ఎం.ఓ.హెచ్. ఫరూక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం.ఓ.హెచ్. ఫరూక్
ఎం.ఓ.హెచ్. ఫరూక్


పదవీ కాలం
8 సెప్టెంబర్ 2011 – 26 జనవరి 2012
ముందు ఆర్.ఎస్. గవై
తరువాత హన్స్‌రాజ్ భరద్వాజ్

పదవీ కాలం
22 జనవరి 2010 – 4 సెప్టెంబర్ 2011[1]
ముందు కె. శంకరనారాయణన్
తరువాత సయ్యద్ అహ్మద్

పుదుచ్చేరి 3వ ముఖ్యమంత్రి
పదవీ కాలం
16 మార్చి 1985 – 19 జనవరి 1989
Lieutenant Governor త్రిభువన్ ప్రసాద్ తివారీ,
రంజిత్ సింగ్ దయాల్
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత రాష్ట్రపతి పాలన
పదవీ కాలం
17 మార్చి 1969 – 3 జనవరి 1974
Lieutenant Governor బి.డి. జెట్టి,
ఛేదిలాల్
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత సుబ్రమణ్యం రామస్వామి
పదవీ కాలం
9 ఏప్రిల్ 1967 – 6 మార్చి 1968
Lieutenant Governor సాయాజీ లక్ష్మణ్ సిలం,
బి.డి. జెట్టి
ముందు వి.వెంకటసుభా రెడ్డియార్
తరువాత వి.వెంకటసుభా రెడ్డియార్

పదవీ కాలం
1999 – 2004
ముందు ఎస్. ఆరుముగం
తరువాత ఎం. రామదాస్
పదవీ కాలం
1991 – 1998
ముందు పి.షణ్ముగం
తరువాత ఎస్. ఆరుముగం

వ్యక్తిగత వివరాలు

జననం (1937-09-06)1937 సెప్టెంబరు 6
పాండిచ్చేరి, ఫ్రెంచ్ ఇండియా (ప్రస్తుత పుదుచ్చేరి , భారతదేశం)
మరణం 2012 జనవరి 26(2012-01-26) (వయసు 74)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ
పూర్వ విద్యార్థి లయోలా కళాశాల, చెన్నై
వృత్తి రాజకీయ నాయకుడు

ఎం.ఓ.హసన్ ఫరూక్ మారికార్ (6 సెప్టెంబర్ 1937 - 26 జనవరి 2012[2])  భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, కేరళ రాష్ట్ర గవర్నర్‌గా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఎం.ఓ.హెచ్. ఫరూక్ పుదుచ్చేరికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా, 1960లో పుదుచ్చేరి అసెంబ్లీకి అతి పిన్న వయస్కుడైన స్పీకర్‌గా పని చేసి పుదుచ్చేరి నుండి 1991 నుండి మూడు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికై పివి నరసింహారావు మంత్రివర్గంలో 1991 నుండి 1992 వరకు కేంద్ర పౌర విమానయాన, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు. ఎం.ఓ.హెచ్. ఫరూక్ సౌదీ అరేబియాలో భారత రాయబారిగా కూడా పని చేశాడు. అతను 2010లో జార్ఖండ్ గవర్నర్‌గా ఆ తరువాత 2011లో కేరళ గవర్నర్‌గా విధులు నిర్వహించాడు.

మరణం

[మార్చు]

ఎం.ఓ.హెచ్. ఫరూక్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కిడ్నీ సమస్యకు చికిత్స పొందుతూ 2012 జనవరి 26న మరణించాడు. ఆయనకు  కుమారుడు ఎం.ఓ.హెచ్. షాజహాన్ మరియు కుమార్తెలు ఎఫ్. మలిక, ఎఫ్. యాస్మిన్ ఉన్నారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "New governor to take oath today". The Times of India. 2011-09-04. Archived from the original on 2012-09-26. Retrieved 2011-09-08.
  2. India Today (27 January 2012). "Kerala Governor M O H Farook dies at 74 after brief illnes". Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.
  3. The Hindu (26 January 2012). "M.O.H. Farook passes away". Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.