Jump to content

కాట్రగడ్డ ప్రసూన

వికీపీడియా నుండి
కాట్రగడ్డ ప్రసూన
కాట్రగడ్డ ప్రసూన

పదవీ కాలం
1983 – 1985
ముందు రామ్ దాస్
తరువాత శ్రీపతి రాజేశ్వర్ రావు
నియోజకవర్గం సనత్‌నగర్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ[1]
నివాసం సనత్ నగర్

కాట్రగడ్డ ప్రసూన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1983లో సనత్‌నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది. కాట్రగడ్డ ప్రసూన తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సెటిలర్లు ఫోరమ్ స్థాపించి కన్వినర్‌గా ఉంటూ తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపింది.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

కాట్రగడ్డ ప్రసూన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.రాందాస్ పై 13168 ఓట్ల మెజారిథితో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. కాట్రగడ్డ ప్రసూన తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో పని చేసింది. తెలంగాణ ఉద్యమాల ప్రత్యేక రాష్ట్ర డేటాను కు మద్దతు తెలుపుతూ ఆమె తెలంగాణ సెటిలర్లు ఫోరమ్ స్థాపించింది.[4] ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేసి, 2014లో భారతీయ జనతా పార్టీలో చేరింది.[1] ప్రసన్న 2018లో తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పని చేస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 The Hans India (21 August 2018). "Andhra BJP Leader Quits, To Join TDP" (in ఇంగ్లీష్). Archived from the original on 20 March 2022. Retrieved 20 March 2022.
  2. The New Indian Express (7 December 2009). "Settlers Forum backs T". Archived from the original on 20 March 2022. Retrieved 20 March 2022.
  3. Eenadu (16 November 2023). "7 దశాబ్దాలు 10 మందే వనితలు". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.
  4. Sakshi (25 June 2015). "మమ్మల్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొడుతున్నారు". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.