కనక్ రెలె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Kanak Rele

'డా.కనక్ రెలే (జననం జూన్ 11 1937) భారతీయ నృత్యకళాకారిణి, నృత్య దర్శకురాలు అంరియు "మోహినీ యాట్టం" నృత్యంలో ప్రసిద్ధురాలు. ఆమె నలందా రీసెర్చ్ సెంటర్ కు వ్యవస్థాపకురాలు, దర్శకురాలు. ఆమె ముంబాయి లోని నలందా నృత్య కళా మహావిద్యాలయానికి వ్యవస్థాపకురాలు, ప్రిన్సిపాల్.[1][2]

ప్రారంభ జీవితం , విద్య[మార్చు]

ఆమె గుజరాత్ లో జన్మించారు.[3] ఆమె బాల్యంలో కోల్‌కతా లోని శాంతినికేతన్లో కొంతకాలం గడిపారు. శాంతినికేతన్ లో కథాకలి, మోహిని అట్టం నృత్యరీతులను ప్రదర్శించే అవకాశం ఆమెకు లభించింది.[4][5] ఆమె అర్హత పొందిన న్యాయవాది. ఆమె ఎల్.ఎల్.బిని ముంబాయి లోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో చేశారు. ఆమె మాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ న్యాయశాస్త్రం చదివారు.[5] ఆమె ముంబాయి విశ్వవిద్యాలయంలో నృత్యంలో పి.హెచ్.డి చేశారు.[6]

మోహినియాట్టం ఆర్టిస్టు[మార్చు]

డా. రెలే కథాకలి కళాకారిణి కూడా. ఆమె తన ఏడవయేట "పాంచాలి:కరుణాకర పానికెర్ అనే గురువువద్ద శిక్షణ పొందారు.[5][7] ఆమె కలామండలం రాజలక్ష్మి వద్ద నుండి మోహినీ అట్టం అభ్యసించారు. ఆమెకు వచ్చిన సంగీత నాటక అకాడమీ పారితోషికం, ఫోర్డ్ ఫౌండేషన్ సహకారంతో ఆమె మోహినీ అట్టం పై ఆసక్తిని పెంపొందించుకున్నారు. 1970-71 కాలంలో ఆమె కేరళలో ప్రముఖ సినిమా కళాకారులైన కుంజుకుట్టి అమ్మ, చిన్నమ్ము అమ్మ, కల్యాని కుట్టి అమ్మ ల వద్దకు వెళ్ళారు.

మూలాలు[మార్చు]

  1. "ARTISTE'S PROFILE - Kanak Y. Rele". Centre for Cultural Resources and Training. Archived from the original on 18 ఫిబ్రవరి 2013. Retrieved 27 January 2013. Check date values in: |archive-date= (help)
  2. "Imagination unlimited". The Hindu. October 27, 2006. Retrieved 27 January 2013.
  3. "Kanak Rele gets Kalidas Samman". Narthaki. May 7, 2006. Retrieved 27 January 2013.
  4. "Dance has its own language: Dr. Kanak Rele". Times of India. April 9, 2011. Retrieved 27 January 2013.
  5. 5.0 5.1 5.2 "'Dance has to serve more social causes'". The Hindu. October 28, 2010. Retrieved 27 January 2013.
  6. "Dancing Queen - Dr.Kanak Rele". Archived from the original on 6 జనవరి 2013. Retrieved 27 January 2013. Check date values in: |archive-date= (help)
  7. "Tryst with Mohiniyattam". The Hindu. January 29, 2006. Retrieved 27 January 2013.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కనక్_రెలె&oldid=2954421" నుండి వెలికితీశారు