కరీనా కపూర్ సినిమాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A picture of Kareena Kapoor, looking away from the camera.
2015 భజరంగీ భాయీజాన్ సినిమా ఫంక్షన్ లో కరీనా

కరీనా కపూర్, ప్రముఖ భారతీయ నటి. దాదాపు 50 బాలీవుడ్  చిత్రాల్లో నటించారు ఆమె. 2000లో అభిషేక్ బచ్చన్ సరసన రెఫ్యూజీ  సినిమాతో తెరంగేట్రం చేశారు కరీనా. ఆ సినిమాలోని నటనకు గానూ  ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకున్నారు. ఆ తరువాతి ఏడాది ఆమె 5 సినిమాల్లో నటించారు. ముఝే కుచ్ కెహనా హై, అజ్నబీ, కభీ ఖుషీ కభీ గం వంటి సినిమాల్లో నటించారు కరీనా. కభీ  ఖుషీ కభీ గం సినిమా ఆ సంవత్సరానికిగానూ అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.[1][2][3] ఈ సినిమా విజయం ఆమెను బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలబెట్టింది.[4] ఆ తరువాత ఆమె నటించిన ముఝ్సే దోస్తీ కరోగీ (2002), మై ప్రేంకీ దీవానీ హూ (2003) వంటి సినిమాలు పెద్దగా ఆడలేదు.

2004లో చమేలీ సినిమాలో వేశ్య పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమా ఆమె కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా మారింది.[5] ఈ చిత్రానికి ఫిలింఫేర్ ప్రత్యేక పెర్ఫార్మెన్స్ పురస్కారం అందుకున్నారు కరీనా.[6] అదే ఏడాది గోవింద్ నిహలానీ దర్శకత్వంలో దేవ్ సినిమాలో నటించారు ఆమె. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో తీసిన ఈ సినిమాలో ఒక ముస్లిం పాత్రలో కనిపించారు కరీనా.[7] రెండేళ్ళ తరువాత ఓంకారా (2006) సినిమాలో నటించారు ఆమె. ఈ సినిమా విలియం షేక్స్ పియర్ రాసిన ఒథెల్లో నవల ఆధారంగా తీశారు. ఇందులో డెస్డెమోనా పాత్రలో కనిపించారు కరీనా. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాలోని నటనకు కరీనా రెండు ఫిలింఫేర్ విమర్శకుల ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్నారు.[8] 2007లో షాహిద్ కపూర్ సరసన జబ్ వియ్ మెట్ సినిమాలో సిక్కు అమ్మాయిగా నటించారు ఆమె. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలోని నటనకు కూడా కరీనా ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు.[9]

2001

నోట్స్[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Top Lifetime Grossers Overseas". Box Office India. మూలం నుండి 26 January 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 30 January 2015. Cite web requires |website= (help)
  2. "Top Lifetime Grossers 2000-2009 (Figures in Ind Rs)". Box Office India. మూలం నుండి 14 October 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 30 January 2015. Cite web requires |website= (help)
  3. Chopra, Anupama (8 September 2003). "Starry Heights" (PDF). India Today. Retrieved 11 July 2012.
  4. "Top Actress". Box Office India. మూలం నుండి 17 October 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 17 February 2014. Cite web requires |website= (help)
  5. Tuteja, Joginder (4 September 2010). "Exploring 10 years journey of Kareena Kapoor — Part II". Bollywood Hungama. Retrieved 8 September 2010. Cite web requires |website= (help)
  6. "Awards 2003: Winners of the 49th Manikchand Filmfare Awards". Indiatimes. Retrieved 8 June 2014. Cite web requires |website= (help)
  7. Gupta, Parul (11 June 2004). "Dev: Gujarat in Bollywood, finally". The Times of India. Retrieved 19 November 2007.
  8. "Kareena Kapoor: Awards & Nominations". Bollywood Hungama. మూలం నుండి 6 August 2010 న ఆర్కైవు చేసారు. Retrieved 8 June 2014. Cite web requires |website= (help)
  9. "Box Office 2007". Box Office India. మూలం నుండి 15 January 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 31 January 2015. Cite web requires |website= (help)