Jump to content

కార్బన్ డైసల్ఫైడ్

వికీపీడియా నుండి
కార్బన్ డైసల్ఫైడ్
Carbon bisulfide
పేర్లు
IUPAC నామము
Methanedithione
ఇతర పేర్లు
Carbon bisulfide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [75-15-0]
పబ్ కెమ్ 6348
యూరోపియన్ కమిషన్ సంఖ్య 200-843-6
కెగ్ C19033
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:23012
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య FF6650000
SMILES C(=S)=S
ధర్మములు
CS2
మోలార్ ద్రవ్యరాశి 76.13 g·mol−1
స్వరూపం Colorless liquid
Impure: light-yellow
వాసన Chloroform (pure)
Foul (commercial)
సాంద్రత 1.539 g/cm3 (-186°C)
1.2927 g/cm3 (0 °C)
1.266 g/cm3 (25 °C)[1]
ద్రవీభవన స్థానం −111.61 °C (−168.90 °F; 161.54 K)
బాష్పీభవన స్థానం 46.24 °C (115.23 °F; 319.39 K)
0.258 g/100 mL (0 °C)
0.239 g/100 mL (10 °C)
0.217 g/100 mL (20 °C)[2]
0.014 g/100 mL (50 °C)[1]
ద్రావణీయత Soluble in alcohol, ether, benzene, oil, CHCl3, CCl4
ద్రావణీయత in formic acid 4.66 g/100 g[1]
ద్రావణీయత in dimethyl sulfoxide 45 g/100 g (20.3 °C)[1]
బాష్ప పీడనం 48.1 kPa (25 °C)
82.4 kPa (40 °C)[3]
వక్రీభవన గుణకం (nD) 1.627[4]
స్నిగ్ధత 0.436 cP (0 °C)
0.363 cP (20 °C)
నిర్మాణం
Linear
ద్విధృవ చలనం
0 D (20 °C)[1]
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
88.7 kJ/mol[1]
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
1687.2 kJ/mol[3]
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
151 J/mol·K[1]
విశిష్టోష్ణ సామర్థ్యం, C 75.73 J/mol·K[1]
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS02: FlammableGHS07: Exclamation markGHS08: Health hazard[4]
జి.హెచ్.ఎస్.సంకేత పదం Danger
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H225, H315, H319, H361, H372[4]
GHS precautionary statements P210, P281, P305+351+338, P314[4]
ICSC 0022
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R11, మూస:R36/38, మూస:R48/23, మూస:R62, మూస:R63
S-పదబంధాలు (S1/2), S16, S33, మూస:S36/37, S45
Inhalation hazard Irritant
Eye hazard Irritant
Skin hazard Irritant
జ్వలన స్థానం {{{value}}}
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత
102 °C (216 °F; 375 K)[1]
విస్ఫోటక పరిమితులు 1.3%-50%[5]
Lethal dose or concentration (LD, LC):
3188 mg/kg (rat, oral)
>1670 ppm (rat, 1 hr)
15500 ppm (rat, 1 hr)
3000 ppm (rat, 4 hr)
3500 ppm (rat, 4 hr)
7911 ppm (rat, 2 hr)
3165 ppm (mouse, 2 hr)[6]
4000 ppm (human, 30 min)[6]
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 20 ppm C 30 ppm 100 ppm (30-minute maximum peak)[5]
REL (Recommended)
TWA 1 ppm (3 mg/m3) ST 10 ppm (30 mg/m3) [skin][5]
IDLH (Immediate danger)
500 ppm[5]
సంబంధిత సమ్మేళనాలు
సంబంధిత సమ్మేళనాలు
Carbon dioxide
Carbonyl sulfide
Carbon diselenide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

కార్బన్ డైసల్ఫైడ్ వర్ణ రహితమైన, త్వరగా ఆవిరి అయ్యే ద్రవం.రసాయనిక ఫార్ములా CS2.పారిశ్రామిక, రసాయన పరంగా అధ్రువ (నాన్‌పోలార్) ద్రావణి.సేంద్రియ రసాయన శాస్త్రములో ఇతర పదార్థాల ఉత్పత్తిలో తనకంటూ ఒకస్థానం ఉంది. ఈ ద్రావణం ఈథర్ వంటి వాసన కలిగి ఉంది. అయితే మార్కెట్లో లభించు కార్బన్ డై సల్ఫైడ్లో కార్బోనైల్ సల్ఫైడ్ వంటి పదార్థాల కల్తివలన చెడు వాసన కలిగిఉండును.

