అక్షాంశ రేఖాంశాలు: 16°07′07″N 80°50′00″E / 16.118564°N 80.833433°E / 16.118564; 80.833433

కిష్కిందపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిష్కిందపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
కిష్కిందపాలెం is located in Andhra Pradesh
కిష్కిందపాలెం
కిష్కిందపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°07′07″N 80°50′00″E / 16.118564°N 80.833433°E / 16.118564; 80.833433
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా బాపట్ల జిల్లా
మండలం కొల్లూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ రావుల రమేశ్,
పిన్ కోడ్ 522257
ఎస్.టి.డి కోడ్ 08648

కిష్కిందపాలెం, బాపట్ల జిల్లా, కొల్లూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది ఉంది. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో రావుల రమేశ్ ఎం.బి.ఎ., 18 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  • ఈ గ్రామంలో రెండు రామాలయాలు ఉన్నాయి.
  • శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014, సెప్టెంబరు-20వ తేదీ శనివారం నాడు, శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్పస్వామివారి కళ్యాణోత్సవాన్ని వేద మంత్రోచ్ఛారణల మధ్య, కన్నులపండువగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వెంకటేశ్వరస్వామి, లక్ష్మీదేవి, పద్మావతీ అమ్మవారి కళ్యాణ ఉత్సవ విగ్రహాలను తీసికొనివచ్చి, గ్రామంలో ఊరేగించారు. గ్రామ సమీప ప్రాంతాలలోని భక్తులు వేలాదిగా తరలివచ్చి, స్వామివారి కళ్యాణం తిలకించి, హారతి స్వీకరించి పరవశులైనారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందించిన స్వామివారి తీర్ధప్రసాదాలు, కంకణాలు, గోవిందనామాలు భక్తులు స్వీకరించారు. అనంతరం వేలాదిమంది భక్తులకు అన్నదానం నిర్వహించారు.
  • ఈ గ్రామంలో 2014, సెప్టెంబరు-21 వతేదీ ఆదివారం నాడు, పోతురాజు సంబరాలు నిర్వహించెదరు.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

[మార్చు]