Jump to content

కిరణ్ నవ్‌గిరే

వికీపీడియా నుండి
కిరణ్ నవ్‌గిరే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కిరణ్ ప్రభు నవ్‌గిరే
పుట్టిన తేదీ (1994-09-18) 1994 సెప్టెంబరు 18 (వయసు 30)
షోలాపూర్, మహారాష్ట్ర, భారతదేశం
బ్యాటింగుకుడి చేతి
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి T20I (క్యాప్ 71)2022 సెప్టెంబరు 10 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2022 అక్టోబరు 10 - Thailand తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2018/19–2019/20మహారాష్ట్ర
2021/22–presentనాగాలాండ్
2022–2023Velocity
2023–presentUP Warriorz
కెరీర్ గణాంకాలు
పోటీ WT20I
మ్యాచ్‌లు 6
చేసిన పరుగులు 17
బ్యాటింగు సగటు 5.66
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 10*
క్యాచ్‌లు/స్టంపింగులు 0/–
మూలం: Cricinfo, 10 October 2022

కిరణ్ ప్రభు నవ్‌గిరే (జననం 1994 సెప్టెంబరు 18 [1][2] షోలాపూర్, మహారాష్ట్ర ) భారతీయ క్రికెట్ క్రీడారిణి.[3] ఆమె ప్రస్తుతం భారత మహిళలు, నాగాలాండ్ మహిళల తరపున ఆడుతుంది.[4] ఆమె 2022లో అరుణాచల్ ప్రదేశ్‌పై నాగాలాండ్ తరపున అజేయంగా 162 [5] చేసి, మహిళల సీనియర్ T20 ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా రికార్డు సృష్టించింది. T20 మ్యాచ్‌లో 150కి పైగా స్కోర్ చేసిన ఏకైక భారతీయురాలు (పురుష లేదా స్త్రీ) ఆమె.[4]

కిరణ్ నవ్‌గిరే తండ్రి రైతు కాగా, ఆమె తల్లి గృహిణి. ఆమెకు ఇద్దరు సోదరులు ఉన్నారు.[6] ఆమె మొదట్లో అథ్లెటిక్స్‌లో ఉంది. క్రికెటర్‌గా కెరీర్‌ని కొనసాగించే ముందు సావిత్రీబాయి ఫూలే పూణే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న రోజుల్లో ఆమె తొలిసారి క్రికెట్ ఆడింది. ఆమె 2013–14 నుండి 2015–16 సీజన్లలో ఎటువంటి అధికారిక శిక్షణ లేకుండానే యూనివర్సిటీ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.[7] ఆమె జావెలిన్ త్రో, షాట్ పుట్, 100 మీటర్ల అథ్లెటిక్ ఈవెంట్లలో పూణే విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించింది .[6] ఆమె పూణేలోని అజం క్యాంపస్‌లో తన మొదటి అధికారిక శిక్షణను పొందింది, అక్కడ ఆమె ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల కోర్సును అభ్యసించింది.

ఆమె 2018–19 సీనియర్ మహిళల వన్డే లీగ్‌లో మహారాష్ట్రతో తన దేశీయ వృత్తిని ప్రారంభించింది.[8] మహారాష్ట్ర జట్టులో ఆమెకు తగినన్ని అవకాశాలు లభించకపోవడంతో 2021-22 మహిళల సీనియర్ T20 ట్రోఫీలో అతిథి క్రీడాకారిణిగా నాగాలాండ్ తరపున ఆడాలని నిర్ణయించుకుంది.[9] నాగాలాండ్ తరపున ఆడుతున్నప్పుడు, ఆమె 2022 ఏప్రిల్ 15 న గౌహతిలోని బర్సపరా స్టేడియంలో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 76 బంతుల్లో 162 పరుగులు చేసి ట్వంటీ 20 ఇన్నింగ్స్‌లో 150+ పరుగులు చేసిన మొదటి భారతీయ పురుషుడు లేదా మహిళగా నిలిచింది.[10][11]

