కరణం సురేష్
కరణం సురేష్ | |
---|---|
జననం | |
మరణం | 2018 ఏప్రిల్ 16 | (వయసు 54)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల నటుడు, దర్శకుడు, గుణ నిర్ణేత |
కరణం సురేష్ (సెప్టెంబర్ 9, 1963 - ఏప్రిల్ 16, 2018) ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, గుణ నిర్ణేత.[1]
జననం - ఉద్యోగం
[మార్చు]సురేష్ 1963, సెప్టెంబర్ 9 న గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం గోళ్ళమూడిపాడులో జన్మించాడు. మేడికొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేశాడు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]గుంటూరులో రంగయాత్ర యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ అనే నాటక సంస్థను స్థాపించి 15 సంవత్సరాలుగా అనేక నాటకాలను ప్రదర్శించారు. ఎల్లప్పుడు యువతను సురేష్, దాదాపు 100 మందికిపైగా నటీనటులను, సాంకేతిక నిపుణులను తెలుగు నాటకరంగానికి పరిచయం చేశాడు.
నటించినవి
[మార్చు]- గ్రహణం
- అనంతం
- సత్యాగ్రహి
దర్శకత్వం చేసినవి
[మార్చు]- అంతర్నేత్రం
గుణ నిర్ణేతగా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టాత్మక నంది నాటక పరిషత్తుకు అనేక మార్లు గుణ నిర్ణేతగా వ్యవహరించడమేకాకుండా రాష్ట్రంలోని దాదాపు అన్ని పరిషత్తులకు గుణ నిర్ణేతగా వ్యవహరించాడు.
మరణం
[మార్చు]సురేష్ 2018, ఏప్రిల్ 16 తెలుగు నాటకరంగ దినోత్సవం రోజున లింగారావుపాలెంలోని కొండవీటి కళాపరిషత్ నాటక పోటీలకు గుణ నిర్ణయం చేసిన కొద్దిసేపటికే గుండెపోటు వచ్చింది. కారులో కాటూరి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ ఆర్కైవ్, ఆంధ్రభూమి, గుంటూరు (4 January 2018). "కళాసాంస్కృతిక రంగ దిక్సూచి అజోవిభొ కందాళం". Archived from the original on 17 ఏప్రిల్ 2018. Retrieved 17 April 2018.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link) - ↑ ముగిసిన నాటక పోటీలు, లింగారావుపాలెం, ఈనాడు గుంటూరు రూరల్, పుట 12.
- ↑ రంగస్థల నటుడు సురేష్ హఠాన్మరణం, యడ్లపాడు, ఆంధ్రజ్యోతి గుంటూరు ఎడిషన్, పుట 22.
- ↑ కళామతల్లి ఒడిలో కన్నుమూత, యడ్లపాడు, సాక్షి గుంటూరు ఎడిషన్, పుట 9.