Jump to content

కలెక్టర్ గారి అబ్బాయి

వికీపీడియా నుండి
కలెక్టర్ గారి అబ్బాయి
దర్శకత్వంబి. గోపాల్
రచనగణేష్ పాత్రో (మాటలు)
స్క్రీన్ ప్లేఎ. ఆంజనేయ పుష్పానంద్
కథకొమ్మనాపల్లి గణపతిరావు
ఎ. ఆంజనేయ పుష్పానంద్
ఎస్. రామ్మోహన రావు
నిర్మాతయార్లగడ్డ సురేంద్ర
తారాగణంఅక్కినేని నాగేశ్వరరావు,
అక్కినేని నాగార్జున,
రజని,
శారద
ఛాయాగ్రహణంఎస్. గోపాల రెడ్డి
కూర్పుకె. ఎ. మార్తాండ్
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
ఎస్. ఎస్. క్రియేషన్స్
పంపిణీదార్లుఅన్నపూర్ణ స్టూడియోస్
విడుదల తేదీ
1987 ఏప్రిల్ 8 (1987-04-08)
సినిమా నిడివి
170 ని
దేశంభారతదేశం
భాషతెలుగు

కలెక్టర్ గారి అబ్బాయి బి. గోపాల్ దర్శకత్వంలో 1987లో విడుదలైన చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, రజని, శారద ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎస్. ఎస్. క్రియేషన్స్ పతాకంపై యార్లగడ్డ సురేంద్ర నిర్మించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా పంపిణీ చేయబడింది. ఈ సినిమాకు కె. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించాడు.

కలెక్టరు రమాకాంతరావు తన వృత్తి పట్ల నిబద్ధత కలిగిన వాడు. ఆయనకు చట్టం, న్యాయం అంటే ఎనలేని గౌరవం. వారిది ముచ్చటైన కుటుంబం, భార్య లక్ష్మీదేవి, కొడుకు రవి, కూతురు జ్యోతిలతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. తండ్రికి, కొడుక్కి అప్పుడప్పుడు కొన్ని అభిప్రాయ బేధాలు వస్తుంటాయి. రవి కొన్ని సార్లు చట్టాన్ని ఉల్లంఘించకపోతే న్యాయం జరగదు అంటూ ఉంటాడు. దానికి అతని తండ్రి అంగీకరించడు. వ్యాపారవేత్త అయిన అప్పారావు, అతని భాగస్వామి ఏలిముద్రల ఎల్లయ్య కలిసి వారి కొడుకులు కన్నారావు, చిన్నారావుతో కలిసి దొంగ వ్యాపారాలు చేస్తుంటారు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: బి.గోపాల్
  • కధ: కొమ్మనాపల్లి గణపతిరావు, ఎ.ఆంజనేయ పుష్పానంద్, ఎస్.రామ్మోహనరావు
  • సంగీతం: కొమ్మినేని చక్రవర్తి
  • చిత్రానువాదం: ఎ.ఆంజనేయ పుష్పానంద్
  • మాటలు: గణేష్ పాత్రో
  • గీత రచయిత: వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ, పులపాక సుశీల, మనో
  • ఛాయ గ్రహణం: ఎస్.గోపాలరెడ్డి
  • కూర్పు: కె.ఎ.మార్తాండ్
  • నిర్మాత: యార్లగడ్డ సురేంద్ర
  • నిర్మాణ సంస్థ: ఎస్.ఎస్.క్రియేషన్స్
  • పంపిణీదారులు: అన్నపూర్ణ స్టూడియోస్
  • విడుదల:08:04:1987.

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించాడు. వేటూరి సుందర్రామ్మూర్తి పాటలు రాశాడు. పాటలు ఎ. వి. ఎం మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యాయి.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "అందమా అంటుకోనీవే"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుశీల 4:11
2. "నచ్చిన చోట"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుశీల 3:41
3. "బంగారు లేడిని కోరినా"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుశీల 3:53
4. "మన్మథా మన్మథా"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుశీల 3:36
5. "సన్నాయి ఆపకు బావా"  మనో, పి. సుశీల, ఎస్. పి. శైలజ 5:00

మూలాలు

[మార్చు]