Jump to content

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా

వికీపీడియా నుండి

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా పెదరాయుడు (1995) సినిమాలోని పాట. దీని రచయిత సాయి శ్రీహర్ష. ఈ మంచి గీతాన్ని ఏసుదాస్, కె.ఎస్.చిత్ర పాడగా కోటి సంగీతాన్ని సమకుర్చారు.

నేపథ్యం

[మార్చు]

భార్యతో కలిసి ఊరికి దూరంగా ఉంటాడు పెదరాయుడి తమ్ముడు. అతనిది వెలివేయబడ్డ కుటుంబం. మంచిచెడ్డలకు ఎవ్వరూ రారు. ఆ సందర్భంలో భార్యకు సీమంతం చెయ్యాలి. ముత్తయిదువులూ బంధువుల సమక్షంలో జరగాల్సిన వేడుక అది. కానీ, అక్కడ ఎవ్వరూ ఉండరు. ఉన్నది ఒక్క భర్తే. అతడే ఆ వేడుక జరిపించాలి.

పల్లవి: కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా

జరిగే వేడుకా కళ్లార చూడవమ్మా

పేగే కదలగా సీమంతమాయెలే

ప్రేమ దేవతకు నేడే

విశ్లేషణ

[మార్చు]

ఈ పాట "కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా" అని మొదలౌతుంది.

భార్యకు భర్త ఏమౌతాడు అన్నది మొదటి చరణం. "లాలించే తల్లి పాలించే తండ్రి నేనేలే నీకన్నీ" అని అంటాడు.

రెండవ చరణంలో "తాతయ్య తేజం పెదనాన్న నైజం కలిసున్న పసిరూపం" అని అంటాడు. ఇక్కడ తాతయ్య అంటే పాపారాయుడు (రజనీకాంత్), పెదనాన్న పెదరాయుడు (మోహన్ బాబు). అలాంటి పుత్రుడితో "వెలిగేనులే మా వంశం" అని కోరుకుంటాడు భర్త.

ఎంతో ఘనంగా జరగాల్సిన సీమంతం అలా జరిగిందేమిటి అన్న లోటు భార్యకి లేకుండా చేస్తాడు. భార్య చివర్లో "ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా" అని అంటుంది.

మూలాలు

[మార్చు]
  • కథనూ మదినీ కదిలించింది, పాట కచేరి, ఈనాడు ఆదివారం 2010 సెప్టెంబరు 19 లో ప్రచురించిన వ్యాసం ఆధారంగా