కమలనయన్ బజాజ్
కమలనయన్ బజాజ్ | |
---|---|
పార్లమెంట్ సభ్యుడు | |
In office 1957-1971 | |
నియోజకవర్గం | వార్థా లోక్‌సభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1915 జనవరి 23 |
మరణం | 1972 మే 1 | (వయసు 57)
సంతానం | రాహుల్ బజాజ్ |
తల్లిదండ్రులు | జమ్నాలాల్ బజాజ్ జానకీ దేవి బజాజ్ |
కమలనయన్ బజాజ్ (1915 జనవరి 23-1972 మే 1) మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు.
జీవితచరిత్ర
[మార్చు]ప్రారంభ జీవితం విద్య
[మార్చు]కమలనయన్ బజాజ్ బజాజ్ గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్నాలాల్ బజాజ్ పెద్ద కుమారుడు.[1] కమలనయన్ 1915 జనవరి 23న జన్మించాడు.[2] 1954లో తన తండ్రి నుండి వారసత్వంగా పొందిన బజాజ్ గ్రూప్ కు నాయకత్వం వహించాడు.[3] అతను ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి తన విద్యను పూర్తి చేశాడు.
వృత్తి
[మార్చు]త్రీ-వీలర్స్ సిమెంట్, అల్లాయ్ కాస్టింగ్ ఎలక్ట్రికల్ పరికరాల తయారీలో బజాజ్ గ్రూప్ ప్రముఖ పాత్ర పోషించింది .[3]
కమలనయన్ బజాజ్ కు రాహుల్ బజాజ్, సుమన్ జైన్, శిశిర్ బజాజ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.[4][5] రాహుల్ బజాజ్ కమలనయన్ బజాజ్ పెద్ద కుమారుడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]కమలనయన్ బజాజ్ వార్ధా లోక్ సభ నియోజకవర్గం నుండి 1957 నుంచి 1971 వరకు మూడుసార్లు ఎంపీగా గెలిచాడు. 1969 లో తన రాజకీయ సహచరుడు మొరార్జీ దేశాయ్‌తో కలిసి కాంగ్రెసులో చేరాడు. 1971 పార్లమెంట్ ఎన్నికలలో కమలనయన్ బజాజ్ ఓడిపోయారు. ఆ తరువాత అతను ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యాడు.[2]
కమలనయన్ బజాజ్ 1972 మే 1 న 57 సంవత్సరాల వయసులో మరణించాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "About Us | Brief History Of Bajaj Electricals". www.bajajelectricals.com.
- ↑ 2.0 2.1 2.2 Bhandari, Bhupesh (23 January 2015). "Kamalnayan Bajaj: A 'Gandhian' rebel". Business Standard. Retrieved 29 November 2018. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "a3" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 3.0 3.1 3.2 "The Bajaj Story | Bajaj group of Companies, Kushagra Bajaj, Vice Chairman". www.bajajgroup.org. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "a2" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Updates". @businessline.
- ↑ "Shishir Bajaj - Forbes India Magazine". Forbes India.