పూనమ్ బజ్వా
పూనమ్ బజ్వా | |
---|---|
జననం | పూనమ్ అమర్జిత్ సింగ్ బజ్వా ఏప్రిల్ 05 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2005–ప్రస్తుతం |
ఎత్తు | 5 అడుగుల, 10 అంగుళాలు |
తల్లిదండ్రులు | అమర్జిత్ సింగ్, దీపికా సింగ్ |
పూనమ్ బజ్వా భారతీయ సినిమా నటి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించింది.[1]
జననం
[మార్చు]పూనమ్ ముంబై లోని పంజాబీ కుంటుబంలో 1985, ఏప్రిల్ 05 న జన్మించింది. తండ్రి అమర్జిత్ సింగ్ నౌకాదళ అధికారి, తల్లి దీపికా సింగ్ గృహిణి. చెల్లెలు పేరు దయా. 2005 లో మిస్ పూణేగా గెలిచింది. పై చదువులు చదువుకుంటూనే పార్ట్ టైమ్ మోడలింగ్ ప్రారంభించింది. ఒక రాంప్ షో కోసం హైదరాబాద్ కి వచ్చినపుడు, మొదటి సినిమా దర్శకుడు చూసి తన సినిమాలో నటించాలని కోరారు. 12వ తరగతి చదివిన పూనమ్, తన కాలేజి చదువుకు ఐదు నెలల విరామం ఉండడంతో, చిత్రంలో నటించటానికి అంగీకరించింది. పూణేలోని SIMC నుండి సాహిత్యంలో డిగ్రీ అందుకుంది.
సినీ ప్రస్థానం
[మార్చు]2005లో వచ్చిన మొదటి సినిమా ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన పూనమ్, అక్కినేని నాగార్జునతో బాస్, భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు సినిమాలతో సహా పలు తెలుగు చిత్రాలలో నటించింది.
2008లో హరి దర్శకత్వంలో వచ్చిన సేవల్ అనే మసాలా చిత్రం ద్వారా తమిళంలోకి అడుగుపెట్టి, తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి చిత్రాలలో నటించింది.
కొత్త దర్శకుడు ప్రవీణ్ దర్శకత్వంలో నటించింది. మమ్ముట్టి, మోహన్ లాల్తో కలిసి నటించింది. రఫీ మెకార్టీన్ దర్శకత్వంలో వచ్చిన చైనా టౌన్ అనే మలయాళ సినిమాలో ఎమిలీ పాత్రలో మోహన్ లాల్, దిలీప్, జయరాం, సూరజ్ వెంజారామూడ్, కావ్య మాధవన్ లతో నటించింది.
'ఓం' సినిమాను తెరకెక్కించిన సునీల్ రెడ్డితో పూనమ్ కి రహాస్యంగా పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి.[2]
చిత్ర సమహారం
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2005 | మొదటి సినిమా | సింధు | తెలుగు | |
2006 | ప్రేమంటే ఇంతే | పావని | తెలుగు | |
బాస్ | శృతి రాంప్రకాశ్ | తెలుగు | ||
తంగిగాగి | ప్రియ | కన్నడ | ||
2007 | వేడుక | హరిణి | తెలుగు | |
2008 | పరుగు | సుబ్బలక్ష్మీ నీలకంఠ | తెలుగు | |
పెవల్ | పారిజాతం పంచమి | తమిళం | ||
తేనేవట్టు | గాయత్రి | తమిళం | ||
2010 | కచేరి ఆరంభం | మది | తమిళం | |
ద్రోహి | శృతి, లోచని | తమిళం | ||
2011 | తంబికొట్టయి | కనగ అమృతలింగం | తమిళం | |
చైన టౌన్ | ఎమిలి | మలయాళం | ||
వెనిసిల్ వ్యాపారి | లక్ష్మీ | మలయాళం | ||
2012 | శికారి | రేణుక, నందిత | మలయాళం కన్నడ |
|
మంత్రికన్ | నందిని | మలయాళం | ||
2014 | పెరుచాజి | పూనమ్ బాజ్వా | మలయాళం | అతిథి పాత్ర |
2015 | ఆంబాల | పూనమ్ బాజ్వా | తమిళం | అతిథి పాత్ర |
రోమియో జూలియట్ | నిషా | తమిళం | ||
2016 | మస్త్ మొహబాత్ | మాయ | కన్నడ | |
ఆరన్మణి 2 | మంజు | తమిళం | ||
కళావతి 2[3] | మంజు | తెలుగు | ||
ముతిన కతిరికై | మాయ | తమిళం | ||
జాచరియా పోతెన్ జీవిచిరిప్పుండ్ | మలయాళం | |||
రోసాపూక్కలమ్ | మలయాళం | |||
భోగి | తమిళం | చిత్రీకరణ | ||
2017 | జచరియా పోథేన్ జీవిచరిప్పుదు | మరియా | మలయాళం | |
మాస్టర్ పీస్ | స్మిత | గ్రేట్ శంకర్ తెలుగులో | ||
2019 | ఎన్.టి.ఆర్. కథానాయకుడు | గారపాటి లోకేశ్వరి | తెలుగు | |
కుప్పతు రాజా | మేరీ | తమిళ్ | ||
2022 | పథానపాఠం నూత్తాండు | మలయాళం | పోస్ట్ ప్రొడక్షన్ | |
2023 | SG 251 | నిర్మాణంలో ఉంది |
మూలాలు
[మార్చు]- ↑ టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "పూనమ్ బాజ్వా,PoonamBajwa". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 15 January 2018.[permanent dead link]
- ↑ టి.ఎస్. న్యూస్. "పూనమ్ బాజ్వా పెళ్లి అయ్యిందా?". www.tsnews.tv. Archived from the original on 3 August 2017. Retrieved 2 October 2016.
- ↑ సాక్షి, సినిమా. "'కళావతి' న్యూ స్టిల్స్". Retrieved 2 October 2016.