజామోదం లభించడంతో పార్టీ కార్యక్రమాలు ఊపందుకుంటాయి.
  • రామారావు చైతన్య రథానికి మొదట వాహన చోదకునిగా ఉన్నది నందమూరి హరికృష్ణ కాదు. రెడ్డి అనే వేరొక వ్యక్తి.

బయటి లంకెలు

[మార్చు]