ఒత్తిడి
ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనిషి సాగించే ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి అన్ని విషయాల్లో వేగం పెంచాడు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తప్ప అన్నింటిలో దూసుకుపోతున్నారు. ఈ బిజీ బిజీ లైఫ్ లో ఒత్తిళ్ళతో సత మతమవుతున్నారు. ఈ ఒత్తిడే మనిషిపాలిట శాపంగా మారుతోంది. తాజా సర్వేలు దాదాపు 70 శాతం ఆరోగ్య సమస్యలు కేవలం ఒత్తిడి వల్లే వస్తున్నాయని తేల్చాయి. ఒత్తిడి మన శరీరం పైన అంతటా ప్రభావం చూపిస్తుంది. శరీరం లోని ప్రతి భాగం దీని ప్రభావం వల్ల అనేక సమస్యలకు లోనవుతుంది. ఒత్తిడి వల్ల కోపం, బాధ లాంటి నెగటివ్ ఎమోషన్స్ పెరిగి యాంగ్జయిటీ, డిప్రెషన్లకు దారితీస్తాయి. శారీరకంగా కూడా ఒత్తిడి ప్రభావం ఉంటుంది. అసిడిటీ, అల్సర్ల లాంటి సాధారణ సమస్యల నుంచి గుండె, బీపీ, మధుమేహం, కిడ్నీ సమస్యల దాకా అనేక రకాల జబ్బులను మోసుకొస్తుంది మానసిక ఒత్తిడి. అంతేకాదు.. మానసిక ఒత్తిడి పెరిగితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లకు గురవుతారు. అందుకే మనం ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు జలుబు, దగ్గు, జ్వరం లాంటివి కనిపిస్తాయి. అందుకే వీటిని సైకోసొమాటిక్ సమస్యలు అంటారు.
ఒత్తిడి
[మార్చు]మానసికమైనా లేదా జీవసంబంధమైనా ఒత్తిడి అనేది ఆయా పర్యావరణ పరిస్థితికి జీవి ప్రతిస్పందన.[1]ఒత్తిడికి గురైనప్పుడు జీవి ప్రతిస్పందనల ఉద్దీపనల ద్వారా, శరీరంలోని అనేక వ్యవస్థలు ప్రతిస్పందిస్తాయి.[2] మానవులు ఇంకా చాలా క్షీరదాలలో, అటోనమిక్ నాడీ వ్యవస్థ, హైపోథాలమిక్-పిట్యూటరీ-అడ్రినల్ (HPA) అక్షం (axis) ఒత్తిడికి ప్రతిస్పందించే రెండు ప్రధాన వ్యవస్థలు.[3] మానవులలో ఒత్తిడి ఉన్నప్పుడు అడ్రినలిన్, కార్టిసాల్ అనే రెండు ముఖ్యమైన హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. [4] సింపథెటిక్ నాడీ వ్యవస్థ ఎదుర్కోవడమో, తప్పించుకోవడమో వంటి ప్రతిస్పందనను ఒత్తిడికి సంబంధిత శరీర వ్యవస్థలప్రభావితమవుతాయి, అయితే పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ శరీరాన్ని తిరిగి స్థిరపరచుతుంది (హోమియోస్టాసిస్).
తీవ్రమైన ఒత్తిడితో కూడిన పరిస్థితులు మానసికంగా వ్యక్తికి హాని కలిగించే మార్పుకు కారణమవుతాయి[5]. దీర్ఘకాలిక ఒత్తిడి కూడా మెదడు క్షీణతకు కారణమవుతుంది, ఇది న్యూరాన్లు, వాటి మధ్య సంబంధాలకు నష్టం. ఇది నేర్చుకోవడం, ఒత్తిడికి ప్రతిస్పందించడం అభిజ్ఞా సౌలభ్యం కోసం ముఖ్యమైన మెదడు భాగాన్ని ప్రభావితం చేస్తుంది.[6] [7]
దీర్ఘకాలిక ఒత్తిళ్లు ప్రకృతి వైపరీత్యం లేదా పెద్ద ప్రమాదం వంటి తీవ్రమైన ఒత్తిళ్ల వలె తీవ్రంగా ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ కాలం పాటు కొనసాగుతాయి, ఆరోగ్యంపై మరింత ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి ఎందుకంటే అవి స్థిరంగా ఉంటాయి. ఇది శరీరం యొక్క శక్తిని మరింత త్వరగా క్షీణింపజేస్తుంది.[7]
