కలవారి కోడలు (సినిమా)
కలవారి కోడలు (1964 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. హేమాంబరధరరావు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, కృష్ణకుమారి |
సంగీతం | టి. చలపతి రావు |
నిర్మాణ సంస్థ | రఘురాం ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
కలవారి కోడలు 1964 తెలుగు భాషా నాటక చిత్రం, రఘురాం పిక్చర్స్ బ్యానర్‌లో కె. హేమంబరధరరావు నిర్మించి, దర్శకత్వం వహించాడు.[1] [2] ఇందులో ఎన్. టి. రామారావు, కృష్ణ కుమారి ప్రధాన పాత్రలలో నటించగా సంగీతాన్ని టి. చలపతి రావు స్వరపరిచాడు.[3]
కథ
[మార్చు]ఇద్దరు మిత్రులు. ఒకరు వీణావాయిద్యంలో సిద్ధహస్తుడు. రెండవవాడు ఆనంద్ "మెడిసన్" లో శిక్షణ పొందుతుంటాడు. వారిద్దరూ ప్రాణమిత్రులు. ఒకరిని ఒకరు ఉండనేనంత సన్నిహితమవుతారు.
సోదరి లత, మిత్రుడు ఆనంద్ ల ప్రోత్సాహం మీద మైసూరు వీణావాయిద్యపు పోటీలకు వెళ్ళిన అతను అక్కడే మరణిస్తాడు. ఈ సంఘటన లతను, ఆనంద్ ను ఎంతగానో కలవరపరుస్తుంది.
సెలవుల్లో ఆనంద్, లతతో పాటు తన ఊరు వెడతాడు. లత మంఛితనాన్ని చూసి అతని తల్లి మురిసిపోతుంది.
ఆనంద్ కు యుక్త వయస్సు వచ్చింది కనుక, దగర సంబంధాన్ని అతని తల్లి ఖాయం చేస్తుంది. ఊ విషయం ఆనంద్ కు పూర్తిగా తెలియదు.
ఇది ఇలా ఉండగా లత, ఆనంద్ లు ప్రేమించుకుంటారు. పెళ్ళి చేసుకోవాలన్న భావన కూడా వారికి కలుగుతుంది. పొరుగూరు నుంచి రావలసిన లత సమయానికి రాకపోవడం, రైలు ప్రమాదం జరగడం ఆ ప్రమాదంలో ఆమె మరణించిందనే గాలి వార్త వినడాం ఆనంద్ ను కుమిల్చి వేస్తాయి.
లత ఎలాగూ మరణించింది కనుక, గత్యంతరం లేక, తల్లి కోరిక నెరవేర్చి అమెనయినా తృప్తి పరుద్దామని ఆనంద్ వివాహానికి ఒప్పుకుంటాడు.
కానీ కొంత కాలానికి లతను వింత పరిస్థితులలో కలుసుకోవడం, అతనిలో మళ్ళీ కొత్త సమస్యను రేకెత్తిస్తుంది.
లతతో సన్నిహితంగా ఉండటం ఆనంద్ భార్యకు మనస్కరించదు. ఆమెలో లేని పోణి అనుమానాలు కలుగుతాయి. లతకు విషమిచ్చి చంపాలన్న ఆమె పన్నాగం తలక్రిందులయి చివరికి మరణానికి దారి తీస్తుంది. లత, ఆనంద్ ల వివాహంతో కథ సుఖాంతమవుతుంది.[4]
పాటలు.
1: దొంగ చూపులు చూసి. ఘంటసాల, జీక్కి, రచన ఆరుద్ర.
2: భలేగా నవ్వితవి . ఘంటసాల . రచన: సి.నారాయణ రెడ్డి.
3: ఏమిటో ఈ విపరీతం . ఘంటసాల . రచన: కొసరాజు రాఘవయ్య.
తారాగణం
[మార్చు]- ఎన్. టి. రామారావు డాక్టర్ ఆనంద్ గా
- కృష్ణ కుమారి లాతగా
- రమణారెడ్డి శివానందంగా
- పద్మనాభం భీమా రావుగా
- చలం అంజీగా
- ప్రభాకర్ రెడ్డి శంకర్ గా
- సూర్యకాంతం గంగమ్మగా
- గీతాంజలి హంసాగా
- గిరిజ రాణిగా
- రాజలక్ష్మిగా హేమలత
సాంకేతిక వర్గం
[మార్చు]- కళ : బి. ఎన్. కృష్ణ
- నృత్యాలు : వెంపటి
- స్టిల్స్ : డి. రాధాకృష్ణ మూర్తి
- కథ - సంభాషణలు : నార్ల చిరంజీవి
- సాహిత్యం : సి. నారాయణ రెడ్డి, ఆరుద్ర, కొసరాజు, నార్ల చిర్ంజీవి
- నేపథ్య గానం : ఘంటసాల, పి. సుశీల, ఎస్. జానకి, జిక్కి, మాధవపేద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు,సరస్వతి
- సంగీతం : టి. చలపతి రావు
- కూర్పు : బి. గోపాల రావు
- ఛాయాగ్రహణం : ఎం. జి. సింగ్
- నిర్మాత - దర్శకుడు : కె. హేమంబరధరరావు
- నిర్మాణ సంస్థ : రఘురామ్ పిక్చర్స్
- విడుదల తేదీ : 14 మార్చి 1964
మూలాలు
[మార్చు]- ↑ "Kalavari Kodalu (Banner)". Chitr.com.[permanent dead link]
- ↑ "Kalavari Kodalu (Direction)". Filmiclub.
- ↑ "Kalavari Kodalu (Review)". The Cine Bay. Archived from the original on 2018-02-16. Retrieved 2020-08-23.
- ↑ "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-08-23.