కమ్లి (2006 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కమ్లి
దర్శకత్వంకె. ఎన్. టి. శాస్త్రి
రచనకె. ఎన్. టి. శాస్త్రి
నిర్మాతఅపూర్వ చిత్ర
బి.సి. హరి చరణప్రసాద్
సుకన్య
తారాగణంనందితా దాస్
తనికెళ్ల భరణి
షఫి
ఎల్.బి. శ్రీరామ్
రూపా దేవి
ఛాయాగ్రహణంసన్నీ జోసెఫ్
కూర్పుబీనా పాల్
సంగీతంఐజాక్ థామస్ కొట్టుకాపల్లి
విడుదల తేదీ
2006 (2006)
దేశంభారతదేశం
భాషతెలుగు

కమ్లి 2006లో కె. ఎన్. టి. శాస్త్రి దర్శకత్వం వహించిన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రంలో నందితా దాస్ లంబాడా అమ్మాయి టైటిల్ రోల్‌లో నటించింది. ఈ చిత్రానికి మాటలు సుద్దాల అశోక్ తేజ రాశారు. ఈ చిత్రం దక్షిణ కొరియాలోని బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ముంబైలో జరిగిన ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.[1]

అపూర్వ చిత్ర బ్యానర్ పై బి.సి. హరి చరణప్రసాద్, సుకన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విశేష ఆధరణ పొందడమే కాక తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం దక్కించుకుంది. నందితా దాస్ కు ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా తెచ్చిపెట్టింది.[2]

తారాగణం

[మార్చు]

ప్రేరణ

[మార్చు]

అవార్డు గెలుచుకున్న డాక్యుమెంటరీ హార్వెస్టింగ్ బేబీస్ చే కె.ఎన్.టి.శాస్త్రి ప్రేరణ పొందాడు. గిరిజన స్త్రీలు తమ బిడ్డలను అమ్ముకుంటున్న దుస్థితి పై వచ్చిన ఈ డాక్యుమెంటరీ ఆధారంగా ఆయన ఒక చలన చిత్రాన్ని రూపొందించాలనుకున్నాడు. సౌందర్య కథానాయికగా కమ్లి సినిమా చేయాలనుకున్నాడు, కానీ ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. ఆ పాత్రతో నందితా దాస్‌ తెలుగు తెరపై అరంగేట్రం చేసింది.[3]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Banjara Times: Voice of Goaars of India". Archived from the original on 22 July 2016. Retrieved 3 January 2012.
  2. "TollyWood Movies: ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు." web.archive.org. 2022-12-24. Archived from the original on 2022-12-24. Retrieved 2022-12-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Kamli: Good effort". www.rediff.com. Retrieved 2022-12-24.