భౌతిక లక్షణాలు

[మార్చు]

కార్బన్ డైసల్ఫైడ్ వర్ణ రహితమైన, త్వరగా ఆవిరి అయ్యే ద్రవం.కార్బన్ డైసల్ఫైడ్ యొక్క అణుభారం 76.13 గ్రాములు/మోల్.కార్బన్ డైసల్ఫైడ్ యొక్కసాంద్రత 1.539 గ్రాములు/సెం.మీ3 (-186°Cవద్ద),1.2927 గ్రాములు/సెం.మీ3 (0°Cవద్ద,,1.266 గ్రాములు/సెం.మీ3 (25 °Cవద్ద). కార్బన్ డైసల్ఫైడ్ ద్రవీభవన స్థానం −111.61 °C (−168.90 °F; 161.54 K).కార్బన్ డైసల్ఫైడ్ యొక్కబాష్పీభవన స్థానం 46.24 °C (115.23 °F; 319.39 K).నీటిలో కరుగదు.కార్బన్ డైసల్ఫైడ్ యొక్క వక్రీభవన సూచిక1.627

ఉనికి-ఉత్పత్తి

[మార్చు]

తక్కువ ప్రమాణంలో కార్బన్ డైసల్ఫైడ్ సమ్మేళన పదార్థం అగ్ని పర్వతాలు విస్పొటన చెందిన చోటులలో, చిత్తడి నేలల వద్ద లభించును. గతంలో కార్బన్ అధిక మొత్తంలో కలిగినకోక్ (coke) ను, సల్ఫర్తో కలిపి అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి చర్య జరపడం ద్వారా ఉత్పత్తి చేసే వారు. ప్రస్తుతం కార్బన్ వనరుగా కోక్ కు బదులుగా సహజ వాయువును ఉపయోగించి తక్కువ ఉష్ణోగ్రత (600 °C) వద్ద సిలికాజెల్ లేదా అల్యుమినాను ఉత్పేరకంగా, సల్ఫర్ చర్య జరిపి కార్బన్ డైసల్ఫైడ్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.

2 CH4 + S8 → 2 CS2 + 4 H2S

ఈ రసాయన చర్య మిథేన్ దహన చర్యకు సమాంతర మైన చర్య.కార్బన్ డైఆక్సైడ్ తో కార్బన్ డైసల్ఫైడ్ ఐసోఎలెక్ట్రానిక్.కార్బన్ డై సల్ఫైడ్ త్వరగా మందు స్వభావం ఉన్న ద్రవం.

CS2 + 3 O2 → CO2 + 2 SO2

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చెయ్యబడుచున్న, వాడబడుచున్న కార్బన్ డైసల్ఫైడ్ పరిమాణం సుమారుగా ఒక మిలియను టన్నులు. ఇందులో 49 % చైనాదేశం,19%భారతదేశం ఉపయోగించుచున్నవి. ఎక్కువగా కార్బన్ డైసల్ఫైడ్ రేయాన్ ఉత్పత్తి కై ఉపయోగిస్తున్నారు. 2007 లో USA లో కార్బన్ డైసల్ఫైడ్ ఉత్పత్తి 56 వేల మిలియను టన్నులు .

రసాయన చర్యలు

[మార్చు]

కార్బన్ డై ఆక్సైడుతో పోల్సిన చో న్యూక్లియోపిలేస్ (nucleophile) తో ఎక్కువ చర్యాశీలంగా ప్రవర్తించును, క్షయికరించును.కార్బన్ డై సల్ఫైడ్ అణువులోని సల్ఫైడో కేంద్రకాల బలహీనమైన π దాతృత్వ (π donor-ability) గుణం ఈ వ్యత్యాసానికి కారణం. ఈ బలహీన π దాతృత్వగుణం, కార్బను పరమాణువులను మరింత ఎలాక్ట్రోఫిలిక్ (electropholic) చెయ్యును.కార్బన్ డైసల్ఫైడ్‌ను మెటం సోడియం వంటి ఆర్గానో సల్ఫరు లను సంశ్లేషణ (synthesis) చెయ్యుటకు ఉపయోగిస్తారు.మెటం సోడియం ఒక నేల ధూమకారి,, విస్కోస్ అను మెత్తని బట్టను తయారు చెయ్యుటలో ఉపయోగిస్తారు.

న్యుక్లియోఫిలెస్ సంకలనము

[మార్చు]

న్యుక్లియోఫిలే (nucleophile ) : ఒక ప్రత్యేకమైన రసాయన వర్గం, రసాయన బంధం ఏర్పడుటకై ఎలక్ట్రోఫిలేకు ఎలక్ట్రాను జంటను దానం చెయ్యును.ఆమిన్‌తో న్యుక్లియోఫిలే వలన డై థైకార్బ్అమెట్స్ (dithiocarbamates) ఏర్పడును.

2 R2NH + CS2 → [R2NH2+][R2NCS2]

alkoxides నుండి Xanthates ఏర్పడును.

RONa + CS2 → [Na+][ROCS2]

ఈ రకమైన రసాయన చర్యవలననే రిజేనరేటేడ్ సెల్యులోజ్ ఏర్పడుతుంది. రిజేనరేటేడ్ సెల్యులోజ్‌నే విస్కోస్, యాన్,, సేల్లోఫెన్ లను ఉత్పత్తి చేయ్యుటలో ఉపయోగిస్తారు .క్సాంతేటుస్ (xanthates), సంబంధిత థయో క్సాంతేటుస్ (థయోలేట్స్ ను కార్బన్ డైసల్ఫైడ్‌తో చర్య వలన ఏర్పడును) ఖనిజ ఉత్పత్తి ప్రక్రియలో ప్లవన కారకంగా ఉపయోగిస్తారు.

