Jump to content

హన్స్‌రాజ్ భరద్వాజ్

వికీపీడియా నుండి
హెచ్. ఆర్. భరద్వాజ్
హన్స్‌రాజ్ భరద్వాజ్


పదవీ కాలం
25 జూన్ 2009 – 28 జూన్ 2014
ముందు రామేశ్వర్ ఠాకూర్
తరువాత వాజుభాయ్ వాలా

పదవీ కాలం
1 మార్చి 2012 – 9 మార్చి 2013
ముందు ఎం.ఓ.హెచ్. ఫరూక్
తరువాత నిఖిల్ కుమార్

27వ న్యాయ శాఖ మంత్రి
పదవీ కాలం
22 మే 2004 – 28 మే 2009
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు అరుణ్ జైట్లీ
తరువాత వీరప్ప మొయిలీ

వ్యక్తిగత వివరాలు

జననం 16 మే 1939
గహ్రీ సంప్లా కిలోయి, పంజాబ్ , బ్రిటిష్ రాజ్ (ప్రస్తుత హర్యానా , భారతదేశం)
మరణం 2020 మార్చి 8(2020-03-08) (వయసు 80)[1]
న్యూఢిల్లీ , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్

హన్స్‌రాజ్ భరద్వాజ్ (16 మే 1939 - 8 మార్చి 2020) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పని చేసి 2009 నుంచి 2014 వరకు కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

హన్స్‌రాజ్ భరద్వాజ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1982లో మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికై 1984 డిసెంబర్ 31 నుండి నవంబర్ 1989 వరకు న్యాయ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు. ఆయన 1988లో రెండొవసారి రాజ్యసభకు తిరిగి ఎన్నికై 1991 జూలై 21 నుండి 1992 జూలై 2, 1992 వరకు ప్రణాళిక, కార్యక్రమ అమలు శాఖ మంత్రిగా, 1992 జూలై 3 నుండి మే 1996 వరకు సహాయ మంత్రిగా పని చేసి ఏప్రిల్ 1994 నుండి ఏప్రిల్ 2000 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశాడు.

హన్స్‌రాజ్ భరద్వాజ్ మే 2004 నుండి మే 2009 వరకు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పని చేసి  మార్చి 20, 2006న  రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యాడు. ఆయన 2009 నుండి 2014 వరకు కర్ణాటక గవర్నర్‌గా, 1 మార్చి 2012 నుండి 9 మార్చి  2013 వరకు కేరళ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు భాద్యతలు నిర్వహించాడు

మరణం

[మార్చు]

హన్స్‌రాజ్ భరద్వాజ్ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ ఢిల్లీలోని మాక్స్ హాస్పిటల్‌లో చికిత్య పొందుతూ గుండెపోటుతో 2020 మార్చి 8న మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Former Law minister Hans Raj Bhardwaj dies at 83. Tribune India (8 March 2020)
  2. Sakshi (8 March 2020). "కేంద్ర మాజీ మంత్రి హన్స్‌రాజ్‌ కన్నుమూత". Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.