Jump to content

కిషన్‌భాయ్ వేస్తాభాయ్ పటేల్

వికీపీడియా నుండి
కిషన్‌భాయ్ వేస్తాభాయ్ పటేల్

పదవీ కాలం
2004 - 2014
ముందు మణిభాయ్ చౌదరి
తరువాత కే.సీ. పటేల్
నియోజకవర్గం వల్సాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-06-02) 1964 జూన్ 2 (వయసు 60)
బుల్సర్, గుజరాత్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి గీతాబెన్ కిషన్‌భాయ్
సంతానం 1 కుమారుడు, 2 కుమార్తెలు
నివాసం వల్సాద్
మూలం [1]

కిషన్‌భాయ్ వేస్తాభాయ్ పటేల్ (జననం 2 జూన్ 1964) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వల్సాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

కిషన్‌భాయ్ వేస్తాభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2002 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో ధరంపూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వల్సాద్ నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఆ తరువాత 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

కిషన్‌భాయ్ వేస్తాభాయ్ పటేల్ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కే.సీ. పటేల్ పై 3,53,797 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో ధరంపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Financialexpress (28 November 2022). "Gujarat Elections 2022: Full list of Congress candidates and their constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
  2. Election Commision of India (2022). "2022 Gujarat Legislative Assembly election Results". Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.