కె. శంకరనారాయణన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె. శంకరనారాయణన్
కె. శంకరనారాయణన్


పదవీ కాలం
22 జనవరి 2010 – 24 ఆగష్టు 2014
ముందు ఎస్.సి. జమీర్
తరువాత సి.హెచ్.విద్యాసాగర్ రావు

5వ జార్ఖండ్ గవర్నర్
పదవీ కాలం
26 జులై 2009 – 21 జనవరి 2010
ముందు సయ్యద్ సిబ్తే రాజీ
తరువాత ఎం.ఓ.హెచ్. ఫరూక్

13వ నాగాలాండ్ గవర్నర్
పదవీ కాలం
3 ఫిబ్రవరి 2007 – 28 జులై 2009
ముందు శ్యామల్ దత్తా
తరువాత గుర్బచన్ జగత్

పదవీ కాలం
26 జూన్ 2009 – 27 జులై 2009
ముందు శివ చరణ్ మాథుర్
తరువాత సయ్యద్ సిబ్తే రాజీ

పదవీ కాలం
4 సెప్టెంబర్ 2007 – 26 జనవరి 2008
ముందు శీలేంద్ర కుమార్ సింగ్
తరువాత జోగిందర్ జస్వంత్ సింగ్
పదవీ కాలం
7 ఏప్రిల్ 2007 – 14 ఏప్రిల్ 2007
ముందు ఎం.ఎం. జాకబ్
తరువాత ఎస్. కే. సింగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1932-10-15)1932 అక్టోబరు 15
పాలక్కాడ్ , బ్రిటిష్ ఇండియా
మరణం 2022 ఏప్రిల్ 24(2022-04-24) (వయసు 89)
శేఖరీపురం , భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి ప్రొఫెసర్ కె రాధ
సంతానం 1 కుమార్తె

కటీకల్ శంకరనారాయణన్ (15 అక్టోబర్ 1932 - 24 ఏప్రిల్ 2022) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర[1], నాగాలాండ్[2] & జార్ఖండ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

కె. శంకరనారాయణన్ 1946లో విద్యార్థి రాజకీయాల ద్వారా తన కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆయన త్రిథాల నుండి ఐదవ కేరళ శాసనసభకు, శ్రీకృష్ణాపురం నుండి ఆరవ కేరళ శాసనసభకు, ఎనిమిదవ అసెంబ్లీకి ఒట్టపాలెం నుండి, 11వ అసెంబ్లీకి పాలక్కాడ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1977లో కె. కరుణాకరన్ మంత్రివర్గంలో వ్యవసాయం, పశుపోషణ, పాడిపరిశ్రమ అభివృద్ధి, సమాజాభివృద్ధి శాఖల మంత్రిగా,  2001 నుండి 2004 వరకు ఎకె ఆంటోనీ మంత్రివర్గంలో ఆర్థిక,  ఎక్సైజ్ శాఖల మంత్రిగా పని చేశాడు. ఆయన 1985 నుంచి 2001 వరకు 16 ఏళ్లపాటు కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రండ్ (యూడీఎఫ్) కన్వీనర్‌గా ఉన్నాడు.

కె. శంకరనారాయణన్ నాగాలాండ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర రాష్ట్రాలకు గవర్నర్‌గా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించాడు.

మరణం[మార్చు]

కె. శంకరనారాయణన్ వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతూ కేరళలో పాలక్కాడ్‌లోని తన నివాసంలో 2022 ఏప్రిల్ 24న మరణించాడు. ఆయన భార్య రాధ మరణించగా ఆయనకు ఓ కుమార్తె అనుపమ ఉన్నారు.[3][4]

మూలాలు[మార్చు]

  1. "Sankaranarayanan to be sworn in as Maha Governor on 22 January". Zee News. 19 January 2010. Retrieved 23 January 2010.
  2. "K Sankaranarayanan is new Nagaland Governor", Times of India, 19 January 2007.
  3. The Hindu (24 April 2022). "Veteran Congress leader K. Sankaranarayanan passes away aged 89" (in Indian English). Archived from the original on 22 February 2024. Retrieved 22 February 2024.
  4. The Indian Express (25 April 2022). "Former Governor of Maharashtra Sankaranarayanan passes away at 90" (in ఇంగ్లీష్). Archived from the original on 22 February 2024. Retrieved 22 February 2024.