Jump to content

ఒడ్డెవారు

వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని ఒడ్డెర వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)

ఒడ్టేర గ్రామాల్లో చెరువుల్నీ, నూతుల్నీ, కాలువల్నీ త్రవ్వేవారు. ఎక్కడ ఆ పనులుంటే అక్కడకు వెళుతూ సంచారము చేస్తారు. కష్టజీవులు, పనిలో నిమగ్న మైనప్పుడు కష్టాన్ని మరిచి పోవడానికి పదాలు పాడుతూ వుంటారు. వాటినే వడ్డెర వుప్పర పదా లంటారు. వడ్డేర వారికే మరో పేరు వుప్పర, వీరి వెంటే ఎల్లమ్మ దేవత విగ్రహాన్ని తీసుకు పోతూ వుంటారు. ప్రతి సంవత్సరమూ జాతర చేస్తారు. వారి కులంలో వారే పూజారిగా వుంటారు. జాతర సమయంలో అటలతో పాటలతో చిందులు వేస్తారు. వడ్డెర ఉప్పర వారు పచ్చబొట్లు పొడుస్తారు.

ఒకప్పుడు ఇళ్లు నిర్మించాలంటే ముందుగా వడ్డెరులను సంప్రదించే వారు. ఇల్లుకు సరిపడా రాళ్లు సరఫరా చేసేవారు. ప్రస్తుతం యంత్రాల వాడకంతో వడ్డెరులు పనిని కోల్పోయారు.జాయింట్‌ క్రషర్‌మిషన్ల వినియోగంతో వీరి ఉపాధికి గండి పడుతుంది. పెద్ద పెద్ద క్వారీల వద్ద, ప్రాజెక్టుల వద్ద గుడిసెలను వేసుకొని జీవించే వీరి జీవితాలకు రక్షణ కొరవడింది. ప్రమాదవశాత్తు ఏదన్నా ప్రమాదం జరిగితే వీరి గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. వీరంతా అసంఘటితంగా పనిచేస్తుండటం వీరి దౌర్భాగ్యానికి మరో కారణం. పనిచేసే ప్రదేశాల్లో వీరికి కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం వీరిని బిసీలుగా గుర్తించినప్పటికీ సహజంగా సంచార జాతులు కావడంతో ఎస్టీల లక్షణాలు ఉన్నాయి. వీరిని ఎస్టీల్లో చేర్చాలనడానికి ప్రధాన కారణం లంబాడీలు, ఎరుకలు, యానాదులు, వడ్డెరలు.... వంటి వారిని విముక్తి జాతులుగా గతంలో పరిగణించారు. కాగా కాలక్రమేణా లంబాడీ, ఎరుకల, యానాదులను ఎస్టీల్లో గుర్తించారు కాని వడ్డెరులను మాత్రం విస్మరించారు.తమను ఎస్టీల్లో చేర్చాలంటూ వడ్డెరులు కోరుతున్నారు.