కాట్రావులపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాట్రావులపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
కాట్రావులపల్లి is located in Andhra Pradesh
కాట్రావులపల్లి
కాట్రావులపల్లి
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 17°11′00″N 82°03′00″E / 17.1833°N 82.0500°E / 17.1833; 82.0500
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం జగ్గంపేట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 11,530
 - పురుషుల సంఖ్య 5,785
 - స్త్రీల సంఖ్య 5,745
 - గృహాల సంఖ్య 3,258
పిన్ కోడ్ 533437

కాట్రావులపల్లి , తూర్పు గోదావరి జిల్లా, జగ్గంపేట మండలానికి చెందిన గ్రామం.[1].

చరిత్రలో కాట్రావుల పల్లి[మార్చు]

ఆంధ్ర రచయిత అయిన అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి గారు 1831 - 1892 కాట్రావులపల్లి నూతులపై నొక పద్యము చెప్పెను.

దేవాసురు లబ్ధిదరువ
నావిర్భూతమయి హాలహల మపుడు మహా
దేవునకున్ భీతిలి కా
ట్రావులపలి నూతులందు డాగెంజుండీ.[2]

*కోర్టులకు కోట్లు కుట్టిన కాట్రావులపల్లి - జవ్వాది భాస్కరరావు*

జగ్గంపేట ప్రతిభ ఎక్కడున్నా వెలుగుతుంది.. పది మందినీ ఆకర్షిస్తుంది.. ఔరా అనిపిస్తోంది.. జగ్గంపేట మండలం కాట్రావులపల్లికి చెందిన జవ్వాది భాస్కరరావే ఇందుకు నిదర్శనం.

సూటు, కోటు కుట్టాలంటే ఆయనే కుట్టాలి. పట్టణం నుంచి మహానగరం వరకు ఆయన కుట్టే కోటుకు ఎందరో అభిమానులు. అందుకే మారుమూలనున్న ఈ పల్లెకు రెక్కలు కట్టుకు వాలిపోతుంటారు.

జవ్వాది నైపుణ్యం పుణ్యమాని  కాట్రావులపల్లికి గుర్తింపు లభిస్తోంది. పెళ్ళికి చేసుకునే సూటు నుంచి జడ్జీలు, న్యాయవాదులు, కార్పొరేటు సారధులు, రాజకీయ నాయకులు వేసుకొనే కోటు వరకు... ఎవరికి నచ్చినట్టు... మెచ్చినట్లు కుట్టివ్వడం జవ్వాది ప్రత్యేకత.

దర్జీ పనిపై మక్కువతోనే పదో ఏటే కుట్టు పనిలో శిక్షణ పొందాడు భాస్కరరావు.

జవ్వాది భాస్కరరావు సొంతూరు అనపర్తి నియోజకవర్గంలో బిక్కవోలు. 40 ఏళ్లుగా దర్జీ వృత్తిలో తన కంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. 20 ఏళ్ల వయస్సు నుంచే జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో స్థిరపడ్డారు.

దర్జీ వృత్తిలో ఫస్ట్‌క్లాస్‌ లండన్‌ డిప్లొమో చేసిన గుల్లంకి వీరభద్రరావు వద్ద శిక్షణ పొంది, కోటు, సూటు కుట్టడంలో మెలకువలు నేర్చుకున్నాడు. ప్రతిభ ఉంటే పట్టణాలకే వెళ్లాల్సిన పని లేదు... ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వస్తారని నమ్మే జవ్వాది కాట్రివులపల్లికే పరిమితమయ్యారు.

రివర్స్‌బుల్‌ కోటు (రెండు వైపులా వేసుకునే కోటు) కుట్టడంతో ఆయన పేరొందారు. జవ్వాది కోటుకు కాట్రావులపల్లి నుంచి హైదరాబాద్‌ వరకు ఎందరో అభిమానులు. ఇప్పటి వరకు 60 మంది జడ్జీలు, వందల మంది న్యాయవాదులు, ప్రముఖులకు కోట్లు కుట్టినట్లు భాస్కరరావు 'న్యూస్‌టుడే'కి తెలిపారు. హైదరాబాద్‌ లోకాయుక్త జడ్జి మొదలు... రాజమండ్రిలోని రిటైర్డు జడ్జి వరకు అంతా ఆయన వద్ద కోటు కుట్టించుకున్న వారే. జిల్లాలో పెద్దాపురం, రామచంద్రపురం, ప్రత్తిపాడు, కాకినాడ, రాజమండ్రి విశాఖపట్నం వంటి పట్టాణాల నుంచి జవ్వాది వద్ద కోటు కుట్టించుకున్న వారు అనేక మంది ఉన్నారు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 11,530 - పురుషుల సంఖ్య 5,785 - స్త్రీల సంఖ్య 5,745 - గృహాల సంఖ్య 3,258

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 10,731.[3] ఇందులో పురుషుల సంఖ్య 5,447, మహిళల సంఖ్య 5,284, గ్రామంలో నివాసగృహాలు 2,779 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-12-01. Cite web requires |website= (help)
  2. ఆంధ్ర రచయితలు (1950) రచించినవారు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి, 45
  3. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2014-07-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-12-01. Cite web requires |website= (help)