మానవులు దీర్ఘకాలిక ఒత్తిడిలో ఉన్నప్పుడు, వారి శారీరక, భావోద్వేగ ప్రవర్తనా ప్రతిస్పందనలలో శాశ్వత మార్పులు సంభవించవచ్చు.[8] దీర్ఘకాలిక ఒత్తిడి అనేది చిత్తవైకల్యంతో ఉన్న జీవిత భాగస్వామిని చూసుకోవడం లేదా లైంగిక వేధింపులను భరించడం వంటి దీర్ఘకాలిక ప్రభావాల ఫలితంగా ఉండవచ్చు. కరోనరీ హార్ట్ డిసీజ్ అనారోగ్యం, మరణాలు మానసిక ఒత్తిడి ప్రత్యక్షంగా దోహదపడుతుందని కూడా అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ప్రత్యేకించి, తీవ్రమైన, దీర్ఘకాలిక ఒత్తిడి సీరం లిపిడ్లను పెంచుతుందని తెలుస్తోంది. [9]
ఒత్తిడి వలయం
[మార్చు]ఒత్తిడికి కారణమయ్యే పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ఆ విషయాన్ని ముందుగా మెదడు గ్రహించగానే శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. శరీర భాగాలకు మరింత ఆక్సిజన్ అందజేయడానికి హృదయ స్పందనలు పెరుగుతాయి. తద్వారా బీపీ పెరుగుతుంది. శ్వాస వేగం హెచ్చుతుంది. వీటి ప్రభావం జీవక్షికియల మీద పడుతుంది. ముఖ్యంగా జీర్ణక్షికియ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. తద్వారా జీర్ణకోశం ఎక్కువ ఆహారాన్ని జీర్ణం చేయడానికి రెడీ అవుతుంది. కానీ అంత ఆహారం అందుబాటులో ఉండదు కాబట్టి అసిడిటీ పెరుగుతుంది. అసిడిటీ వల్ల ఉత్పత్తయిన టాక్సిన్స్‌ని తీసేయడానికి విసర్జన వ్యవస్థపై ఎక్కువ పని పడుతుంది. దానివల్ల అది ఒత్తిడికి లోనవుతుంది. దీని ఫలితంగా అంతవూస్సావీ వ్యవస్థ అస్తవ్యస్తమై హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుంది. ఇది భావోద్వేగాలు అదుపు తప్పడానికి కారణమవుతుంది. అలా మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుంది. అందుకే ఒకసారి ఒత్తిడంటూ మొదలయ్యిందంటే దాన్ని తగ్గించుకునే వరకు ఇలా సమస్య మీద సమస్య వస్తూనే ఉంటుంది.
వ్యాధి ముఖ్యంగా మానసిక అనారోగ్యాలకు సంబంధించినది, దీని వలన దీర్ఘకాలిక లేదా తీవ్రమైన ఒత్తిడి అనేక మానసిక అనారోగ్యాలకు ఒక సాధారణ ప్రమాద కారకంగా ఉంటుంది.[10][11]
ఒత్తిడి లక్షణాలు
[మార్చు]- కోపం, అసహనం, పగ యొక్క సాధారణ భావన, లోతుగా-పాతుకుపోయిన అభద్రత
- నిరాశతో, అపనమ్మకంతో, ప్రతి ఒక్కదాని గురించి భయపడడం.
- నిద్రపోవడంలో ఇబ్బంది
- శక్తి లేకపోవడం
- అతిగా తినడం లేదా ఆకలి కోల్పోవడం
- బరువులో మార్పులు
- దీర్ఘకాలిక, తీవ్రమైన నొప్పి
- జుట్టు రాలడం
- కండరాల నొప్పులు , తలనొప్పి
- తీవ్రమైన అలసట
- భావోద్వేగాలలో మార్పులు, ఆందోళన, చిరాకు[12]
ఒత్తిడి వలన కలిగే దుష్ప్రభావాలు
[మార్చు]- ఒత్తిడికి గురయ్యేవారిలో దీర్ఘకాలిక గుండెజబ్బులు ఎక్కువగా వస్తుంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒక్కోసారి ఒత్తిడి గుండెపోటుకు సైతం దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు.
- అధిక ఒత్తిడి ఉన్నప్పుడు ఒత్తిడి హార్మోన్లు ఎక్కువగా పెరిగి రక్త పోటు పెరగొచ్చు. రక్త ప్రసరణ లో అవరోధం (బ్లాకులు) ఏర్పడవచ్చు. గుండె లయ తప్పే ప్రమాదం ఉంటుంది. ఎట్రియల్ ఫిబ్రిలేషన్, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ వంటి సమస్యలు ఉత్పన్నమవవచ్చు [12]
- ఒత్తిడి మానసికమైన అంశంగా కనిపించినా... దీర్ఘకాలం కొనసాగితే అది... స్థూలకాయం, గుండెజబ్బులు, అలై్జమర్స్ వ్యాధులు, డయాబెటిస్, డిప్రెషన్, జీర్ణకోశ సమస్యలు, ఆస్తమా వంటి శారీరకమైన సమస్యలకూ దారితీస్తుంది.
