కళ్యాణ్ సింగ్ గుప్తా
కల్యాణ్ సింగ్ గుప్తా | |
---|---|
జననం | 1923 |
మరణం | 23 జనవరి 2002 |
వృత్తి | స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త |
పురస్కారాలు | పద్మశ్రీ అవార్డు |
కళ్యాణ్ సింగ్ గుప్తా (1923–2002) హర్యానా రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త.[1] 1952లో సుచేత కృపలానీతో కలిసి లోక్ కళ్యాణ్ సమితి స్థాపించాడు.[2][3][4]
జననం, విద్య
[మార్చు]కళ్యాణ్ సింగ్ గుప్తా 1923లో భారతదేశంలోని హర్యానాలో జన్మించాడు. పంజాబ్, ఢిల్లీలలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో హెరాల్డ్ లాస్కీ పర్యవేక్షణలో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నాడు.[1] 1951లో భారతదేశానికి తిరిగి వచ్చిన కళ్యాణ్ సింగ్ ఇండియా న్యూస్ క్రానికల్‌లో జర్నలిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించాడు.[1]
ఉద్యమ జీవితం
[మార్చు]విద్యార్థి దశలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు.
సామాజిక కార్యక్రమాలు
[మార్చు]ఒక సంవత్సరం తరువాత, అతను సుచేత కృపలానీతో కలిసి లోక్ కళ్యాణ్ సమితిని స్థాపించాడు.[1] టిబెట్ శరణార్థులకు సహాయ సహకారాలు అందించడానికి 1959లో సెంట్రల్ రిలీఫ్ కమిటీను కూడా ప్రారంభించాడు.[1]
పురస్కారాలు
[మార్చు]1969లో భారత ప్రభుత్వం నాలుగో అత్యున్నత భారతీయ పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డుతో కళ్యాణ్ సింగ్ గుప్తాను సత్కరించింది.[5]
మరణం
[మార్చు]కళ్యాణ్ సింగ్ గుప్తా తన 79 సంవత్సరాల వయసులో 2002, జనవరి 23న న్యూఢిల్లీలో మరణించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Tribune India". Tribune India. 24 January 2002. Retrieved 16 October 2021.
- ↑ "LKS". Lok Kalyan Samiti. 2015. Archived from the original on 12 February 2015. Retrieved 16 October 2021.
- ↑ "IIT Delhi Alumni Association". IIT Delhi Alumni Association. 14 November 2010. Retrieved 16 October 2021.
- ↑ "LKS About US". LKS. 2015. Archived from the original on 12 February 2015. Retrieved 16 October 2021.
- ↑ "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on 15 November 2014. Retrieved 16 October 2021.