కళావతి (సినిమా)
కళావతి | |
---|---|
దర్శకత్వం | సుందర్.సీ |
రచన | వెంకట్ రాఘవన్ సుందర్.సీ |
స్క్రీన్ ప్లే | సుందర్.సీ, ఎసిబి. రామ దాస్ |
నిర్మాత | ఖుష్బూ |
తారాగణం | త్రిష సిద్దార్థ్ సుందర్.సీ హన్సిక పూనమ్ బజ్వా కోవై సరళ |
ఛాయాగ్రహణం | యుకె. సెంథిల్ కుమార్ |
కూర్పు | శ్రీకాంత్.ఎన్.బి |
సంగీతం | హిప్హాప్ తమిజా |
విడుదల తేదీ | 29 జనవరి 2016 |
సినిమా నిడివి | 136 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కళావతి 2016లో విడుదలైన కామెడీ హర్రర్ సినిమా. తమిళ్ లో అరణ్మనై 2 పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో కళావతి పేరుతో దుబ్బింగ్ చేసి విడుదల చేశారు. గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ నిర్మించిన ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహించాడు. త్రిష, సిద్దార్థ్, సుందర్.సీ, హన్సిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 29 జనవరి 2016న విడుదలైంది.[1]
కథ
[మార్చు]కోవిలూర్ గ్రామంలో అమ్మవారి విగ్రహానికి కుంభాభిషేకం చేయడం కోసం ఆ ఊరి పెద్దలు సిద్ధమవుతారు. అందుకోసం ఆ విగ్రహానికి స్థానం భ్రంశం కలిగిస్తారు. దాంతో అప్పటివరకు అమ్మవారికి భయపడి ఎక్కడో దాక్కున్న ఆత్మలు ఒక్కసారిగా విజృంభిస్తాయి. దాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు స్వాములు కొన్ని ఆత్మలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. ఆ సమయంలో ఒక ఆత్మ ఆ ఊరి జమీందారు బంగళాలోకి వస్తుంది. ఇది తెలుసుకున్న మురళి(సిద్ధార్థ), కోడలు అనిత(త్రిష) ఊరికి వచ్చి అక్కడ ఏదో వుందనే విషయాన్ని ఇద్దరూ గ్రహిస్తారు. పట్టణం నుంచి వచ్చిన అనిత అన్నయ్య రవి(సుందర్ సి.) దాని గురించి విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ ఆత్మ జమీందారు కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేసింది? దానికి జరిగిన అన్యాయం ఏమిటి? ఆ ఆత్మ పగ తీర్చుకొని శాంతించిందా? దాన్ని ఆ బంగళా నుంచి పంపించేందుకు రవి ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు? అనేది మిగతా సినిమా కథ. [2]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- నిర్మాత:గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్
- సమర్పణ: జవ్వాజి రామాంజనేయులు
- దర్శకత్వం:సుందర్.సీ
- రచన: వెంకట్ రాఘవన్, సుందర్.సీ
- స్క్రీన్ ప్లే: సుందర్.సీ, ఎసిబి.రామ దాస్
- సంగీతం: హిప్ హాప్ తమీజా
- సినిమాటోగ్రఫీ: యుకె. సెంథిల్ కుమార్
- ఎడిటింగ్: ఎన్.బి.శ్రీకాంత్
- మాటలు: శశాంక్ వెన్నెలకంటి
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (28 October 2016). "Kalavathi Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 8 జూలై 2021. Retrieved 8 July 2021.
- ↑ Sakshi (29 January 2016). "'కళావతి' మూవీ రివ్యూ". Archived from the original on 8 జూలై 2021. Retrieved 8 July 2021.
- ↑ Sakshi (26 January 2016). "మేమిద్దరం స్నేహితులమే!". Sakshi. Archived from the original on 8 జూలై 2021. Retrieved 8 July 2021.