Jump to content

కమలా దాస్

వికీపీడియా నుండి
కమలా దాస్
కమలా దాస్


స్త్రీ & శిశు అభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
2000 – 2001

విద్య & యువజన సేవలకు, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
1990 – 1995

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1990 - 2004
నియోజకవర్గం భోగ్రాయ్

వ్యక్తిగత వివరాలు

జననం 1945 ఆగస్టు 16
బర్బాటియా గ్రామం, బాలాసోర్ జిల్లా
మరణం 12 ఏప్రిల్ 2024
కటక్, ఒడిశా
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ బిజూ జనతాదళ్
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్, కాంగ్రెస్

కమలా దాస్ (జననం 16 ఆగస్టు 1945 - 12 ఏప్రిల్ 2024) ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మూడుసార్లు ఒడిశా శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై, 1990 నుండి 1995 వరకు బిజు పట్నాయక్ మంత్రివర్గంలో 2000 నుండి 2001 వరకు నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేసింది.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కమలా దాస్ బాలాసోర్ జిల్లాలోని శంఖారి పంచాయితీ బర్బాటియా గ్రామంలో 1945 ఆగస్టు 16న జన్మించింది. ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసింది. కమలా దాస్ కాళీ కుమార్ దాస్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

కమలా దాస్ జనతాదళ్ కార్యకర్తగా రాజకీయాల్లో వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1990లో జరిగిన శాసనసభ ఎన్నికలలో భోగ్రాయ్ శాసనసభ నియోజకవర్గం నుండి జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1990 నుండి 1995 వరకు బిజూ పట్నాయక్ మంత్రివర్గంలో విద్య & యువజన సేవలకు, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖకు మంత్రిగా పని చేసింది. ఆమె 1995లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. కమలా దాస్ తరువాత బిజూ జనతాదళ్ ఏర్పడిన తర్వాత బిజెడి పార్టీలో చేరి 2000లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2000 నుండి 2001 వరకు నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో స్త్రీ & శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసింది. ఆమెపై 2001లో అవినీతి ఆరోపణలు రావడంతో మంత్రి పదవి నుండి తప్పించడంతో ఆమె ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి తిరిగి 2014లో బిజూ జనతాదళ్ పార్టీలో చేరింది.

మరణం

[మార్చు]

కమల దాస్ కి ఛాతీ నొప్పితో బాధపడుతూ భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమెకు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ సోకి ఆరోగ్యం క్షిణించడంతో 12 ఏప్రిల్ 2024న మరణించింది.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (13 April 2024). "Former Health Minister Kamala Das passes away at 79" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
  2. Eenadu (13 April 2024). "కమలాదాస్‌ కన్నుమూత... ప్రముఖుల సంతాపం". Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
  3. Samaya Live (12 April 2024). "ପୂର୍ବତନ ସ୍ୱାସ୍ଥ୍ୟ ମନ୍ତ୍ରୀ କମଳା ଦାସଙ୍କ ପରଲୋକ". Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
  4. The Print (12 April 2024). "Ex-Odisha minister Kamala Das dies at 79". Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=కమలా_దాస్&oldid=4188462" నుండి వెలికితీశారు