కలికి యానాది రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలికి యానాది రెడ్డి

సహకార, దేవదాయ శాఖ మంత్రి
పదవీ కాలం
1989 - 1994

ఎమ్మెల్యే
పదవీ కాలం
1985 - 1999
ముందు పాతాళ్లపల్లి వెంగళ్ రావు
తరువాత వంటేరు వేణుగోపాల్ రెడ్డి
నియోజకవర్గం కావాలి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1978 - 1983
ముందు గొట్టిపాటి కొండపనాయుడు
తరువాత పాతాళ్లపల్లి వెంగళ్ రావు

వ్యక్తిగత వివరాలు

జననం 1950
కావలి, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ

కలికి యానాది రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కావలి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

కలికి యానాది రెడ్డి 1968లో జలదంకి మండలంలోని, జమ్మలపాళెం గ్రామ సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, 1970లో కావలి సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1972లో కావలి ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి కొండపనాయుడుతో వచ్చిన విభేదాలను యానాదిరెడ్డి తన రాజకీయ ఎదుగుదలకు మలుచుకొని దీటైన ప్రత్యర్థిగా నియోజకవర్గ స్థాయి నాయకుడిగా బలపడ్డారు. ఆయన 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి గొట్టిపాటి కొండపనాయుడుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన ఆతరువాత 1983లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి, ఆ తర్వాత 1985, 1989, 1994 వరసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 1989 నుండి 1994 వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో సహకార, దేవదాయశాఖ మంత్రిగా పని చేశాడు.

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (6 May 2022). "కావలి కలికి తురాయి యానాదిరెడ్డి". Archived from the original on 16 March 2024. Retrieved 16 March 2024.
  2. Sakshi (17 March 2024). "కావలి శాసనసభ". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.