మరి ఎలా అదుపు చేయాలి
[మార్చు]ఒత్తిడిని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ముందుగా పాజిటివ్ దృక్పథాన్ని అలవరచుకోవాలి. సమస్యని భూతద్దంలో చూడకూడదు. అన్ని కోణాల నుంచీ సమస్యని విశ్లేషిస్తే ఎలా పరిష్కరించుకోవాలో అర్థం అవుతుంది. దాన్ని బట్టి సమస్య నుంచి తద్వారా ఒత్తిడి నుంచి బయటపడటం సులువవుతుంది. ఎంత పెద్ద సమస్యనైనా విడి విడి భాగాలుగా చేసి చూస్తే పరిష్కారం సులభమవుతుందంటారు సైకాలజిస్టులు. యోగా, మెడి ఇందుకు సహకరిస్తాయి. ప్రాణాయామం మంచి ఫలితాన్నిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం, మంచి అలవాట్లు పెంచుకోవడం అవసరం. మానసికోల్లాసాన్ని కలిగించే అభిరుచులకు పదును పెట్టడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. సృజనాత్మకత ఉన్న ఏ పని అయినా ఒత్తిడి నుంచి బయటపడేయడానికి సహకరిస్తుంది.
ఒత్తిడి తగ్గించే పాజిటివ్ వలయం
[మార్చు]మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉంచుకోవడం (సంగీతం లాంటి హాబీలు, ధ్యానం లాంటి వాటి వల్ల) ఒక పాజిటివ్ దృష్టికోణాన్ని ఏర్పరుస్తుంది. ఇది అడ్రినలిన్ మోతాదును సాధారణ స్థాయికి తెస్తుంది. దాంతో గుండె స్పందనలు, బీపీ, శ్వాస అన్నీ సాధారణ స్థితికి వచ్చేస్తాయి. తద్వారా జీవక్షికియలు కూడా సరిదిద్దబడతాయి. అసిడిటీ పోతుంది. హార్మోన్లు సమతులం అవుతాయి. భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ఫలితంగా మనసుపై ఒత్తిడి లేకుండా ప్రశాంతత చేకూరుతుంది. దాంతో ఇతరత్రా శారీరక సమస్యలు కూడా తగ్గిపోతాయి.
ఇలా చేసి చూడండి...
[మార్చు]పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. సమయానికి తినడం, నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఓ ప్రముఖ మనోవిశ్లేషకులు చెప్పినట్టు ఏ సమస్య అయినా శాశ్వతంగా ఉండదు. కాబట్టి ఇప్పటి బాధ రేపు ఉండదు. ఎక్కువ కాలం ఉండే మన జీవితాన్ని కష్టమయం చేసుకోవడం ఎందుకు... ఇలాంటి లాజిక్‌లు సమస్యను స్వీకరించడానికి, ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. ప్రతిరోజూ ధ్యానం చేయడం, వ్యాయామం చేయడం అవసరం.
జీవితంలో ఎంత డబ్బు ఉన్న ఆరోగ్యంగా లేకపోతే అది వృధానే. ఇప్పుడు మనకు డబ్బు సంపాదించడం ఎంత అవసరమో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంతకంటే ప్రధానం. ఒత్తిడి వల్ల నాలుగు పదులు దాటగానే సకల ఆరోగ్య సమస్యలు ఆహ్వానం పలుకుతాయి. ఈ దుస్థితి రాకుండా ఉండాలంటే మీ ఆరోగ్యం కోసం కొంత సమయం కేటాయించాల్సిందే...లేదంటే భవిష్యత్ లో మీకోసం రోగాలు సమయం కేటాయిస్తాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Nachiappan, Vasanthi; Muthukumar, Kannan (December 2010). "Cadmium-induced oxidative stress in Saccharomyces cerevisiae". Indian Journal of Biochemistry and Biophysics. 47 (6): 383–387. ISSN 0975-0959. PMID 21355423. Archived from the original on 25 July 2019. Retrieved 1 August 2019.
- ↑ Muthukumar, Kannan; Nachiappan, Vasanthi (2013-12-01). "Phosphatidylethanolamine from Phosphatidylserine Decarboxylase2 is Essential for Autophagy Under Cadmium Stress in Saccharomyces cerevisiae". Cell Biochemistry and Biophysics. 67 (3): 1353–1363. doi:10.1007/s12013-013-9667-8. ISSN 1559-0283. PMID 23743710. S2CID 16393480.
