కాలేరు వెంకటేశ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాలేరు వెంకటేశ్‌
కాలేరు వెంకటేశ్

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా 2022, సెప్టెంబరు 17న జరిగిన కళాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్


పదవీ కాలం
2018 - ప్రస్తుతం
తరువాత జి. కిషన్ రెడ్డి
నియోజకవర్గం అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960 డిసెంబరు 10
గోల్నాక, హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు ఆంజనేయులు, జయమ్మ
జీవిత భాగస్వామి పద్మ
సంతానం కాలేరు మణికాంత్, దీప్తి పటేల్
నివాసం హైదరాబాదు

కాలేరు వెంకటేశ్‌, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

వెంకటేశ్ 1960, డిసెంబరు 10న ఆంజనేయులు, జయమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులోని గోల్నాకలో జన్మించాడు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బియస్సీ, ఎల్.ఎల్.బి డిగ్రీలను పూర్తిచేసాడు.[2] న్యాయవాద వృత్తిని చేపట్టాడు. 2005లో హైదరాబాదులోని క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ కు అధ్యక్షునిగా ఉన్నాడు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

వెంకటేశ్ కు పద్మతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కాలేరు మణికాంత్, దీప్తి పటేల్ ఉన్నారు.[4]

రాజకీయ విశేషాలు

[మార్చు]

అతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 2005 నుండి 2012 వరకు క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, 2009 నుండి 2012 వరకు గ్రేటర్ హైదరాబాదు మ్యునిసిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడరుగా, 2009 నుండి 2014 వరకు గోల్నాకలో గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్కు కార్పొరేటర్ గా పనిచేసాడు. తరువాత అతను తెలంగాణ రాష్ట్రసమితి పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జి. కిషన్ రెడ్డి పై 1016 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  2. admin (2019-01-07). "Amberpet MLA Kaleru Venkatesh". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-16.
  3. "Kaleru Venkatesh | MLA | TRS | Amberpet | Hyderabad | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-24. Retrieved 2020-07-16.
  4. "Kaleru Venkatesh | MLA | TRS | Amberpet | Hyderabad | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-24. Retrieved 2021-09-30.
  5. https://www.thehansindia.com/photo-gallery/trs-amberpet-candidate-kaleru-venkatesh-celebrating-his-victory-20178
  6. Namasthe Telangana (29 May 2021). "అంబర్‌పేట అభివృద్ధికి రూ.132 కోట్లు". Archived from the original on 14 జూలై 2021. Retrieved 14 July 2021.

ఇతర లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.