కార్బన్ డైసల్ఫైడ్ తో సోడియం చర్య వలన ట్రైథయోకార్బోనేట్ ఏర్పడును.

Na2S + CS2 → [Na+]2[CS32]

హరినీకరణం/క్లోరినీకరణం(Chlorination)

[మార్చు]

కార్బన్ డైసల్ఫైడ్ ను హరినీకరణం/ క్లోరినీకరణం వలన కార్బన్ టెట్రాక్లోరైడ్ ఉత్పనమగును.

CS2 + 3 Cl2 → CCl4 + S2Cl2

పై రసాయన చర్య మధ్యంతర సమయంలో thiophosgene ( CSCl2) ఏర్పడును.

పాలిమేరిజైసన్

[మార్చు]

కార్బన్ డైసల్ఫైడ్ పాలిమేరిజైసన్ చెందును.పైటోలోసిస్ లేదా అధిక వత్తిడి వలన ద్రావణియత లేని బ్రిడ్జిమాన్‌ బ్లాక్ అను పదార్థం ఏర్పడును. పాలిమర్ ను మొదటగా కనుగొన్న శాస్త్రవేత్త పి.డబ్లూ. బ్రిడ్జిమాన్ పేరు ఈ పాలిమరు పదార్థానికి పెట్టారు.

ధూపనము(Fumigation)

[మార్చు]

కార్బన్ డై సల్ఫైడ్ ను ధూమకారిగా గాలి చొరబడని సరుకులు పెట్టే గిడ్డంగి. తొట్టి, గాదెలు, ధాన్యఉద్ధారణములు, సరుకులు తీసుకెళ్ళు పద్దపడవ లు, సరుకు రవాణా ఓడలలోని సరుకులను, ధాన్యాన్ని ఫుమిగేసను (Fumigation) చెయ్యడం వలన క్రిమికిటకాలనుండిరక్షిపబడటంవలన, సరుకులు దీర్ఘ కాలం మన్నికగా ఉండును

క్రిమి సంహారి

[మార్చు]

కార్బన్ డైసల్ఫైడ్‌ను ధాన్యాన్ని, నర్సరీస్టాక్ ను,, తాజా పళ్ళను, నెలలోని పురుగులను తొలగించుటకు క్రిమి సంహారి/సంహారకంగా ఉపయోగిస్తారు.

ద్రావణి

[మార్చు]

కార్బన్ డైసల్ఫైడ్ భాస్వరం, సల్ఫర్, బ్రోమిన్, అయోడిన్, కొవ్వులు, రేసిన్స్,, అస్ఫాల్ట్ లకు ద్రావణి (సాల్వెంట్) గా పనిచేయును.పైన పేర్కొన్నవి అన్ని కార్బన్ డై సల్ఫైడ్ లోకరుగును.

ఉత్పత్తి రంగంలో వినియోగం

[మార్చు]

కార్బన్ డై సల్ఫైడ్ ను విస్కోస్, రేయాన్, సేల్లోపెన్ ఫిల్మ్, కార్బన్క్లోటెట్రాక్లోరైడ్, క్సాంతోజేనేట్స్,, ఎలాక్ట్రాన్ వాక్యుం ట్యూబుల తయారి పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

వర్ణపట దర్శిని పట్టకాలు(Spectroscope prisms)

[మార్చు]

కార్బన్ డైసల్ఫైడ్ అధిక ధ్రువణ విక్షేపణం కలిగి ఉన్నందున, దీనిని వర్ణపట దర్శిని (Spectroscope) లలో ఉపయోగిస్తారు.

ఆరోగ్యం-ప్రభావం

[మార్చు]

అధిక మోతాదులో దీఇ ప్రభావానికిగురైన నాడీ వ్యవస్థ పై దుష్ఫలితాలు కలిగించును.

ఇవికూడా చూదండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 http://chemister.ru/Database/properties-en.php?dbid=1&id=1955
  2. Seidell, Atherton; Linke, William F. (1952). Solubilities of Inorganic and Organic Compounds. Van Nostrand.
  3. 3.0 3.1 మూస:Nist
  4. 4.0 4.1 4.2 4.3 Sigma-Aldrich Co., Carbon disulfide. Retrieved on 2022-03-30.
  5. 5.0 5.1 5.2 5.3 NIOSH Pocket Guide to Chemical Hazards. "#0104". National Institute for Occupational Safety and Health (NIOSH).
  6. 6.0 6.1 "Carbon disulfide". Immediately Dangerous to Life and Health Concentrations (IDLH). National Institute for Occupational Safety and Health (NIOSH).