కీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎన్ టీ టీ డాటా భవనము

కీన్ ఇంక్ ఎన్ టీ టీ డాటా కార్పొరేషన్ కి చెందిన ఒక భాగము. ఇది అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఇంఫర్మేషన్ టెక్నాలజీ సేవలని అందించే ఒక సంస్థ. అప్లికేషన్ సేవలు, ఇంఫ్రా స్ట్రక్చర్, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ లని ఆన్ సైట్, నియర్ షోర్, ఆఫ్ షోర్ పద్ధతుల ద్వారా అందిస్తున్నది.

అమెరికా లోని టెక్నాలజీ ఇన్నొవేటర్ ల జాబితా ప్రచురించిన ఇంఫర్మేషన్ వీక్ 2010 లో కీన్ 70వ స్థానాన్ని పొందినది. కంసల్టింగ్, బిజినెస్ సేవల వర్గంలో కీన్ పేరెన్నిక గన్నది

సంస్థ గురించి[మార్చు]

1965 నుండి ఉన్న కీన్ లో 12,500 మంది ఉద్యోగులు ఉన్నారు.

2011 లో కీన్ ని ఎన్ టీ టీ డాటా సొంతం చేసుకొన్నది.

చరిత్ర[మార్చు]

1965 లో బోస్టన్ లోని మాసాచ్యుజెట్స్ లో జాన్.ఎఫ్.కీన్ చే స్థాపింపబడింది. ఆరోగ్య సంరక్షణ పై దృష్టి కేంద్రీకరించిన ఈ సంస్థ పదేళ్ళలోనే వంద ఉద్యోగుల వరకు వృద్ధి చెందినది. 1990 నాటికి కీన్ పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా అవతరించి సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్, అప్లికేషన్ మెయింటెనెంస్, ప్రోగ్రాం మేనేజ్ మెంట్, కంసల్టింగ్ సేవలలో వేళ్ళూనుకొన్నది.

2007 ఫిబ్రవరి 7 న క్యారిటర్ కీన్ ని సొంతం చేసుకొన్నది. కానీ అప్పటి నుండి క్యారిటర్ కూడా కీన్ పేరుతో నే చలామణి అయినది.
2010 జూన్ 14 న ఎన్ టీ టీ డాటా, ఇంటెల్లిగ్రూప్ని కొన్నది.
2011 జనవరి 3 న ఎన్ టీ టీ డాటా, కీన్ ని సొంతం చేసుకొన్నది.

ఆపరేషంస్[మార్చు]

ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాంస్, జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా

బాహ్య లంకెలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కీన్&oldid=3438181" నుండి వెలికితీశారు