చాడ సురేష్ రెడ్డి
చాడ సురేష్ రెడ్డి | |||
ఎంపీ
| |||
పదవీ కాలం 1998-2004 | |||
ముందు | కమాలుద్దీన్ అహ్మద్ | ||
---|---|---|---|
తరువాత | బి. వినోద్ కుమార్ | ||
నియోజకవర్గం | హన్మకొండ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హన్మకొండ, వరంగల్ | 1959 నవంబరు 1||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | శైలజ రెడ్డి |
చాడ సురేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండు సార్లు హన్మకొండ నుంచి పార్లమెంటు సభ్యుడిగా గెలిచాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]చాడ సురేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, హన్మకొండలో వాసుదేవ రెడ్డి, కౌసల్య దేవి దంపతులకు జన్మించాడు. ఆయన హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీ నుండి బీఏ పూర్తి చేశాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]చాడ సురేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1998లో జరిగిన ఎన్నికల్లో హన్మకొండ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమాలుద్దీన్ అహ్మద్పై గెలిచి తొలిసారి ఎంపీగా పార్లమెంట్ కు ఎన్నికయ్యాడు. ఆయన 1999లో జరిగిన ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమాలుద్దీన్ అహ్మద్ పై గెలిచి రెండోసారి ఎంపీగా పార్లమెంట్ కు ఎన్నికయ్యాడు.
చాడ సురేష్ రెడ్డి 2004లో జరిగిన ఎన్నికల్లో తెరాస అభ్యర్థి బి. వినోద్ కుమార్ చేతిలో ఓడిపోయాడు.ఆయన మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగ్యస్వామి అయ్యేందుకు టీడీపీని విడి తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరి తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. చాడ సురేష్ రెడ్డి తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురై తిరిగి 2013లో తెలుగుదేశం పార్టీలో చేరాడు[3].ఆయన తెలుగుదేశం పార్టీ నుండి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (25 March 2019). "హన్మకొండ లోక్‌సభలో అన్నీ రికార్డులే." Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
- ↑ Loksabha (2004). "Chada Suresh". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
- ↑ Sakshi (6 July 2013). "సొంత గూటికి మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి!". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
- ↑ TV9 Telugu (27 June 2019). "టీడీపీ, కాంగ్రెస్‌లకు భారీ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేతలు". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)