Jump to content

కలిమిశ్రీ

వికీపీడియా నుండి
కలిమిశ్రీ
కలిమిశ్రీ
జననం1966
ఇతర పేర్లుకలిమికొండ సాంబశివరావు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత, కార్టూనిస్ట్
తల్లిదండ్రులు
  • బసవయ్య (తండ్రి)
  • దేవకమ్మ (తల్లి)

కలిమిశ్రీ లేక కలిమికొండ సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రచయిత. కార్టూనిస్ట్, పాత్రికేయులు. తెలుగు కార్టూనిస్టుల అసోసియేషన్‌కు ప్రధాన కార్యదర్శి,[1] మల్లెతీగ సాహిత్యవేదిక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం కోశాధికారి.[2]

కుటుంబ నేపధ్యం

[మార్చు]

1966లో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో కలిమికొండ బసవయ్య-దేవకమ్మలకు ఐదో సంతానంగా కలిమికొండ సాంబశివరావు (కలిమిశ్రీ) జన్మించారు. కొత్తరెడ్డిపాలెం గ్రామంలోనే హైస్కూలు విద్య పూర్తి చేసుకున్న ఆయన గుంటూరులోని హిందూ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు

పాత్రికేయులుగా

[మార్చు]

1988లో ఆంధ్రపత్రికలో విలేకరిగా ఆయన పత్రికారంగ జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి, జ్యోతిచిత్ర, విద్య, ధ్యానమాలిక, సహస్రార, వందే గోమాతరం, మహోదయ వంటి పత్రికల్లో పనిచేశారు. జ్యోతిచిత్ర సినిమా పత్రికకోసం అక్కినేని నాగేశ్వరరావు మొదలు సినిమా ఇండిస్టీలో ఎంతోమంది ఇంటర్వ్యూలు చేశారు. ఆంధ్రజ్యోతి కోసం స్వాతి బలరామ్‌ మొదలు, సత్యం కంప్యూటర్స్‌ రామలింగరాజు వంటి ఎంతో మంది పారిశ్రామికవేత్తల్ని ఇంటర్వ్యూలు చేశారు. 22 సంవత్సరాలుగా పత్రికా రంగంతోనే ఆయన జీవితం ముడిపడి ఉంది. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వివిధ శీర్షికలకు కార్టూన్లు అందించారు. ప్రజాశక్తి దినపత్రికలో రెండు సంవత్సరాలపాటు పాకెట్‌ కార్టూన్లు అందించారు. సతీమణి ప్రచురణకర్తగా వ్యవహరిస్తున్న 'నవమల్లెతీగ' సాహిత్య మాసపత్రికను సంపాదకులుగా కలిమిశ్రీ నడుపుతున్నారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఆవిష్కరించారు. బొప్పన విజయకుమార్‌ ప్రచురణకర్తగా వ్యవహరిస్తున్న 'రేపటికోసం' మాసపత్రికు అసోసియేట్‌ ఎడిటర్‌గా కొనసాగుతున్నారు.[3]


మల్లెతీగ పురస్కారం

[మార్చు]

మంచి సాహిత్యాన్ని రికార్డు చేయాలన్న సత్సంకల్పంతో 'మల్లెతీగ' పురస్కారాన్ని నెలకొల్పి నాలుగేళ్లుగా మల్లెతీగ పురస్కారాన్ని కవులకు ఇస్తున్నారు. ఇది సాహిత్యరంగంలో మంచి పురస్కారంగా కవులు చెప్పుకుంటుంటారు. 'మల్లెతీగ' సాహిత్య వేదిక ద్వారా అనేక సాహితీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కథ, కవిత, గజల్స్‌, రెక్కలు వంటి ప్రక్రియలపై కవులకు, రచయితలకు అవగాహన సదస్సులు, ప్రఖ్యాత కవులు, రచయితలను ఆహ్వానించి వారిచే కొత్తతరం వారికి సాహిత్యంపై శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. 'మల్లెతీగ ముద్రణలు' పేరుతో సాహిత్య పుస్తకాల ముద్రణలకు కూడా కలిమిశ్రీ కృషిచేస్తున్నారు. కవులకు సరసమైన ధరలకు వారి సాహిత్యాన్ని పుస్తకంగా రూపొందించి వారికి అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 800 సాహిత్య పుస్తకాలు ముద్రణకు నోచుకునేందుకు కృషిచేశారు.[4]

అవార్డులు

[మార్చు]
  • ఉత్తమ జర్నలిస్టుగా 2008 ఆగస్టు నెలలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా సత్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రంలో అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు కూడా అందుకున్నారు.
  • 2016లో శ్రీ కృష్ణదేవరాయలు జాతీయ పురస్కారం-2016 సాహితి కృషికి గాను కలిమిశ్రీ గారికి అందచేశారు.
  • 2018 జూన్ నెలలో తుమ్మలపల్లి కళాకేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన విలంబినామా ఉగాది వేడుకలలో  ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్నారు.
  • 2018 కలర్స్ సాహిత్య సేవ పురస్కారం చిన్నజీయర్ స్వామి చేతులమీద అందుకున్నారు.

ఇవీ చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]