కలేసర్ జాతీయ ఉద్యానవనం
కలేసర్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
Park | |
Coordinates: 30°22′N 77°32′E / 30.367°N 77.533°E | |
Country | India |
రాష్ట్రం | హర్యానా |
జిల్లా | యముననగర్ |
Government | |
• Type | హర్యానా ప్రభుత్వం |
• Body | హర్యానా అటవీ శాఖ |
Time zone | UTC+5:30 (IST) |
కలేసర్ జాతీయ ఉద్యానవనం హర్యానా రాష్ట్రంలోని యముననగర్ జిల్లాలో ఉంది.[1]
చరిత్ర
[మార్చు]ఈ ఉద్యానవనం మొదట డిసెంబరు 13, 1996లో 53.45 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ఉండేది. ఈ ఉద్యానవనం డిసెంబరు 8, 2003లో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు.[2] ఇది 53 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది.[3]
వృక్ష సంపద
[మార్చు]ఈ ఉద్యానవనంలో 53% దట్టమైన అడవి, 38% ఓపెన్ ఫారెస్ట్, 9% స్క్రబ్ ఉన్నాయి. ఈ ఉద్యానవనంలో ఆకు సాల్ చెట్లతో పాటు, సెముల్, అమల్టాస్, బహేరా, ఖైర్, షిషామ్, సెయింట్, జింగాన్, చల్ లాంటి మొక్కలు కనిపిస్తాయి. హర్యానాలో పెరిగే సహజమైన సాల్ ట్రీ మొక్కలు ఇందులో పెరుగుతాయి.
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈ ఉద్యానవనంలో ఉన్న కలేసర్ మహాదేవ్ ఆలయానికి మీదుగా ఈ ఉద్యనవనానికి కలేసర్ జాతీయ ఉద్యానవనంగా నామకరణం చేశారు. 2015 లో ఈ ఉద్యానవనంలో అంతరించిపోతున్న పాంథర్లు ఉన్నాయి. కానీ 1989 జీవవైవిధ్య నివేదిక ప్రకారం ఇందులో 19 పాంథర్లను గుర్తించారు.
మూలాలు
[మార్చు]- ↑ 2 Leopard spotted in Kalesar National park, Published 16 June 2016
- ↑ Bhardwaj, Bipin (5 December 2014). "Wildlife Department installs 80 camera traps for animal census". The Tribune. Archived from the original on 8 డిసెంబరు 2014. Retrieved 22 October 2019.
- ↑ Kalesar National Park Archived 2018-03-08 at the Wayback Machine, Haryana Forests.