Jump to content

కలే చెట్టు

వికీపీడియా నుండి
(కలే కాయలు నుండి దారిమార్పు చెందింది)

కలే చెట్టు
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
C. carandas
Binomial name
Carissa carandas
మొక్క
Fruit

వాక్కాయ మొక్కలు వృక్ష శాస్త్రీయ నామం Carissa carandas. దేశీయ క్రాన్ బెర్రీస్ (వాక్కాయ మొక్కను కలే చెట్టు, కరండ, కలే కాయలు, కలేక్కాయలు, కలివి కాయలు, వాక్కాయలు,కలిమి కాయలు అని కూడా అంటారు. కరీంనగర్ జిల్లాలో ఊడుగు పండ్లు అని అంటరాని తెలిసింది. ఇవి ఆంధ్రప్రదేశ్ లోని ఆన్ని ప్రాంతాల చిట్టడవులలో, కొండ ప్రాంతాలలో సహజసిద్ధంగా పెరుగుతాయి. పుల్లగా ఉండే ఈ పళ్ళను కూరలలో పులుపుకు, పచ్చళ్ళగా ఉదాహరణకు వాక్కాయ పులిహోర, మాంసం వాక్కాయ, అనేక విధాలుగా వాడుతున్నారు.. అడవులలో సహజసిద్ధంగా పెరిగే ఈ మొక్కలనుండి పండ్లు వానకాలంలో కొన్నిరోజులు మాత్రమే లభిస్తాయి. ఇది అపోసైనేసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క. ఇది బెర్రీ పరిమాణంలో పండ్లు ఉత్పత్తి చేస్తుంది, వీటిని సాధారణంగా భారతీయ ఊరగాయలు, సుగంధ ద్రవ్యాలలో ఒక రుచికోసం కలిపే పదార్థంగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క కరువు పరిస్థితులను తట్టుకుని నేలల యొక్క విస్తృత శ్రేణిలో బాగా దృఢంగా పెరుగుతుంది.

వ్యాప్తి

[మార్చు]

దక్షిణ భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ పెరిగే ఈ మొక్కలు ఇచ్చే పండ్లు భారత క్రాన్ బెర్రీస్ గా పిలవబడుతూ మూత్రపిండాలలో రాళ్ళని కరిగించే విగా మూత్ర నాళాలని శుభ్రపరిచేవిగా ప్రసిధ్ధి చెందినవి. హిమాలయాలలో 300 నుంచి 1800 మీటర్ల ఎత్తులో, షివాలిక్ కొండలలో, పశ్చిమ కనుమలు, నేపాల్, శ్రీలంక,, ఆఫ్ఘనిస్తాన్ లలో సహజంగా పెరుగుతుంది. సాగు :రాజస్థాన్, బీహారు, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో కొందరు రైతులు వ్యవసాయపంటగా సాగు చేస్తున్నారు.

వాక్కాయ మొక్కలు / కరండమొక్క

[మార్చు]

వాక్కాయ మొక్కలు / కరండ పొదవంటి మొక్క.నేలనుంచి సుమారు 5-7 అడుగులెత్తు పెరుగుతుంది.ఎక్కువ నీటి అవసరంలేనందున ఉష్ణప్రాంతాలు ఈమొక్క పెరుగుటకు అనుకూలం.మొక్క నిడుపాటి కొమ్మలను కలిగివుంటుంది.ఎక్కువ రెండుకొమ్మలను ప్రారంభంలో కలిగివుండును.అతరువాత మిగతా కొమ్మలు పెరుగును.కొమ్మలమీద అక్కడక్కడ సుమారు ఒక అంగుళం పొడవున్న కంటకాలు/ముళ్ళు వుంటాయి.పత్రాలు/ఆకులు రెండునుండి మూడు అంగుళాల పొడవుండును.పత్రాల రంగు లేత పచ్చరంగునుండి-ముదురుపచ్చరంగుకలిగివుండును.కొమ్మలమీదనున్న ముళ్ళ తొడిమలవద్ద పుట్టు ఆకులు ఒకదాకొకటి ఎదురుగా వుండును.ఎటువంటి సంరక్షణ, పోషణ అవసరంలేకుందగానే గుట్తలమీద, గట్టులమీద పెరుగు ఈమొక్కను రైతులు పొలాలకు, కళ్ళాలకు, దొడ్లకు కంచెలా పెంచెదరు.పండ్లనుంచివఛ్చివిత్తానాలను విత్తిన కొత్తమొక్కలను మొలచును.

