కార్గిల్ శవపేటికల కుంభకోణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కార్గిల్ శవపేటిక కుంభకోణం అనేది కార్గిల్ యుద్ధం సమయంలో మరణించిన భారతీయ సైనికుల కోసం అమెరికాలో తయారు చేసిన శవపేటికలను కొనుగోలు చేసిన కేసుకు సంబంధించినది. 2001 లో వెలువడ్డ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలో, అల్యూమినియం పేటికలు ఒక్కొక్కటి $172 కి ఇతర చోట్ల లావాదేవీలలో అందుబాటులో ఉండగా, వాటిని సుమారు $2,000 కి కొనేందుకు ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు అనే ప్రశ్నను లేవనెత్తారు.[1]

కార్గిల్ యుద్ధ సమయంలో శవపేటికల కోసం ప్రభుత్వం అధికంగా చెల్లించిందని ఆ నివేదికలో చెప్పడమే కాకుండా, యుద్ధంలో అవసరమైన సుమారు రూ. 1,762 కోట్ల విలువైన సామాగ్రిని కొనగా, దాని సరఫరా మాత్రం యుద్ధం ముగిసిన ఆరు నెలల తర్వాత జరిగిందని కూడా వెల్లడించింది.

నేపథ్యం

[మార్చు]

1999లో భారత, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం తర్వాత, అప్పటి భారత ప్రభుత్వం శవపేటికల కొనుగోలులో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మొత్తం లావాదేవీలో ప్రభుత్వం $187,000 ల భారీ నష్టాన్ని చవిచూసింది. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదికలో శవపేటికల లావాదేవీలో అనేక మోసాలను గుర్తించారు.

అమెరికా సరఫరాదారు

[మార్చు]

అంత్యక్రియల సేవలను అందించే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని బ్యూట్రాన్ అండ్ బైజా అనే సంస్థ నుండి పేటికలను కొనుగోలు చేశారు. అప్పటి పాలక ప్రభుత్వం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఒక్కొక్కటి $2500 తో 500 పేటికలను కొనుగోలు చేసింది [2] ఇది అసలు రేటు కంటే పదమూడు రెట్లు ఉంటుందని భావించారు.

రాయబారి స్థానం

[మార్చు]

అయితే, భారతదేశం, అమెరికా దేశాల రాయబారులు, ఆ పేటికల విలువ ఒక్కొక్కటి $2,768 అని లిఖితపూర్వకంగా ప్రకటించారు.[3]

టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాస్తూ చిదానంద్ రాజ్‌ఘట్ట, "ఆ శవపేటికలు కార్గిల్ అమరవీరులను తీసుకువెళ్లడానికి ఉద్దేశించినవి కావు" అని వాదించాడు. ఇవి "సాంప్రదాయ శవపేటికలు" కావు, అవి మళ్ళీ మళ్ళీ వాడుకోగలిగే అల్యూమినియం 'బదిలీ పేటికలు'. "సోమాలియాలో శాంతి పరిరక్షక మిషన్‌లో పనిచేసిన భారతీయ అధికారుల ప్రత్యక్ష కథనాలను చూసాక" రక్షణ మంత్రిత్వ శాఖ వాటిని కొనాలని భావించిందిఅని అతను రాసాడు.[4]

సీబీఐ ఈ కేసును విచారించి, 2009 ఆగస్టు లో ముగ్గురు భారత సైన్యపు అధికారులపై చార్జ్ షీట్ దాఖలు చేసింది. 2013 డిసెంబరులో సీబీఐ ప్రత్యేక కోర్టు, ఎలాంటి సాక్ష్యాధారాలు కనుగొనకపోవడంతో నిందితులందరినీ విడుదల చేసింది.[5][6]

సీబీఐ విచారణ

[మార్చు]

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) 2006 జూన్‌లో, 420 (మోసం), 120 B (నేరపూరిత కుట్ర), అవినీతి నిరోధక చట్టం, 1988 కింద కేసు నమోదు చేసింది. 2009 ఆగస్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.[7] మేజర్ జనరల్ అరుణ్ రాయ్, కల్నల్ SK మాలిక్, కల్నల్ FB సింగ్ అనే ముగ్గురు ఆర్మీ అధికారులు, అమెరికాలో ఉన్న ఒక కంపెనీని ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు.[8] భారత సైన్యానికి అల్యూమినియం క్యాస్కెట్, బాడీ బ్యాగ్‌లను సరఫరా చేసిన అమెరికా జాతీయుడు విక్టర్ బైజా పేరు కూడా ఛార్జ్ షీట్‌లో ఉంది.[9] అయితే, అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ పేరును నివేదికలో చేర్చలేదు. తరువాత అతనికి క్లీన్ చిట్ ఇచ్చారు.[10]

2013 డిసెంబరులో సీబీఐ ప్రత్యేక కోర్టు, ఎలాంటి సాక్ష్యాధారాలు కనబడకపోవడంతో నిందితులందరినీ విడుదల చేసింది.[5][6]

సుప్రీంకోర్టు తీర్పు

[మార్చు]

2015 అక్టోబరు 13 న, కార్గిల్ శవపేటిక కుంభకోణంలో మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిలను అత్యున్నత న్యాయస్థానం విముక్తి చేసింది.[11][12]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Special Correspondent (10 Aug 2003). "Kargil coffin scam slap on Fernandes ministry". The Telegraph. Retrieved March 30, 2024.
  2. Super Admin (2009-08-22). "Kargil Coffin Scam | CBI Chargesheet | George Fernandes | Indian Army Officers | US Company". News.oneindia.in. Archived from the original on 2011-08-17. Retrieved 2012-01-20.
  3. "Six Feet Under". www.outlookindia.com. Retrieved 2012-01-20.
  4. "Coffins were not meant to carry Kargil martyrs". The Times of India. 13 December 2001. Retrieved 2024-03-30.
  5. 5.0 5.1 "Coffin scam: Court discharges three former Army officials". The Economic Times. Retrieved 11 December 2013.
  6. 6.0 6.1 "court discharges the accused". 11 December 2013. Archived from the original on December 18, 2013. Retrieved 11 December 2013.
  7. "CBI files chargesheet in Kargil coffin scam". The Times of India. Aug 22, 2009. Archived from the original on 2012-03-01. Retrieved 2012-01-20.
  8. "Three years on, CBI files 'Coffingate' chargesheet". Indian Express. 2009-08-23. Retrieved 2012-01-20.
  9. "The Times of India on Mobile". M.timesofindia.com. 2002-01-25. Retrieved 2012-01-20.
  10. "CBI gives Fernandes clean chit in coffin scam". CNN IBN. Aug 22, 2009. Archived from the original on November 3, 2012. Retrieved 24 September 2012.
  11. "SC gives previous NDA govt a clean chit in Kargil coffin scam". Hindustan Times. 13 October 2015.
  12. "Kargil scam: Supreme Court clean chit to Vajpayee govt | the Asian Age". Archived from the original on 2015-10-20. Retrieved 2015-10-13.