కవల పిల్లలు
కవల పిల్లలు (1964 తెలుగు సినిమా) | |
తారాగణం | శివాజీ గణేశన్, జానకి, ఎం.ఆర్.రాధా, పుష్పలత |
---|---|
గీతరచన | శ్రీశ్రీ |
నిర్మాణ సంస్థ | కస్తూరి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
కవల పిల్లలు తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి 1963లో విడుదలైన పార్ మగళె పార్ అనే తమిళ సినిమా మాతృక.
నటీనటులు
[మార్చు]- శివాజీ గణేశన్ - జమీందార్ శివానందం
- షావుకారు జానకి - జమీందార్ భార్య
- ఎం.ఆర్.రాధా - నటరాజ్ (డాన్స్ మాస్టర్)
- పుష్పలత - కాంత
- విజయకుమారి - చంద్ర
- వి.కె.రామస్వామి - రామస్వామి
- కరుణానిధి - మాణిక్యం
- రుక్మిణి - రామస్వామి భార్య
కథ
[మార్చు]సంతానం కోసం తపించిన జమీందారు శివానందానికి చివరకు ఒక ఆడపిల్ల కలుగుతుంది. అదే సమయంలో అదే ఆసుపత్రిలో సులోచన అనే ఒక నర్తకి కూడా మరో ఆడపిల్లను కంటుంది. ప్రసవ సమయానికి శివానందం ఊరిలో ఉండడు. అతని స్నేహితుడు రామస్వామి ఆ సమయంలో సహాయంగా ఉంటాడు. ఆ పసికందులకు నీళ్ళు పోయడానికి తీసుకుపోయిన నర్సులు ఎలెక్ట్రిక్ షాకుతో మరణిస్తారు. భర్త చేత వంచించ బడిన సులోచన ఆసుపత్రి నుండి వెళ్లిపోతుంది. ఆ ఇద్దరు శిశువులు ఎవరి పిల్లలో గుర్తు పట్టడానికి వీలు లేకుండా పోతుంది. డాక్టరు ఆ ఇద్దరు శిశువులను జమీందారు భార్య లక్ష్మికి చూపిస్తుంది. ఆమె కూడా తన బిడ్డ ఎవరో గుర్తించలేకపోతుంది. సరిగ్గా ఆ సమయానికి శివానందం వచ్చి ఆ శిశువులను చూసి తన భార్యకు పుట్టిన కవలలు అనుకుంటాడు. అసలు విషయాన్ని డాక్టర్, లక్ష్మి, రామస్వామి జమీందారుకు చెప్పలేకపోతారు. ఆ పిల్లలు చంద్ర, కాంత పేర్లతో పెద్దవుతారు. రామస్వామి ధనికుడిగా ఉన్నప్పుడు అతని కొడుకుకు పిల్లనిస్తానంటూ చేసిన వాగ్దానాన్ని ఆ తర్వాత నిరాకరించగా రామస్వామి కవలపిల్లల రహస్యాన్ని చాటింపు వేస్తాడు. దానితో కోటీశ్వరుని సంబంధం తప్పిపోతుంది. చివరకు శివానందం ఆ ఇద్దరినీ తన కవలపిల్లలుగానే స్వీకరిస్తాడు.[1]
పాటలు
[మార్చు]- ఆమె బలియై పోగానే నన్నే మరచిపోగానే - పి.బి. శ్రీనివాస్, జేసుదాస్
- నా జనకుని మనోవీధి ప్రశాంతి యేది నేనిపుడు - పి.సుశీల
- నే కోరు పాటలనే ఏనాడు పాడి నాతోడు నీడగనే - ఘంటసాల
- బిడియమాయెనే సఖి చూడ - శూలమంగళం రాజ్యలక్ష్మి, పి.లీల
- మధురా నగరాన వసంతం అది మంగళ గీతి - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల
- మా మనసే యమ్మా మా మనసే యమ్మా ఆరని చితిగా - జేసుదాస్
మూలాలు
[మార్చు]- ↑ సంపాదకుడు (6 December 1964). "చిత్రసమీక్ష - కవల పిల్లలు". ఆంధ్రప్రభ దినపత్రిక. Archived from the original on 24 జూలై 2020. Retrieved 24 July 2020.