వాక్కాయలు / కరండ పండు

[మార్చు]

వేసవికాలంలో మార్చి నెలనుండి మే-జూన్ వరకు ఈ వాక్కాయలు / కరండపండు లభిస్తుంది.[1] వాక్కాయలు / కరండపండు చూచుటకు క్రాన్ బెర్రీస్ పోలివుండును.పరిమాణంలో ద్రాక్షపండుకన్నకొంచెం చిన్నదిగావుండి, గుండ్రంగా కనిపిస్తుంది. సుమారు 5-6 కాయలున్నగుత్తులు అక్కడక్కడ పెరుగుతాయి.కొన్నిగుత్తులు/గుచ్ఛంలలో ఒకటి-రెండుకాయలుమాత్రమే వుంటాయి.చిన్నకాయలుగా వున్నప్పుడు మొక్కఆకులవలే కాయలు పచ్చగా వుండి, పెరిగెకొలది రంగుమారి పచ్చదనంకలసిన గులాబి-ఎరుపు రంగుగా పరివర్తనం చెందుతుంది.పూర్తిగా పండు అవ్వుటకు ముందుదశలో ముదురుఎరుపురంగుగా మారి, పూర్తిగా మాగి పండైనతరువాత నల్లగా కన్పిస్తుంది. కాయగా వున్నప్పుడు కోసినచో కాయతొడిమ నుండి తెల్లటిపాలవంటి ద్రవం స్రవిస్తుంది.పండుగా అయ్యిన తరువాతకూడా పండునుకోసినప్పుడు కూడా స్వల్ప పరిమాణంలో తొడిమనుండి తెల్లటిద్రవం కారుతుంది.పండులోపల అర్ధచంద్రాకారంలో వుండి, ఒకపక్కనొక్కబడిన విత్తనాలు అనేకం వుండును.

పచ్చి కలింకాయలు

పండు రుచి

[మార్చు]

వాక్కాయలు / కరండకాయ ఒగరు రుచి కలిగివుండి, తినుటకు అనుకూలంకాదు.కాయ మాగడం మొదలై దోరగా అయ్యినప్పుడు పులుపురుచిని కలిగి తినుటకు యోగ్యంగా వుండును.పూర్తిగా పండినతరువాత మధురమైన తీపి రుచిని కల్గి, కొంచెం పులుపుకలిగి తినుటకు అనుకూలంగా వుండును.పాయను-పండును కోసినప్పుడు తొడిమనుండి కారి పండుకు అంటుకున్న తెల్లనిపాలను నీటితోకడిగివేసి, తినవలెను.

పండు ఉపయోగాలు

[మార్చు]
  • పండును తినుటకు ఉపయోగిస్తారు.
  • పండులో సి విటమిన్ ఉంది.
  • పండును తినడం వలన పిత్థమును నివారించవచ్చును.
  • వాక్కాయలు / కరండ కాయ పుల్లగావుంటుందికావున, పుల్లగా ఉండే ఈ పళ్ళను కూరలలో పులుపుకు, పచ్చళ్ళగా ఉదాహరణకు వాక్కాయ పులిహోర, మాంసం వాక్కాయ, అనేక విధాలుగా వాడుతున్నారు.
  • వాక్కాయలులో పెక్టిన్అధికంగా వుండటం వలన, జామ్ (jam), జెల్లి (jelly) తయారిలో కరండ పండును ఉపయోగిస్తారు.
  • కాయనుండి తీసిన స్రవం మధుమేహరోగనివారణిగా పనిచేస్తుంది[2]

వాక్కాయలు (కాన్ బెర్రీస్) కాన్ బెర్రీలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయని జర్మనీ లోని డ్యుసెల్ డోర్స్ యూనివర్శిటీ అధ్యయన కారుడు అనా రోడ్రిగ్స్ తెలిపారు. వాక్కాయల రసంలో ఫైటో న్యూట్రియంట్స్, అంథోసైనిన్స్, ఫినోలిక్ యాసిడ్స్, అధికంగా ఉన్నాయి. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ పాలిఫినల్స్ వనల కణాలు దెబ్బతినకుండా ఇన్ఫెక్షన్లకు గురవకుండా రక్షిస్తుంది. 18-40 సం. రాల వయసున్న 10మంది ఆరోగ్యవంతులపై చేసిన పరీక్షలలో రక్తనాళాలలోని రక్తప్రసారం ఎటువంటి ఆటంకాలు లేకండా సాఫీగా ఉందని, హృద్రోగ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పట్టినట్లు తేలింది. నీటితో కలిపిన వాక్కాయల రసంలో పాలిఫినాల్స అధికసంఖ్యలో ఉన్నట్లు వెల్లడైంది. వాక్కాయల రసం తీసుకున్న వారికి అధిలోస్కాలోరోసిస్ వ్యాధి తగ్గుముఖం పట్టింది. హార్మోన్ల విడుదల మూత్రపిండాల పనివిధానంలో వాక్కాయలు రసం ప్రధాన పాత్ర వహించింది. గుండెకు సంబంధించిన సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ లో మెరుగుదల కనిపించింది. ప్రతిరోజూ వాక్కాయల రసం తీసుకోవటం వలన ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారించగలదు. దంతాలు పుచ్చిపోకుండా నుండి నోటి దుర్వాసన నుంచి కాపాడుతుంది. మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడటంతో పాటు పెప్టిక్ అల్సర్, పొట్టనొప్పిని నివారిస్తుంది. విటమిన్ సి అధికంగా ఉండటం కారణంగా స్కర్వీ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. రోజూ వీటి రసం తాగటం వలన గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-10-29. Retrieved 2013-06-08.
  2. http://www.ncbi.nlm.nih.gov/pubmed/21439367

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
  1. FOREST FLORA OF ANDHRA PRADESH Kali-Kai - కలిక్‌కాయ
  2. flowers of india [1]
  3. [2]