- ↑ Ulrich-Lai, Yvonne M.; Herman, James P. (7 February 2017). "Neural Regulation of Endocrine and Autonomic Stress Responses". Nature Reviews Neuroscience. 10 (6): 397–409. doi:10.1038/nrn2647. ISSN 1471-003X. PMC 4240627. PMID 19469025.
- ↑ "Biology of stress". CESH / CSHS. Retrieved 2022-09-27.
- ↑ Ehlers, Anke; Harvey, Allison G.; Bryant, Richard A. (October 2012) [February 2012]. "Acute stress reactions". In Gelder, Michael; Andreasen, Nancy; Lopez-Ibor, Juan; Geddes, John (eds.). New Oxford Textbook of Psychiatry (2nd ed.). oxfordmedicine.com: Oxford University Press. doi:10.1093/med/9780199696758.001.0001. ISBN 9780199696758. Retrieved 3 July 2021 – via Google.
- ↑ Notaras, Michael; van den Buuse, Maarten (2020-01-03). "Neurobiology of BDNF in fear memory, sensitivity to stress, and stress-related disorders". Molecular Psychiatry (in ఇంగ్లీష్). 25 (10): 2251–2274. doi:10.1038/s41380-019-0639-2. ISSN 1476-5578. PMID 31900428. S2CID 209540967.
- ↑ 7.0 7.1 Segerstrom, Suzanne C.; Miller, Gregory E. (7 February 2017). "Psychological Stress and the Human Immune System: A Meta-Analytic Study of 30 Years of Inquiry". Psychological Bulletin. 130 (4): 601–630. doi:10.1037/0033-2909.130.4.601. ISSN 0033-2909. PMC 1361287. PMID 15250815.
- ↑ Ehlers, Anke; Harvey, Allison G.; Bryant, Richard A. (October 2012) [February 2012]. "Acute stress reactions". In Gelder, Michael; Andreasen, Nancy; Lopez-Ibor, Juan; Geddes, John (eds.). New Oxford Textbook of Psychiatry (2nd ed.). oxfordmedicine.com: Oxford University Press. doi:10.1093/med/9780199696758.001.0001. ISBN 9780199696758. Retrieved 3 July 2021 – via Google.
- ↑ Drs; Sartorius, Norman; Henderson, A.S.; Strotzka, H.; Lipowski, Z.; Yu-cun, Shen; You-xin, Xu; Strömgren, E.; Glatzel, J.; Kühne, G.-E.; Misès, R.; Soldatos, C.R.; Pull, C.B.; Giel, R.; Jegede, R.; Malt, U.; Nadzharov, R.A.; Smulevitch, A.B.; Hagberg, B.; Perris, C.; Scharfetter, C.; Clare, A.; Cooper, J.E.; Corbett, J.A.; Griffith Edwards, J.; Gelder, M.; Goldberg, D.; Gossop, M.; Graham, P.; Kendell, R.E.; Marks, I.; Russell, G.; Rutter, M.; Shepherd, M.; West, D.J.; Wing, J.; Wing, L.; Neki, J.S.; Benson, F.; Cantwell, D.; Guze, S.; Helzer, J.; Holzman, P.; Kleinman, A.; Kupfer, D.J.; Mezzich, J.; Spitzer, R.; Lokar, J. "The ICD-10 Classification of Mental and Behavioural Disorders Clinical descriptions and diagnostic guidelines" (PDF). www.who.int World Health Organization. Microsoft Word. bluebook.doc. p. 110. Retrieved 23 June 2021 – via Microsoft Bing.
- ↑ Notaras, Michael; van den Buuse, Maarten (2020-01-03). "Neurobiology of BDNF in fear memory, sensitivity to stress, and stress-related disorders". Molecular Psychiatry (in ఇంగ్లీష్). 25 (10): 2251–2274. doi:10.1038/s41380-019-0639-2. ISSN 1476-5578. PMID 31900428. S2CID 209540967.
- ↑ Segerstrom, Suzanne C.; Miller, Gregory E. (7 February 2017). "Psychological Stress and the Human Immune System: A Meta-Analytic Study of 30 Years of Inquiry". Psychological Bulletin. 130 (4): 601–630. doi:10.1037/0033-2909.130.4.601. ISSN 0033-2909. PMC 1361287. PMID 15250815.
- ↑ 12.0 12.1 డా.గుడపాటి, రమేష్ (2024-09-14). "గుప్పెడంత గుండె పై ఉప్పెనంత ఒత్తిడి". ఈనాడు.