కమాలుద్దీన్ అహ్మద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కమాలుద్దీన్‌ అహ్మద్‌

లోక్‌సభ ఎంపీ
పదవీ కాలం
1989–1998
ముందు చందుపట్ల జంగారెడ్డి
తరువాత చాడ సురేష్ రెడ్డి
నియోజకవర్గం హన్మకొండ[1]

సౌదీ అరేబియా రాయబారి
పదవీ కాలం
జులై 2003 – సెప్టెంబర్ 2004
ముందు తాల్మిజ్ అహ్మద్
తరువాత ఎం.ఓ.హెచ్. ఫరూక్

వ్యక్తిగత వివరాలు

జననం 1928
సాలక్‌పూర్, మద్దూరు మండలం, సిద్ధిపేట జిల్లా , తెలంగాణ రాష్ట్రం
మరణం 1 సెప్టెంబర్‌ 2018
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
సంతానం ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు
నివాసం హైదరాబాద్

కమాలుద్దీన్‌ అహ్మద్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రమంత్రిగా, కేంద్రమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పని చేశాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

కమాలుద్దీన్ అహ్మద్ తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా , మద్దూరు మండలం, సాలక్‌పూర్ గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి.

రాజకీయ జీవితం

[మార్చు]

కమాలుద్దీన్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1962లో చేర్యాల, 1967లో జనగామ ఎమ్మెల్యేగా పని చేశాడు. ఆయన 1973లో ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌గా, 1980 నుంచి 1984 వరకు వరంగల్‌, 1989 నుంచి 1999 వరకు హన్మకొండ పార్లమెంట్‌ సభ్యుడిగా పని చేశాడు. కమాలుద్దీన్ అహ్మద్ జూన్ 1991 నుండి సెప్టెంబర్ 1994 వరకు కేంద్రమంత్రిగా పని చేశాడు. ఆయన 1994లో ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా, 1995లో నాబార్డ్‌ చైర్మన్‌గా పని చేశాడు. అనంతరం బీజేపీ పార్టీలో చేరి వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో సౌదీ అరేబియా రాయబారిగా పని చేశాడు.[3]

మరణం

[మార్చు]

కమాలుద్దీన్‌ అహ్మద్‌ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (16 April 2024). "హ్యాట్రిక్‌ వీరుడు కమాలుద్దీన్‌". Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.
  2. Sakshi (25 March 2019). "హన్మకొండ లోక్‌సభలో అన్నీ రికార్డులే." Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
  3. Sakshi (20 May 2014). "పేరు నిలపని పెద్దరికం". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
  4. Andhrajyothy (1 September 2018). "అనారోగ్యంతో మాజీ కేంద్రమంత్రి కమాలుద్దీన్‌ అహ్మద్‌ కన్నుమూత". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
  5. Hashmi, Rasia (2018-09-02). "Mohammed Kamaluddin Ahmed, ex-minister & ex-ambassador, passes away". The Siasat Daily (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2019-03-14.