కమలనయన్ బజాజ్

వికీపీడియా నుండి
(కమల్నాయన్ బజాజ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కమలనయన్ బజాజ్
పార్లమెంట్ సభ్యుడు
In office
1957-1971
నియోజకవర్గంవార్థా లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1915-01-23)1915 జనవరి 23
మరణం1972 మే 1(1972-05-01) (వయసు 57)
సంతానంరాహుల్ బజాజ్
తల్లిదండ్రులుజమ్నాలాల్ బజాజ్
జానకీ దేవి బజాజ్

కమలనయన్ బజాజ్ (1915 జనవరి 23-1972 మే 1) మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు.

జీవితచరిత్ర

[మార్చు]

ప్రారంభ జీవితం విద్య

[మార్చు]

కమలనయన్ బజాజ్ బజాజ్ గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్నాలాల్ బజాజ్ పెద్ద కుమారుడు.[1] కమలనయన్ 1915 జనవరి 23న జన్మించాడు.[2] 1954లో తన తండ్రి నుండి వారసత్వంగా పొందిన బజాజ్ గ్రూప్ కు నాయకత్వం వహించాడు.[3] అతను ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి తన విద్యను పూర్తి చేశాడు.

వృత్తి

[మార్చు]

త్రీ-వీలర్స్ సిమెంట్, అల్లాయ్ కాస్టింగ్ ఎలక్ట్రికల్ పరికరాల తయారీలో బజాజ్ గ్రూప్ ప్రముఖ పాత్ర పోషించింది .[3]

కమలనయన్ బజాజ్ కు రాహుల్ బజాజ్, సుమన్ జైన్, శిశిర్ బజాజ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.[4][5] రాహుల్ బజాజ్ కమలనయన్ బజాజ్ పెద్ద కుమారుడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

కమలనయన్ బజాజ్ వార్ధా లోక్ సభ నియోజకవర్గం నుండి 1957 నుంచి 1971 వరకు మూడుసార్లు ఎంపీగా గెలిచాడు. 1969 లో తన రాజకీయ సహచరుడు మొరార్జీ దేశాయ్‌తో కలిసి కాంగ్రెసులో చేరాడు. 1971 పార్లమెంట్ ఎన్నికలలో కమలనయన్ బజాజ్ ఓడిపోయారు. ఆ తరువాత అతను ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యాడు.[2]

కమలనయన్ బజాజ్ 1972 మే 1 న 57 సంవత్సరాల వయసులో మరణించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "About Us | Brief History Of Bajaj Electricals". www.bajajelectricals.com.
  2. 2.0 2.1 2.2 Bhandari, Bhupesh (23 January 2015). "Kamalnayan Bajaj: A 'Gandhian' rebel". Business Standard. Retrieved 29 November 2018. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "a3" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. 3.0 3.1 3.2 "The Bajaj Story | Bajaj group of Companies, Kushagra Bajaj, Vice Chairman". www.bajajgroup.org. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "a2" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. "Updates". @businessline.
  5. "Shishir Bajaj - Forbes India Magazine". Forbes India.