Jump to content

కండలేరు ఆనకట్ట

అక్షాంశ రేఖాంశాలు: 14°20′07″N 79°37′29″E / 14.33528°N 79.62472°E / 14.33528; 79.62472
వికీపీడియా నుండి
(కండలేరు జలాశయం నుండి దారిమార్పు చెందింది)

కండలేరు ఆనకట్ట అనగా ఒక సాగునీటి ప్రాజెక్టు, దీనిని ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో కండలేరు నది మీద నిర్మించారు. [1][2][3] ఈ ప్రాజెక్టు తెలుగుగంగ ప్రాజెక్టు యొక్క భాగం. తెలుగు గంగ ప్రాజెక్టు కృష్ణా నది మీద ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చెన్నై నగరానికి తాగునీరును సరఫరా చేస్తుంది. కండలేరు జలాశయం ప్రధానంగా సోమశిల జలాశయం నుంచి లింక్ కెనాల్ ద్వారా నింపబడుతుంది. తెలుగు గంగ ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ లో దాని కింద నున్న కాలువల ద్వారా సాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది.

తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన ఈ జలాశయం 1983లో రాపూరు మండలంలోని చెల్లటూరు గ్రామం వద్ద నిర్మించారు. ఈ జలాశయ మట్టికట్ట పొడవు పదకొండు కిలోమీటర్లు, ఇది ఆసియాలోనే అతిపెద్ద మట్టిడ్యామ్‌గా గుర్తింపు పొందింది. ఈ జలాశయ పూర్తి సామర్థ్యం 68 టీఎంసీలు. 2010లో తొలిసారిగా 55 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. దీని నుంచి ప్రతి ఏటా సత్యసాయి గంగ (కండలేరు-పూండి) కాలువ ద్వారా చెన్నై, తిరుపతి నగర ప్రజల తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ జలాశయ లక్ష్యం 3 లక్షల ఎకరాల ఆయుకట్టుకు సాగునీటిని అందించటం, అయితే ప్రస్తుతం 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించగలుగుతుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-01-25. Retrieved 2014-09-24.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-12-05. Retrieved 2014-09-24.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2004-05-03. Retrieved 2014-09-24.

14°20′07″N 79°37′29″E / 14.33528°N 79.62472°E / 14.33528; 79.62472వెలుపలి లంకెలు

[మార్చు]