2022 మహిళల T20 ఛాలెంజ్‌కు ముందు ఆమె వెలాసిటీ స్క్వాడ్‌లో ఎంపికైంది.[12] 2022 మే 26న ట్రైల్‌బ్లేజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె 24 బంతుల్లో అర్థ శతకం సాధించింది, ఇది మహిళల T20 ఛాలెంజ్‌లో అత్యంత వేగవంతమైన అర్థ శతకం.[13] రెండు రోజుల తర్వాత, ఆమె ఫైనల్‌లో 13 బంతుల్లో డకౌట్ అయింది.[14] తరువాత, ఆమె 2022 సెప్టెంబరులో ఇంగ్లాండ్‌తో జరిగే T20 అంతర్జాతీయ సిరీస్‌కు భారత మహిళల జట్టుకు కూడా ఎంపికైంది.[4] ఆమె బారామతి శారదా విద్యాలయంలో తన విద్యను పూర్తి చేసింది. ఆమె భాగ్ మిల్కా భాగ్ సినిమా నుండి ప్రేరణ పొందింది. కళాశాల చుట్టూ 40 రౌండ్లు పరిగెత్తింది.

మూలాలు

[మార్చు]
  1. "Kiran Navgire Profile". espncricinfo.com. Retrieved 2023-03-05.
  2. "Six players to watch out for". ESPN (in ఇంగ్లీష్). 2022-05-22. Retrieved 2022-05-23.
  3. "Kiran Prabhu Navgire profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo. Retrieved 2022-05-23.
  4. 4.0 4.1 4.2 Raj, Pratyush (2022-08-21). "Kiran, once a javelin gold medalist, picked for India women's tour of England". The Indian Express. Retrieved 2022-09-14.Raj, Pratyush (21 August 2022). "Kiran, once a javelin gold medalist, picked for India women's tour of England". The Indian Express. Retrieved 14 September 2022.
  5. Penbugs (2022-04-15). "Kiran Navgire smashed unbeaten 162 in Senior T20 Trophy". Penbugs (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-05-23.[permanent dead link]
  6. 6.0 6.1 "From Winning Medals in Athletics to Winning Hearts in Cricket - Story of Kiran Navgire". Female Cricket (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-04-21. Retrieved 2022-05-23.
  7. "Dhoni fan Kiran Navgire hopes to be a big hit in the Women's T20 Challenge". ESPN (in ఇంగ్లీష్). 2022-05-23. Retrieved 2022-05-23.
  8. "The Home of CricketArchive". www.cricketarchive.com. Retrieved 2022-05-23.
  9. Penbugs (2022-04-25). "I want to lift the World Cup for the country: Kiran Navgire". Penbugs (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-05-17. Retrieved 2022-05-23.
  10. "THE BOARD OF CONTROL FOR CRICKET IN INDIA". www.bcci.tv (in ఇంగ్లీష్). Retrieved 2022-05-23.
  11. Sohinee (2022-04-15). "Nagaland's Kiran Prabhu becomes first Indian to cross 150 runs in a T20 match". thebridge.in (in ఇంగ్లీష్). Retrieved 2022-05-23.
  12. "Women's T20 Challenge 2022: Fixtures, squads, venues, all you need to know - Firstcricket News, Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 2022-05-22. Retrieved 2022-05-23.
  13. Desk, The Bridge (2022-05-26). "Women's T20 Challenge: Kiran Navgire registers the fastest 50 in tournament's history". thebridge.in (in ఇంగ్లీష్). Retrieved 2022-11-01.
  14. Sportstar, Team (2022-05-28). "Navgire falls for 13-ball duck two days after fastest fifty in Women's T20 Challenge". sportstar.thehindu.com (in ఇంగ్లీష్). Retrieved 2022-11-01.

బాహ్య లంకెలు

[మార్చు]