కీర్తి పాండియన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కీర్తి పాండియన్
2019లో కీర్తి పాండియన్
జననం (1992-02-18) 1992 ఫిబ్రవరి 18 (వయసు 32)
విద్యాసంస్థచెట్టినాడ్ విద్యాశ్రమం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2019–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
తల్లిదండ్రులు
బంధువులుకవిత పాండియన్ (సోదరి)
కిరణ పాండియన్ (సోదరి)
రమ్య పాండియన్ (కజిన్)

కీర్తి పాండియన్ (జననం 1992 ఫిబ్రవరి 18) భారతీయ నటి, ఆమె ప్రధానంగా తమిళ సినిమాలు, టెలివిజన్ ధారావాహికలలో నటిస్తుంది. ఆమె 2019లో తుంబా చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. గోకుల్ దర్శకత్వం వహించిన సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం అన్బిర్కినియాల్‌ (2021)లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె నటుడు, రాజకీయ నాయకుడు అరుణ్ పాండియన్ కుమార్తె. అలాగే నటి రమ్య పాండియన్ కజిన్. పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన ఆమెకు తుంబాకుగాను ఫెమినా సూపర్ డాటర్ అవార్డు వరించింది.

ఆమె ఫైర్ ఈటర్ ఎంటర్‌టైనర్ అంటే నిప్పుతో ప్రదర్శన ఇస్తుంది.[1] వ్యవసాయంలోనూ కొత్త సాంకేతికతపై ఆసక్తిచూపించడం ఆమెకు ఉన్న మరో అభిరుచి.[2][3]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

కీర్తి పాండియన్ 1992 ఫిబ్రవరి 18న తమిళనాడులోని చెన్నైలో విజయ పాండియన్, అరుణ్ పాండియన్ దంపతులకు జన్మించింది.[4] ఆమెకు కవిత పాండియన్, కిరణ పాండియన్ అనే ఇద్దరు అక్కలు ఉన్నారు.[5] ఆమెకు నటి రమ్య పాండియన్ కజిన్.[6] ఆమె చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమంలో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది.

కెరీర్

[మార్చు]

గ్రాడ్యుయేషన్ తర్వాత, ఆమె సంగీతరూపకం (ballet), సల్సా నృత్యం ప్రదర్శనలతో కెరీర్ మొదలుపెట్టింది. ఆపై 2015లో థియేటర్ యాక్టింగ్‌కి మారింది. ఆమె తన తండ్రికి చెందిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన A&P గ్రూప్స్‌లో ఆపరేషన్స్ హెడ్ డైరెక్టర్‌గా కూడా చేసింది, అదే సమయంలో తను సింగపూర్‌లో సొంత కంపెనీని స్థాపించి పంపిణీని చేపట్టింది. ఆడిషన్స్ సమయంలో, అరుణ్ పాండియన్ కుమార్తెగా కాక తనను తాను మొదటిపేరుతో మాత్రమే పరిచయం చేసుకునేది.

హరీష్ రామ్ దర్శకత్వంలో వచ్చిన తుంబా (2019) తన తమిళ తొలి చిత్రం.[7][8][9] తర్వాత మలయాళ చిత్రం హెలెన్ (2019)కి రీమేక్ అయిన అన్బిర్కినియాల్ (2021)లో ఆమె తండ్రితో పాటు ప్రధాన పాత్రలో నటించింది.[10][11] అన్బిర్కినియాల్‌ను తెలంగాణా టుడే ఉత్తమ దక్షిణ భారత థ్రిల్లర్ చిత్రాలలో ఒకటిగా పేర్కొన్నది.[12] జీ5లో విడుదలైన పోస్ట్‌మ్యాన్ అనే కామెడీ సిరీస్‌లో కూడా ఆమె నటించింది.[13]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2023 సెప్టెంబరు 13న ఆమె తిరునల్వేలిలో హిందూ సంప్రదాయంలో నటుడు అశోక్ సెల్వన్‌ని వివాహం చేసుకుంది.[14][15][16]

మూలాలు

[మార్చు]
 1. "Actress Keerthi Pandian performs fire eating with street performers". The Times of India. 17 December 2021. Archived from the original on 27 January 2022. Retrieved 27 January 2022.
 2. "Keerthi Pandian is excited about learning a new skill in farming". Cinema Express. 29 May 2021. Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
 3. "Farming keeps 'Thumbaa' actress Keerthi Pandian busy during lockdown". The Times of India. 28 April 2020. Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.
 4. "Actress Keerthi Pandian". Nettv4u. Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
 5. "Helen Tamil remake titled Anbirkiniyal". Cinema Express. 15 February 2021. Archived from the original on 16 July 2021. Retrieved 15 October 2021.
 6. "Bigg Boss Tamil 4 contestant Ramya Pandian's profile, photos and everything you need to know". The Times of India. 4 October 2020. Archived from the original on 22 December 2020. Retrieved 15 October 2021.
 7. "Keerthi Pandian debuts in fantasy adventure". Deccan Chronicle. 23 June 2019. Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
 8. S, Srivatsan (20 February 2019). "'Thumbaa' was an instinctive yes, says Keerthi Pandian". The Hindu. Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.
 9. "Arun Pandian's daughter Keerthi makes her film debut". The New Indian Express. 18 February 2019. Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.
 10. "Keerthi Pandian signs her second film in Tamil". DT Next. 8 February 2020. Archived from the original on 4 April 2021. Retrieved 8 September 2021.
 11. "Arun Pandian and daughter Keerthi's film titled Anbirkiniyal". DT Next. 16 February 2021. Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
 12. "5 fantastic thrillers from South India that you can binge watch". Telangana Today. 16 July 2021. Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.
 13. "Web series 'Postman' delivers promising entertainment". Daily News and Analysis. 26 June 2019. Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
 14. "Ashok Selvan, Keerthi Pandian tie the knot in close-knit traditional ceremony. See photos". The Indian Express. 13 September 2023. Archived from the original on 14 September 2023. Retrieved 14 September 2023.
 15. "Ashok Selvan and Keerthi Pandian are married. Check out dreamy first official wedding pics". Hindustan Times. 13 September 2023. Archived from the original on 14 September 2023. Retrieved 14 September 2023.
 16. "హీరోయిన్ కీర్తి పాండియ‌న్ ను పెళ్లి చేసుకున్న హీరో అశోక్ సెల్వన్ (ఫొటోలు) | Keerthi Pandian And Ashok Selvan's Wedding Photos Goes Viral - Sakshi". web.archive.org. 2023-09-14. Archived from the original on 2023-09-14. Retrieved 2023-09-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)