Jump to content

కాశీనాథరావు వైద్యా

వికీపీడియా నుండి
కాశీనాథరావు వైద్యా
హైదరాబాదు రాష్ట్ర శాసనసభాపతి
In office
1952–1956
నియోజకవర్గంబేగం బజార్
హైదరాబాదు రాష్ట్ర శాసనసభ్యుడు
In office
1952–1959
అంతకు ముందు వారుఆరంభం
తరువాత వారుజె.వి.నరసింగరావు
నియోజకవర్గంబేగం బజార్
వ్యక్తిగత వివరాలు
మరణంహైదరాబాదు, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రేసు
నైపుణ్యంన్యాయవాది

కాశీనాథరావు వైద్యా, హైదరాబాదు రాష్ట్ర శాసనసభ స్పీకరు. వృత్తిరీత్యా న్యాయవాది, రాజకీయనాయకుడు.[1] వైద్యా 1952లో జరిగిన హైదరాబాదు రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రేసు అభ్యర్థిగా బేగంబజారు నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచాడు.[2] వైద్యాకు ఆ ఎన్నికలలో 15,794 ఓట్లు (72.48% శాతం ఓట్లు) వచ్చాయి.[3] హైదరాబాదు శాసనసభలో స్పీకరుగా ఎన్నికయ్యాడు.[1]

కాశీనాథరావు వైద్య 1932లో రెసిడెన్సీ బజార్​లో హిందూ స్థాయీ సంఘాన్ని స్థాపించాడు. ఈ సంస్థ స్వదేశీ వస్తు విక్రయం తదితర కార్యక్రమాలను నిర్వహించింది.[4] హైదరాబాదు రాజ్యంలో కాంగ్రేసు మతసంస్థ అని నిజాం నిషేధించినప్పుడు, ఇతర కాంగ్రేసు నాయకులతో పాటు మహాత్మాగాంధీ అనుమతితో కాశీనాథరావు సత్యాగ్రహాన్ని చేపట్టాడు. రాష్ట్ర కాంగ్రేస్ కు 17వ స‌ర్వాధికారిగా ఉన్న కాశీనాథ‌రావు వైద్య‌ను నిజాంకు వ్య‌తిరేకంగా స‌త్యాగ్ర‌హం చేసిన కార‌ణంగా 1938 డిసెంబ‌ర్ 23న బంధించారు.[5] 1939-40లో రాష్ట్ర కాంగ్రేసు ప్రతినిధిగా కాశీనాథరావు రాష్ట్ర కాంగ్రేసుపై నిషేధం ఎత్తివేసే విషయమై నిజాం ప్రభుత్వం చర్చలు జరిపాడు.[6]

కాశీనాథరావు 1959 మార్చి 13న హైదరాబాదులో మరణించాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Abbasayulu, Y. B. Scheduled Caste Elite: A Study of Scheduled Caste Elite in Andhra Pradesh. Hyderabad: Dept. of Sociology, Osmania University, 1978. p. 43
  2. AP Legislature. HYDERABAD LEGISLATIVE ASSEMBLY (CONSTITUTED ON 1952) Archived 2013-08-04 at the Wayback Machine
  3. Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1951 TO THE LEGISLATIVE ASSEMBLY OF HYDERABAD Archived 2013-01-27 at the Wayback Machine
  4. "వెలుగు సక్సెస్: నిజాం రాజ్యంలో సంస్థలు". V6 ప్రభాత వెలుగు. Retrieved 20 September 2024.
  5. "హైద‌రాబాద్ (భాగ్య‌న‌గ‌ర్‌) నిరాయుధ ప్ర‌తిఘ‌ట‌న‌ – మూడ‌వ‌ భాగం". vsktelangana.org. Retrieved 20 September 2024.
  6. ఎం, జితేందర్ రెడ్డి (07 May 2023). "హైదరాబాదు రాష్ట్రంలో స్వాతంత్ర పోరాటం - గాంధీ పర్యటనలు". ఈనాడు ప్రతిభ. Retrieved 20 September 2024. {{cite news}}: Check date values in: |date= (help)
  7. Bhargava, Gopal K., and S. C. Bhatt. Andhra Pradesh. Delhi: Kalpaz publ, 2006. p. 643